ys sharmila : తక్కువ అంచనా వేశారో.. ఇక అంతే?
నిజమే అందరూ అంటున్నట్లు ఆమె తెలంగాణ వాసి కాదు. మూలాలు ఆంధ్రావే. తెలంగాణ వ్యతిరేకి కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె వేసే అడుగులు అన్ని రాజకీయ పార్టీలను [more]
;
నిజమే అందరూ అంటున్నట్లు ఆమె తెలంగాణ వాసి కాదు. మూలాలు ఆంధ్రావే. తెలంగాణ వ్యతిరేకి కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె వేసే అడుగులు అన్ని రాజకీయ పార్టీలను [more]
నిజమే అందరూ అంటున్నట్లు ఆమె తెలంగాణ వాసి కాదు. మూలాలు ఆంధ్రావే. తెలంగాణ వ్యతిరేకి కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె వేసే అడుగులు అన్ని రాజకీయ పార్టీలను కదిలిస్తున్నాయి. ఒకరకంగా పరుగులు పెట్టిస్తున్నాయని చెప్పాలి. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో నవ్వుకున్న వారు కొందరు. హేళన చేసిన వారు మరికొందరు. అక్క పార్టీ సోషల్ మీడియాకే పరిమితం అనే వారు ఇంకొందరు. కానీ వైఎస్ షర్మిల కసితో పనిచేస్తున్నారు. క్యాడర్ ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి సమస్యపై తక్షణం స్పందిస్తున్నారు.
ఏడాది కూడా కాకముందే….
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఏడాది కూడా గడవ లేదు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బహుశ తెలంగాణలో విపక్షంలో ఉన్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గత ఏడేళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేపట్టి ఉండవు. కానీ వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీల్లో కూడా చలనం మొదలయిందనే చెప్పాలి. అసలుకే ఎసరు వస్తుందనుకున్నారేమో. మొత్తం మీద కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చింది. బీజేపీ పాదయాత్రను మొదలు పెట్టింది.
క్యాడర్ లేకపోయినా?
నిజానికి వైఎస్ షర్మిలకు పార్టీకి బలమైన క్యాడర్ లేదు. సొంత అన్న జగన్ పార్టీ వైసీపీ కి చెందిన నేతలు కూడా కలసి రావడం లేదు. ఆమె తనంతట తానే పార్టీ నిర్మాణానికి పూనుకుంది. జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించింది. యువతతో సమావేశమయింది. ప్రస్తుత అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టింది. తెలంగాణ వచ్చాక ఎవరు లాభపడ్డారో వివరించింది. ఇక నిరుద్యోగ సమస్యపై జిల్లాల వారీగా ప్రతి మంగళవారం దీక్షలు చేస్తుంది. దీంతో మిగిలిన పార్టీలు కూడా అలెర్ట్ అయ్యాయి.
ఇతర పార్టీల నేతలు…
వైఎస్ షర్మిల పట్టుదలకు ఉదాహరణ సైదాబాద్ లో సింగరేణి కాలనీలో జరిగిన సంఘటనే. అత్యాచారానికి, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని అందరిలాగే షర్మిల పరామర్శించారు. ఇతర రాజకీయ నేతల్లాగా ఆమె వదలలేదు. కుటుంబానికి పదికోట్ల నష్టపరిహారం చెల్లించాలని, నిందితుడిని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల అక్కడే దీక్షకు దిగారు. ఇది ఆమె వ్యతిరేకులను సయితం ఆకట్టుకుంది. వైఎస్ షర్మిల దీక్షకు దిగడంతో మిగిలిన రాజకీయ పార్టీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. డిమాండ్లు సాధిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే వైఎస్ షర్మిల రాజకీయంగా వేసే అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేస్తున్నాయని చెప్పక తప్పదు.