ఇక స్టార్ట్ అయినట్లేనటగా
గోదావరి అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ గుడా ఛైర్మెన్ గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యాన్ని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 20 మండలాలు 203 గ్రామాలు, 884 [more]
;
గోదావరి అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ గుడా ఛైర్మెన్ గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యాన్ని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 20 మండలాలు 203 గ్రామాలు, 884 [more]
గోదావరి అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ గుడా ఛైర్మెన్ గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యాన్ని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 20 మండలాలు 203 గ్రామాలు, 884 కిలోమీటర్ల పరిధిలో గుడా సామ్రాజ్యానికి రెండో ఛైర్మన్ గా సుబ్రహ్మణ్యం కానున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వైసిపి ఘోరపరాభవాలు మూటగట్టుకుంది. రాష్ట్రమంతా వైసిపి సునామీ వీస్తే అందులోను తూర్పుగోదావరి జిల్లాలో సైతం అదే స్థాయిలో గాలి వీచినా ఈ రెండింటిలో పరాజయం చెందడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలో లుకలుకలు, నాయకత్వ లోపాలపై అధ్యయనం చేసి రాజమండ్రి సిటీ ఇంచార్జ్ గా శివరామ సుబ్రమణ్యానికి పగ్గాలు అప్పగించారు. కేవలం పార్టీ పగ్గాలు మాత్రమే అప్పగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి అధికార పదవిని కట్టబెట్టారు.
పోటీ తీవ్రంగా ఉన్నా …
ప్రతిష్టాత్మకం అయిన ఈ పదవికోసం వైసిపి లో హేమా హేమీలంతా పోటీ పడ్డారు. పవర్ పలుకుబడితోబాటు రెండుజిల్లాల్లో హవా నడిచే ఇలాంటి పోస్ట్ ఎవరు మాత్రం ఇష్టపడరు. అయితే ఎందరు పోటీపడినా వచ్చే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న జగన్ శివరాముడి వైపే మొగ్గుచూపారు. మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి వంటివారితో బాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పార్టీలోని ముఖ్యులు, వైసీపీ ఎమ్యెల్యేలు గుడా కోసం గట్టి ప్రయత్నాలే చేసినా పని జరగలేదు.
వైసిపి లో గ్రూప్ లు మొదలైనట్లేనా …
ప్రస్తుతానికి అంతా కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా వైసిపి లో గ్రూప్ ల గోల నెమ్మదిగా మొదలైనట్లే అన్నది ఆ పార్టీ శ్రేణుల టాక్. కష్టపడి మొన్నటి ఎన్నికల్లో పనిచేసినా కొందరు నేతల వెన్నుపోటుతో ఓటమి చెందితే ఆదుకోవాలిసిన అధిష్టానం తమను పక్కన పెట్టి కొత్త గా వచ్చేవారికి అందలం ఎక్కించడాన్ని అంతర్గతంగా కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. గత ఐదేళ్లుగా పార్టీని భుజాన మోసినవారు ఆర్ధికంగా నష్టపోయిన వారిని కనీసం పరిగణలోకి తీసుకోవడం కానీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం కానీ చేయకపోతే క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళతాయని వాపోతున్నారు. అదే విధంగా పార్టీ బలోపేతం సంగతి ఎలా వున్నా నెమ్మది నెమ్మదిగా దెబ్బతింటుందని వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం చేదు అనుభవాలు ఎదురౌతాయని హెచ్చరిస్తున్నారు. జగన్ సంగతి ఎలా ఉన్నా వైసిపి వ్యవహారాలు చూస్తున్న వైవి సుబ్బారెడ్డి వంటివారి వ్యూహాలు లాభం కన్నా నష్టమే తెస్తాయని ఆఫ్ ది రికార్డ్ లో చెప్పడం గమనిస్తే రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో వైసిపి కి ఎదురు దెబ్బలు తప్పవంటున్నారు.
హర్షాతిరేకాల్లో శివరాముడి వర్గం …
మాజీ ఏపిఐఐసి ఛైర్మన్ శివరామ సుబ్రమణ్యానికి గుడా దక్కడంతో ఆయన వర్గం ఖుషి మీద వుంది. ఇక తమ నేత సత్తా నిరూపిస్తారని కార్పొరేషన్ ఎన్నికలే కాదు జిల్లాలో వైశ్య సామాజికవర్గం మొత్తం వైసిపి కి అండగా ఉండేలా కృషి చేస్తారని చెబుతున్నారు. ప్రముఖ బిల్డర్ గా సీనియర్ రాజకీయ వేత్తగా వున్న సుబ్రహ్మణ్యం కు ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యం బాగా కల్పించినా గ్రూప్ రాజకీయాలు ఆయన జోష్ కు అడ్డు తగిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధిష్టానం ముందు అంతా జీ హుజూర్ అని చేతులు కట్టుకుంటున్నా రాబోయే రోజుల్లో సుబ్రమణ్యానికి వ్యతిరేకంగా చాపకింద నీరులా రాజకీయాలు నడుస్తాయన్న ఆందోళన వైసిపి వర్గాల్లో వుంది. ఇటీవల రాజమండ్రి ఇంచార్జ్ గా అయిన తరువాత ఛాంబర్ ఎన్నికల్లో వైసిపి – బిజెపి బెల్ట్ ను గెలిపించడంలో శివరాముడు గట్టిగానే చక్రం తిప్పారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడిగా పేరొందిన ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా వైశ్య వర్గాల్లో గట్టిపట్టే వుంది. అయితే చిత్ర విచిత్ర రాజకీయాలకు వేదికగా వుండే రాజకీయ చైతన్య తీరం గోదావరి ప్రాంతంలో ఆయన ఏవిధంగా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.