వైసీపీ ఎమ్మెల్యేల‌తో ఆ మంత్రుల‌కు టార్చర్ ?

ఏపీలో అధికార వైసీపీకి అధికారం ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతిప‌క్ష పార్టీల‌తో అస‌లు వైసీపీకి అసెంబ్లీలోనూ, బ‌య‌టా వ‌చ్చిన చిక్కేలేదు. పై నుంచి కింది వ‌ర‌కు [more]

Update: 2021-04-07 03:30 GMT

ఏపీలో అధికార వైసీపీకి అధికారం ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతిప‌క్ష పార్టీల‌తో అస‌లు వైసీపీకి అసెంబ్లీలోనూ, బ‌య‌టా వ‌చ్చిన చిక్కేలేదు. పై నుంచి కింది వ‌ర‌కు అధికారం వైసీపీదే. అయితే సొంత పార్టీ నేత‌ల‌తోనే చాలా మందికి చిక్కు వ‌చ్చిప‌డుతోంది. వాళ్లలో వాళ్లకే పొస‌గ‌డం లేదు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ సైతం ఈ విష‌యంలో చూసి చూడ‌న‌ట్టు ఉండ‌డంతో ఎమ్మెల్యేలు చాలా మంది పేట్రేగుతోన్న ప‌రిస్థితి ఉంది. అందుకే త‌మ‌ను ఎవ‌రూ అనేవారు లేర‌ని ఎమ్మెల్యేలు మ‌రింత రెచ్చిపోతున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి కేబినెట్ ఏర్పాటు అయిన‌ప్పటి నుంచి నాలుగైదు జిల్లాల్లో ఇదే ప‌రిస్థితి ఉండ‌గా.. ఇప్పుడు ఈ అలుసుతో మ‌రి కొన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు మంత్రుల‌ను లెక్క చేయకుండా రెచ్చిపోతున్నారు.

పదేపదే జగన్ చెబుతున్నా…..

జ‌గ‌న్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంద‌రూ క‌లిసే నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ, జిల్లాల్లోనూ ప‌ని చేయాల‌ని ప‌దే ప‌దే సూచిస్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం మంత్రుల‌ను ఇబ్బంది పెడుతూ రాజ‌కీయం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేల ముందు చాలా మంది మంత్రులే డ‌మ్మీలు అవుతున్నారంటే.. ఇక ఎంపీల ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. చాలా మంది ఎంపీలు క‌నీసం స్వేచ్ఛగా త‌మ పార్లమెంటు ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రైవేటు ఫంక్షన్లకు వెళ్లినా ఎమ్మెల్యేల‌కు చెప్పక‌పోతే వారికి కోపం వ‌చ్చేస్తోంది.

మొండి వాదనతో…..

అదేంటంటే వైసీపీలో సీనియ‌ర్లం… రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచాం… మేం మంత్రులం అయ్యి ఉండాల్సింది.. మా క‌ర్మకొద్ది ఏవేవో కొన్ని కార‌ణాల‌తో ప‌ద‌వి రాలేదు.. అంత మాత్రానా త‌మ మాట నెగ్గాల్సిందే అన్న మొండి వాద‌న‌తో కొంద‌రు ఎమ్మెల్యేలు మంత్రులు, ఎంపీల‌ను ఇబ్బంది పెడుతున్నారు. మ‌రి కొన్ని జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు సీనియ‌ర్ మంత్రుల దూకుడుతో జూనియ‌ర్లు బేంబేలు ఎత్తుతున్నారు. ఉత్తరాంధ్రలో ఓ జూనియ‌ర్ మంత్రి అయితే సీనియ‌ర్ మంత్రి దెబ్బతో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఆయ‌న వేలు పెట్టడంతో త‌న‌కు ఈ మంత్రి ప‌ద‌వి వ‌ద్దని ఓపెన్‌గానే క‌న్నీళ్లు పెట్టుకున్న ప‌రిస్థితి.

సీమ జిల్లాల్లో కామన్ గా…..

ఇక సీమ జిల్లాల్లో ఈ ప‌రిస్థితి కామ‌న్ అయిపోయింది. అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లో కొంద‌రు మంత్రులు వైసీపీ సీనియ‌ర్ల ముందు పూర్తి డ‌మ్మీలు అయిపోయారు. ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ ఓ మంత్రి ఇప్పటికే డ‌మ్మీ అయిపోయార‌న్న టాక్ ఉంది. ఆ మంత్రి శాఖ ప‌నితీరుపై జ‌గ‌న్ సైతం సంతృప్తిగా లేరు. దీంతో జిల్లాలో కొంద‌రు ఎమ్మెల్యేలు ప‌నుల విష‌యంలో ఆమెను గ‌ద‌మాయిస్తోన్న ప‌రిస్థితి. జూనియ‌ర్ కావ‌డం… మ‌రోవైపు జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌ల‌కు ఎలాంటి ఫిర్యాదు చేస్తారో ? అన్న భ‌యంతో ఆ మంత్రి కూడా మాట్లాడ‌లేని ప‌రిస్థితి.

మంత్రులకే ఫోన్ చేసి…..

కొంద‌రు మంత్రుల‌పై జిల్లాల‌తో సంబంధం లేక‌పోయినా ప‌లువురు వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యేలు పార్టీకోసం ఎప్పటి నుంచో ప‌ని చేస్తున్నాం… మా ప‌ని చేసి పెట్టాల్సిందే… అని నోరు మొత్తని మంత్రుల‌కు ఫోన్లు చేసి మ‌రీ బెద‌రిస్తోన్న ప‌రిస్థితి. మంత్రులు కూడా జ‌గ‌న్‌కు చెప్పుకోలేక జిల్లా ఇన్‌చార్జ్ నేత‌ల‌కు చెప్పుకోవ‌డం మిన‌హా చేసేదేం లేక ఊసురోమంటోన్న ప‌రిస్థితి. మ‌రి జ‌గ‌న్ ఈ సీనియ‌ర్లు, ఎమ్మెల్యేల దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే మంత్రులు మ‌రింత వీక్ అవ్వడం ఖాయం.

Tags:    

Similar News