కాలు దువ్వితే….కర్సయిపోయేది ఎవరు?
అధికారంలో ఉన్నారంటే గాజు గదిలో ఉన్నట్లే లెక్క. బయట నుంచి రాళ్లేసే వాళ్లే ఎక్కువ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా ప్రతిపక్ష పార్టీ తనకు అనుకూలంగా [more]
;
అధికారంలో ఉన్నారంటే గాజు గదిలో ఉన్నట్లే లెక్క. బయట నుంచి రాళ్లేసే వాళ్లే ఎక్కువ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా ప్రతిపక్ష పార్టీ తనకు అనుకూలంగా [more]
అధికారంలో ఉన్నారంటే గాజు గదిలో ఉన్నట్లే లెక్క. బయట నుంచి రాళ్లేసే వాళ్లే ఎక్కువ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా ప్రతిపక్ష పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవుతుంది. అందుకే అపోజిషన్ పార్టీ ఏం మాట్లాడినా సంయమనం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. వైసీపీ నేతలే విపక్ష పార్టీ నేతలకు సవాళ్లు విసురుతున్నారు. అవనసర చర్చను ప్రజల్లో జరిగేలా వైసీపీ నేతలే తీసుకెళుతున్నారన్న అభిప్రాయం పార్టీలోనే విన్పిస్తుంది.
విమర్శలు సాధారణమే….
అధికార పార్టీ అన్నాక విమర్శలు సర్వసాధారణమే. దానిని ఒక వివరణ ఇచ్చుకున్నా, ప్రతి విమర్శ చేసినా సరిపోతుంది. కానీ విమర్శలు చేయడమే కాకుండా దానికి పీక్ కు తీసుకెళుతున్నారు వైసీపీ నేతలు. అనపర్తిలో ఇదే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ల మధ్య విమర్శల పర్వం కొనసాగింది. అంతటితో ఆగకుండా దానిని బిక్కవోలు వినాయకుడి ప్రమాణం వరకూ తీసుకెళ్లారు. అప్పటి వరకూ కొంత ప్రాంతానికే పరిమితమయిన ఈ విమర్శ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది.
పెద్దారెడ్డి అంశం తీసుకుంటే….
ఇక తాడిపత్రిలో ఇసుక దందా నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బండికి పదివేలు వసూలు చేస్తున్నారని కొందరు టీడీపీ వర్గీయులు సోషల్ మీడయాలో పోస్టింగ్ పెట్టారు. ఇది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లయితే సరిపోయేది. కానీ పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో రాష్ట్రమంతటా ఇసుక దందా వ్యవహారం తెలిసిపోయింది. పెద్దిరెడ్డి దీనిని ఖండించినా ప్రజలు మాత్రం గొడవకు ఇసుక దందాయే కారణమని రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు.
విశాఖలోనూ భూదందాపై…..
ఇక విశాఖలోనూ భూదందాలపై టీడీపీ వర్సెస్ వైసీపీ ల మధ్య వార్ నడుస్తుంది. దేవుడి ఎదుట ప్రమాణం చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాధ్ కూడా ఎంటర్ కావడంతో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం లభించింది. ఇలా వైసీపీ నేతలే తమపై విమర్శలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఇది మొత్తం పార్టీ మీద ప్రభావం పడుతుందని ఆందోళన పార్టీలో వ్యక్తమవుతుంది.