మా మొర వినేవారు లేరా ? వైసీపీ కార్యకర్తల రోదనకు రీజన్ ఇదే ?
వైసీపీలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాట వినిపిస్తోంది. మా మొరవినేవారు ఏరీ ? మమ్మల్ని వాడుకుని వదిలేస్తారా ? అంటూ.. నెత్తీనోరూ బాదుకుంటున్నారు కార్యకర్తలు. మరి [more]
;
వైసీపీలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాట వినిపిస్తోంది. మా మొరవినేవారు ఏరీ ? మమ్మల్ని వాడుకుని వదిలేస్తారా ? అంటూ.. నెత్తీనోరూ బాదుకుంటున్నారు కార్యకర్తలు. మరి [more]
వైసీపీలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాట వినిపిస్తోంది. మా మొరవినేవారు ఏరీ ? మమ్మల్ని వాడుకుని వదిలేస్తారా ? అంటూ.. నెత్తీనోరూ బాదుకుంటున్నారు కార్యకర్తలు. మరి దీనికి కారణం ఏంటి ? ఇప్పటి వరకు లేని ఈ ఆవేదన, ఆక్రందనకు కారణం ఏంటి ? కార్యకర్తలు ఎందుకు మొర పెట్టుకుంటున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. వాస్తవానికి ఏ పార్టీకైనా.. జెండా మోసేందుకు, నినాదాలు చేసేందుకు కార్యకర్తలే ప్రధానం. వైసీపీ విషయానికి వస్తే.. కార్యకర్తలు మరీ డిఫరెంట్. పార్టీని తమ సొంత పార్టీగా భావించారు. అధికారంలోకి వచ్చేందుకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కార్యకర్తలు కష్టపడ్డారు. వైసీపీ కార్యకర్తల కష్టం పదేళ్లు. పదేళ్ల పాటు రెండు సార్లు ప్రతిపక్షంలో ఉండి ఎంతో కష్టపడ్డారు.
పాదయాత్రలోనూ…
జగన్, షర్మిల పాదయాత్రను హైలెట్ చేస్తూ వీరిని జనాల్లోకి తీసుకు వెళ్లింది వీళ్లే. మరి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఏమైనా మేళ్లు చేశారా? అంటే.. లేదనే అంటున్నారు కార్యకర్తలు. ఏదో నామ్ కేవాస్తే.. అన్నట్టుగా కొందరిని.. వలంటీర్లుగా నియమించినా.. మెజారిటీ కార్యకర్తలు నేటికీ.. గాలిపటాల్లా గాల్లో ఎగురుతూనే ఉన్నారు. వారిని ఇటు ఎమ్మెల్యే కానీ, అటు కీలక నేతలు కానీ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి కార్యకర్తలు కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో వారి స్థాయిలో వారు చిన్న చిన్న పనులు చేయించుకోవాలని అనుకుంటారు.
ఎమ్మెల్యేలు సయితం….
అయితే.. వీరితో పనిచేయించుకున్న ఎమ్మెల్యేలు కానీ, పార్టీ అధిష్టానం కానీ.. ఇప్పుడు కార్యకర్తలను ఎక్కడా పట్టించుకోవడం లేదు. పోనీ.. క్షేత్రస్థాయిలో వలంటీర్లు అయినా.. పట్టించుకుని వీరికి పనిచేసి పెడుతున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఎమ్మెల్యేలే తమను జగన్ పట్టించుకోవడం లేదని.. తమ మాట చెల్లుబాటు కావడం లేదని వాపోతున్నారు. దీంతో వీరు కార్యకర్తలకు మాత్రం ఏం న్యాయం చేస్తామని గగ్గోలు పెడుతున్నారు. చివరకు ఎమ్మెల్యేలు చెప్పిన వారికి నియోజక వర్గ స్థాయి పదవులు కూడా ఇవ్వకుండా నేరుగా జగనే నిర్ణయం తీసేసుకుంటున్నారు.
అభిమానం గంపెడంత ఉన్నా….
దీంతో అటు ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి ఇటు ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు పై స్థాయిలో ప్రయార్టీ లేకపోవడంతో వారు కార్యకర్తలను లైట్ తీస్కొంటున్నారు. “మాకు పనులు కావడం లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు బాగానే పోగేసుకున్నారు. మనం మాత్రం రోడ్డున పడ్డాం“ అని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అలాగని జగన్‌పై అభిమానం లేదా? అంటే.. గంపెడంత ఉంది. దీంతో పార్టీని విడిచి పెట్టలేక.. పది రూపాయల ఆదాయం లేక వైసీపీ కార్యకర్తలు తీవ్ర నరకం చవిచూస్తున్నారు. పరిస్థితి వచ్చే రెండేళ్లు కూడా ఇలానే ఉంటే.. ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై చెప్పేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం వీరిని పట్టించుకుంటుందో లేదో చూడాలి.