హంతకులు అంత తెలివైన వారా?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎటూ తేలడం లేదు. నిందితులెవరో తేల్చలేదు. సీబీఐ విచారణ చేస్తున్నప్పటికీ కీలక ఆధారాలు లభించలేదు. ఎప్పటికప్పుడు వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో [more]

Update: 2021-05-09 00:30 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎటూ తేలడం లేదు. నిందితులెవరో తేల్చలేదు. సీబీఐ విచారణ చేస్తున్నప్పటికీ కీలక ఆధారాలు లభించలేదు. ఎప్పటికప్పుడు వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో మిస్టరీని చేధిస్తామని ప్రకటనలు వస్తున్నా ఇంతవరకూ హత్యచేసిన వారు ఎవరు? హత్యకు గల కారణాలేంటి? అన్నది ఇంకా తేలకపోవడం ఆయన కుటుంబ సభ్యులకు మనస్థాపానికి గురి చేస్తుంది. నిజానికి హంతకులు అంత తెలివైన వారా? అన్న సందేహం కలుగుతుంది.

పథ్నాలుగు నెలలు….

వైఎస్ వివేకానందరెడ్డి హత్య మార్చి 15 వ తేదీ 2019 న జరిగింది. అంటే ఆయన హత్య జరిగి దాదాపు పథ్నాలుగు నెలలు పూర్తయింది. ఆయన సామాన్య వ్యక్తి కాదు. మాజీ మంత్రి. మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అయినా నిందితులను పట్టుకోలేకపోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. సొంత ఇంట్లోనే అతి దారుణంగా నరికి చంపిన హంతకులను పట్టుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫమయిందనే చెప్పాలి.

రెండు సిట్స్…..

వైఎస్ వివేకాందరెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన వెంటనే ఈ హత్యపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. అదీ కూడా ఏమీ తేల్చలేకపోయింది. ఆధారాలను నిందితులు చెరిపేశారంటూ అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. అనంతరం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తన బాబాయి వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసుపై మరో సిట్ ను ఏర్పాటు చేశారు. కొందరిని విచారించడం మినహా సాధించిందేమీ లేదు.

ఆధారాలెక్కడ?

ఇక ఈకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ వివేకాందరెడ్డి కుమార్తె సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం సీబీఐ ఈ కేసును పరిశోధిస్తుంది. ఇందులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిందితులను తప్పించే యత్నం జరుగుతుందా? కీలక ఆధారాలను సంఘటన స్థలం నుంచి ఎలా మాయమయ్యాయి? అసలు ఏ కారణాలతో వైఎస్ వివేకాందరెడ్డి హత్య జరిగింది? ఇవన్నీ ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించకపోతే దర్యాప్తు సంస్థలపైనే నమ్మకం పోతుందని చెప్పకతప్పదు. ఆ కుటుంబం అడిగే ప్రశ్నలకు, లెవనెత్తే సందేహాలకు ఎప్పుుడుజవాబు దొరుకుతుంది?

Tags:    

Similar News