చిత్తూరు టు సిక్కోలు.. వైసీపీ తీరు మార‌దా?

చిత్తూరు నుంచి సిక్కోలు వ‌ర‌కు.. ఎక్కడిక‌క్కడ‌, ఏ జిల్లాకు ఆ జిల్లాలో వైసీపీ నేత‌ల‌తీరు మార‌డం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు.. ఎవ‌రికి [more]

Update: 2020-12-02 15:30 GMT

చిత్తూరు నుంచి సిక్కోలు వ‌ర‌కు.. ఎక్కడిక‌క్కడ‌, ఏ జిల్లాకు ఆ జిల్లాలో వైసీపీ నేత‌ల‌తీరు మార‌డం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు.. ఎవ‌రికి వారే ఆధిప‌త్య పోరులో ఆరితేరుతున్నారు. నువ్వా-నేనా అంటూ.. బ‌హిరంగ వేదిక‌ల‌పైనే కొట్లాట‌ల‌కు దిగుతున్నారు. పంపకాలు, ప్రాతినిధ్యాలు.. ఇలా.. ఒక‌టి కాదు.. ఏడాదిన్న పాల‌న‌లోనే ఏడాదిన్నర కాలంలోనే వైసీపీ నేత‌లు ఎవ‌రికి వారు ఇష్టా రాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. మొత్తానికి ముప్పయ్యేళ్లపాటు అధికారంలో ఉంటామ‌ని జ‌గ‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా.. ప్రస్తుతం వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో మ‌రో మూడున్నరేళ్లకే ఎక్సప‌యిరీ డేట్ అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సొంతపార్టీలోనే….

శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే. డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాస్‌.. ఆయ‌న సోద‌రుడు ప్రసాద‌రావుకు మ‌ధ్య విభేదాలు క‌నిపిస్తున్నాయి. ఎవ‌రికివారే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. జల్లా వైసీపీ నేత‌ల మ‌ధ్య కూడా ఆధిప‌త్య పోరు జోరుగా ఉంది. టెక్కలి వైసీపీలో మూడు ముక్క‌లాట పంచాయితీ న‌డుస్తోంది. ఇక‌, విజ‌య‌న‌గ‌రంలో మంత్రి బొత్స దూకుడుతో ఇత‌ర నేత‌లు సై లెంట్ అయ్యారు. బొత్సకు ఎమ్మెల్యే కోల‌గ‌ట్లకు, బొత్సకు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి పొస‌గ‌డం లేదు. విశాఖ‌లో సాయిరెడ్డి ఇష్టారాజ్యంపై ఎమ్మెల్యేలు రోడ్డెక్కే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, తూర్పు, ప‌శ్చిమ‌లో మంత్రులు కేంద్రంగా నాయ‌కులు తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నారు. అభివృద్ధిని వ‌దిలేసి నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పంచుకుంటున్నార‌ని అందిన‌కాడికి దండుకుంటున్నార‌ని సొంత పార్టీలోనే విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

పన్నెండు నియోజకవర్గాల్లోనూ…

ఇక రాష్ట్రం మొత్తం మీదే ఒక్క కృష్ణా జిల్లాలో ఉన్నంత‌లో నేత‌ల మ‌ధ్య త‌క్కువ వివాదాలే క‌నిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య కుంపట్లు రాజుకున్నాయి. నెల్లూరులో జిల్లాలో మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో పాటు ఓ మంత్రి కేంద్రగా ఓ సామాజిక వ‌ర్గం చేస్తోన్న ఆధిప‌త్య రాజ‌కీయం మామూలుగా లేదు. ఇక‌, రాయ‌ల‌సీమ విష‌యానికి వ‌స్తే.. మంత్రులు డ‌మ్మీలుగా మారార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గానికి సీమ‌లో పెద్దగా ఒక్క పెద్దిరెడ్డి త‌ప్పిస్తే..) మంత్రి ప‌ద‌వులు ద‌క్కలేదు. ఇక బుగ్గన ఉన్నా ఆయ‌న ఇటీవల పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనిపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

మంత్రులు డమ్మీలుగా మారి…..

ఇక సీమ‌లో మిగిలిన మంత్రులు కె. నారాయ‌ణ స్వామి, జ‌య‌రాములు, శంక‌ర‌నారాయ‌ణ‌, అంజాద్‌బాషా వంటివారు ఉన్నప్పటికీ.. వీరికి ప్రాధాన్యం.. అధికారం కూడా త‌గ్గిపోయింది. దీంతో రెడ్డి వ‌ర్గం.. జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా ఉండే ఇత‌ర వ‌ర్గాల వారిదే.. ప్రాబ‌ల్యం క‌నిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌ల మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయి.. జిల్లాల‌ను సైతం పంచేసుకుని .. పాలిస్తున్న తీరు క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితి ఇలా ఉంద‌ని తెలిసి కూడా సీఎం జ‌గ‌న్ మాత్రం మౌనం వీడ‌డం లేదు. పైగా త‌న‌కు అనుకూలంగా సాయిరెడ్డి, స‌జ్జల రామ‌కృష్ణా రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రభాక‌ర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి వంటివారు చెప్పిందే.. ఫైన‌ల్ అని.. వారి మాట‌నే వినాల‌ని కూడా జ‌గ‌న్ ఆదేశిస్తుండ‌డంతో వైసీపీలో మ‌రిన్ని విభేదాలు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి.

Tags:    

Similar News