Ys sharmila : చెల్లెమ్మకు ఆ విధంగా ఆసరా.. భరోసా…అందుకేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. ముందుగా తెలంగాణ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా జగన్ సాయం కోరతారు. ప్రధానంగా [more]

Update: 2021-11-05 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. ముందుగా తెలంగాణ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా జగన్ సాయం కోరతారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం ఓట్లను జగన్ సోదరి షర్మిల పార్టీ చీల్చుకుంటుందన్న విశ్లేషణల నేపథ్యంలో జగన్ సాయం కేసీఆర్ కు అవసరం. అందుకే జగన్ కూడా ఇప్పుడిప్పుడే కేసీఆర్ ను తన గ్రిప్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాదయాత్ర ద్వారా…

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టారు. జగన్ ను కాదని ఆమె పార్టీ పెట్టారన్న వార్తలొచ్చాయి. అందులో నిజానిజాలను పక్కన పెడితే షర్మిల పాదయాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాదయాత్ర ద్వారా ఆమె జనంలోకి వెళ్లి బలోపేతం అవుతారని భావించారు. కానీ పాదయాత్ర మొదట్లోనే ఊహించని విధంగా అన్న జగన్ నుంచి మద్దతు రావడం ప్రారంభమయింది. ఇది జగన్ కేసీఆర్ కు ఇస్తున్న పరోక్ష హెచ్చరికేనంటున్నారు.

వారు వచ్చి వెళ్లడంతో….

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఒకసారి వైవీ సుబ్బారెడ్డి వచ్చి కలసి వెళ్లారు. షర్మిల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చి వెళ్లారు. పాదయాత్రలో ఆమెతో కలసి నడిచి గంటసేపు ముచ్చటించి వెళ్లారు. సుబ్బారెడ్డి బాబాయి కాగా, ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఇలా వైసీపీ నేరుగానే షర్మిల పార్టీకి మద్దతు ఇస్తుందనే చెప్పాలి.

అందుకేనట…

ప్రధాన కారణం తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణ వైసీపీ నేతలు ఇతర పార్టీల చెంతకు చేరుతున్నారు. కొందరు ఇప్పటికే అధికార టీఆర్ఎస్ లోకి, మరికొందరు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వైసీపీ నేతలను తిరిగి షర్మిల పార్టీలోకి రప్పించేందుకే ఈ సంకేతాలను పంపారంటున్నారు. పాదయాత్ర సమయంలోనే నేతలు పార్టీ లో చేరితే కొంత బలం పుంజుకుంటుందని, అందుకే జగన్ వరసగా తన మనుషులను చెల్లెలు పాదయాత్ర వద్దకు పంపుతున్నారంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ నోటికి కూడా కొంత తాళం వేయవచ్చన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

Tags:    

Similar News