ఇకనైనా ఆ మత్తు వదిలించుకుంటేనే మంచిది.. ?
వైసీపీ బలం ఎక్కడ ఉంది అంటే కచ్చితంగా జగన్ లోనే అని చెప్పాలి. జగన్ ఇమేజ్ తోనే వైసీపీ 151 సీట్లను తెచ్చుకుంది. ఈ విషయంలో వేరేగా [more]
వైసీపీ బలం ఎక్కడ ఉంది అంటే కచ్చితంగా జగన్ లోనే అని చెప్పాలి. జగన్ ఇమేజ్ తోనే వైసీపీ 151 సీట్లను తెచ్చుకుంది. ఈ విషయంలో వేరేగా [more]
వైసీపీ బలం ఎక్కడ ఉంది అంటే కచ్చితంగా జగన్ లోనే అని చెప్పాలి. జగన్ ఇమేజ్ తోనే వైసీపీ 151 సీట్లను తెచ్చుకుంది. ఈ విషయంలో వేరేగా ఎవరు ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. జగన్ అన్న ఫ్యాక్టర్ 2019 ఎన్నికల్లో ఎంత బలంగా పనిచేసిందంటే టీడీపీ పుట్టిన తరువాత మరో పార్టీకి ఓటేసి ఎరగని ప్రాంతాలు కూడా ఫ్యాన్ పార్టీకి జై కొట్టాయి. టీడీపీ కంచు కోటలన్నీ కూడా ఒక్కపెట్టున కూలిపోయాయి. దటీజ్ జగన్ అన్నట్లుగా అప్పట్లో రాజకీయ కధ నడిచింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటింది. మరి ఆ ఊపు ఇపుడు ఉందా అన్నదే ప్రశ్న.
ఇప్పటికీ మైనస్….
వైసీపీకి మొదటి నుంచి ఉన్న అతి పెద్ద మైనస్ సంస్థాగత నిర్మాణం గట్టిగా లేకపోవడం. పార్టీలో చూస్తే పై స్థాయిలోనే అంతా సాగిపోతుంది. పల్లెల దాకా క్యాడర్ ఉన్నా వారిని పార్టీ లైన్ లోకి తెచ్చి కమిటీలు గట్టిగా వేసి పనిచేయించుకునే కచ్చితమైన పార్టీ యంత్రాంగం ఇప్పటికీ వైసీపీకి లేదు. ఈ కారణం వల్లనే 2013లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ దారుణంగా దెబ్బతింది. నాడు ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కంటే టీడీపీ చాలా ఎక్కువ సీట్లు సంపాదించుకుంది.
పట్టించుకోరుగా ….?
జగన్ దాదాపుగా పార్టీని పక్కన పెట్టేసారు. ఆయన బాధ్యతలు అన్నీ కూడా పార్టీలో తాను నమ్మిన నాయకుల మీదన పెట్టేశారు. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకే కార్యకర్తల అండ ఇంకా కావాలి. ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరువ చేసే బాధ్యతను వారే తీసుకుంటారు. కానీ వైసీపీ మాత్రం పార్టీని వదిలేసి అధికారం మత్తులో పడిపోయిందనే అంటున్నారు. పైగా గ్రామ స్థాయిలో వాలంటరీ వ్యవస్థను నమ్ముకుంది. దీంతో కార్యకర్తలు ఇపుడు పార్టీకు బాగా దూరం జరిగిపోయారు. ఈ సమయంలో లోకల్ బాడీ ఎన్నికలు అంటే వైసీపీకి కత్తి మీద సాము అంటున్నారు. క్యాడర్ తో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కంటే కూడా గ్రామీణ కార్యకర్తే ముఖ్యమన్న సంగతిని పార్టీ పూర్తిగా విస్మరించింది అంటున్నారు.
ఏం లాభం …?
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి మరీ అనేకా సంక్షేమ పధకాలను అమలుచేసింది. కానీ వాటిని జనాల వద్దకు తీసుకెళ్ళి ప్రచారం చేసే కార్యకర్తలు ఆ పార్టీకి ఇపుడు లేకుండా పోయారు. వాలంటీర్లు ఇస్తున్నారు, మేము పుచ్చుకుంటున్నాం అన్నట్లుగానే సగటు జనం ఉన్నారు. ఈ నేపధ్యంలో పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేవారు లేకపోవడంతో స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి అది ఇబ్బందిగా మారుతుంది అంటున్నారు. అదే సమయంలో టీడీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. సంస్థాగతంగా కూడా ఆ పార్టీ గట్టిగా ఉంది. పైగా లోకల్ బాడీ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా కూడా టీడీపీ తీసుకుంటోంది. దీంతో ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే కచ్చితంగా టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.