ఆయనకే మంత్రి పదవి ఇస్తే పోలా.. వైసీపీలో సంచలన డిబేట్
తూర్పుగోదావరిజిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన డిబేట్ తెరమీదికి వచ్చింది. “మాకు అవసరమని అడిగామా ? ఆయనకే మంత్రి పదవి ఇచ్చేస్తే.. బాగుండేది!“ అని ఒకరిద్దరు మంత్రులు అన్నట్టుగా నేతల [more]
;
తూర్పుగోదావరిజిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన డిబేట్ తెరమీదికి వచ్చింది. “మాకు అవసరమని అడిగామా ? ఆయనకే మంత్రి పదవి ఇచ్చేస్తే.. బాగుండేది!“ అని ఒకరిద్దరు మంత్రులు అన్నట్టుగా నేతల [more]
తూర్పుగోదావరిజిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన డిబేట్ తెరమీదికి వచ్చింది. “మాకు అవసరమని అడిగామా ? ఆయనకే మంత్రి పదవి ఇచ్చేస్తే.. బాగుండేది!“ అని ఒకరిద్దరు మంత్రులు అన్నట్టుగా నేతల మధ్య చర్చ సాగుతోంది. దీంతో అసలు ఇంత దూరం రాజకీయాలు ఎలా వచ్చాయి.? అసలు ఏం జరిగింది? అనే చర్చ కీలకంగా మారింది. జిల్లాలో ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్. వీరిలో కురసాల దూకుడుగా ఉంటున్నారు. ఇటు పాలనా పరంగా .. తన శాఖను ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ పరంగానూ ఆయన ప్రత్యర్థులపై దూకుడు చూపిస్తున్నారు. అయితే.. కొన్నాళ్లుగా ఆయనకు పార్టీలో నేతల నుంచి సహకారం లభించడం లేదు.
ఆయనే కీలకంగా మారి….
ముఖ్యంగా ఇదే జిల్లాలో ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక ఎమ్మెల్యే.. అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు. ఇది మంత్రి వర్గానికి రుచించడం లేదు. పైగా అధికారిక కార్యక్రమాల విషయంలోనూ మంత్రి కురసాలకు చాలా రోజులుగా తగిన ప్రాధాన్యం లభించడం లేదు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు కన్నబాబును కావాలనే పక్కన పెట్టేస్తున్నారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది. అధికారులు కొందరు .. సమాచారం ఇవ్వడంలోను, ఏర్పాట్లు చేయడంలోను ఒక విధమైన నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు మంత్రి డుమ్మా కొట్టారు.
మౌనంగానే….?
ఇక, తన నియోజకవర్గానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు.. సదరు దూకుడు ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడుతున్న విషయం కూడా కన్నబాబు చెవినపడింది. దీంతో వీరిని హెచ్చరించాలా ? లేక వదిలేయాలా? అనే తర్జన భర్జన ఆయనలో కనిపిస్తోంది. తనకు మంత్రి పదవి లభించడమే తప్పయిందా ? లేకపోతే.. ఇంత దారుణంగా తన పరిస్థితి ఉండేది కాదా.. అంటూ.. కొన్నాళ్లుగా.. తన అనుచరులతోనూ మంత్రి అంటున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో ఆయన కారణాలు ఏమైనా.. మౌనంగా ఉంటున్నారు. గతంలో ఉన్న దూకుడు చూపించడం లేదు.
మనస్తాపానికి గురై….?
పవన్ నేరుగా తూర్పుగోదావరిలో పర్యటించి.. ప్రభుత్వం పై విమర్శలు చేసిన సమయంలోనూ అదే జిల్లాకు చెందిన కురసాల మాత్రం మౌనంగా ఉన్నారు. కానీ, గతంలో పవన్ హైదరాబాద్ నుంచి విమర్శలు గుప్పించినా.. స్పందించారు. ఢీ అంటే.. ఢీ అన్నట్టుగా జనసేనతో తలపడ్డారు. కానీ, ఇప్పుడు మాత్రం ఫుల్ సైలెంట్ అయ్యారు. దీనికి సదరు దూకుడు ఎమ్మెల్యే వైఖరే కారణమని అంటున్నారు వైసీపీ నాయకులు.. అంతర్గతంగా కుమ్ములాటలు చోటు చేసుకోవడం.. వాల్యూలేకుండా చేయడం వల్ల కొంత బాధపడుతున్నారు! అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకే మంత్రి పదవి ఇస్తే.. బాగుండేది.. అని సదరు మంత్రి అన్నట్టు వైసీపీలో సంచలన డిబేట్ సాగుతుండడం గమనార్హం. మరి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.