మావాళ్లు సేఫ్‌.. ఆ స‌ల‌హాదారు వ్యాఖ్యల‌తో వైసీపీలో హ్యాపీ

“సార్‌.. సార్‌.. ఆల‌యాల‌పై దాడులు భీక‌రంగా జ‌రుగుతున్నాయి. మొన్న అంత‌ర్వేది.. నిన్న.. రామ‌తీర్థం. మ‌రి మంత్రిపై సీఎం యాక్షన్ ఏమైనా ఉంటుందా?“-అని ఇటీవ‌ల ఓ పాత్రికేయుడు.. ప్రభుత్వంలో [more]

;

Update: 2021-02-07 06:30 GMT

“సార్‌.. సార్‌.. ఆల‌యాల‌పై దాడులు భీక‌రంగా జ‌రుగుతున్నాయి. మొన్న అంత‌ర్వేది.. నిన్న.. రామ‌తీర్థం. మ‌రి మంత్రిపై సీఎం యాక్షన్ ఏమైనా ఉంటుందా?“-అని ఇటీవ‌ల ఓ పాత్రికేయుడు.. ప్రభుత్వంలో సీఎం త‌ర్వాత సీఎంగా వ్యవ‌హ‌రించే ఓ స‌ల‌హాదారును ప్రశ్నించాడు. దీనిని ఆయ‌న చెప్పిన స‌మాధానం విని.. పాత్రికేయుడు ఆశ్చర్యపోయి. గుట‌క‌లు మింగాడు. “ఈ రోజు అక్కడ‌న్నారు. రేపు ఇంకోచోట అంటారు. ఎంత మంది మంత్రుల‌ను మారుస్తాం. గోదావ‌రిలో పుష్కరాల స‌మ‌యంలో పాతిక‌ మంది చ‌చ్చిపోయారు. దీనికి అప్పటి సీఎం రాజీనామా చేయాల‌ని నువ్వు అడిగావా?“ అని స‌ద‌రు స‌ల‌హాదారు ప్రశ్నించారు.

ముందు మీరు ప్రశ్నించుకోండి…?

క‌ట్ చేస్తే… వైసీపీలో ఒక‌రిద్దరు మంత్రుల‌ను సైతం ఈ పాత్రికేయుడు వ‌ద‌లకుండా ఇదే ప్రశ్న సంధించాడు. “మా సీఎంగారికి ఆ ఉద్దేశం లేదు. రెండున్నరేళ్లత‌ర్వాతే ఏదైనా మార్పు ఉంటుంది. మీకంత‌గా కోరిక‌గా ఉంటే.. సీఎం ను క‌లిసి అడ‌గండి. ఆయ‌నా అదే చెబుతారు.“ అని స‌మాధానం ఇచ్చారు. ఇక‌, ఆ పాత్రికేయుడు.. మాకు సీఎంకు చాలా దూరం క‌దా సార్‌! అనిఅనడంతో .. అదంతా మీరే చేసుకుంటున్నారు. ఒక్కటంటే ఒక్కవార్తయినా.. పాజిటివ్‌గా ఇస్తున్నారా. ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండ‌య్యా! త‌ర్వాత మ‌మ్మల్ని ప్రశ్నించొచ్చు! అని వీరు కూడా ఎదురు దాడి చేసేశారు.

ఎవరిని కదిలించినా….?

ఇక‌, ఈ పాత్రికేయుడు పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు, వృద్ధ నాయకుల‌ను క‌లిసి జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను దృష్టికి తెచ్చి ఆ మంత్రిపై చ‌ర్యలు ఏమైనా ఉంటాయా ? అని ప్రశ్నించారు. దీనికివారు కూడా మాకు తెలియ‌దు.. ఉంటే క‌బురు చేస్తాం.. అయినా ప్రభుత్వమే ప్రక‌టిస్తుందిగా! అని స‌మాధానం చెప్పార‌ట‌. ఇక‌, పార్టీ శ్రేణులు ఈ వ్యాఖ్యలు తెలిసి ఉబ్బిత‌బ్బిబ్బవుతున్నాయి. మా నాయ‌కుడు ఏం చేసినా.. ఎవ‌రినీ ఏమీ అన‌రు.. అని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఏం చేసినా.. సీఎం కు మ‌ర‌కలు అంట‌కుండా ఉంటే చాల‌నే ధోర‌ణిలో ఉన్నార‌ని చెబుతున్నారు. సో.. ఇదీ సంగ‌తి.

Tags:    

Similar News