అసమ్మతి ఎఫెక్ట్.. ప్రత్యర్థితో చేతులు కలిపిన వైసీపీ ఎంపీ
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిణామమే గుంటూరు రాజకీయాల్లోనూ వెలుగు చూసిందని అంటున్నారు పరిశీలకులు. జిల్లా వైసీపీ నేతలు [more]
;
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిణామమే గుంటూరు రాజకీయాల్లోనూ వెలుగు చూసిందని అంటున్నారు పరిశీలకులు. జిల్లా వైసీపీ నేతలు [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిణామమే గుంటూరు రాజకీయాల్లోనూ వెలుగు చూసిందని అంటున్నారు పరిశీలకులు. జిల్లా వైసీపీ నేతలు కొన్నాళ్లు ఒకరిపై ఒకరు కొట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆధిపత్య పోరులో అలసిపోతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఈ పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కొన్నాళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి.
వైసీపీ రెండు చీలికలు….
నిజానికి అభివృద్ది పేరుతో ఎంపీ దూకుడు చూపిస్తున్నారు. కానీ.. కొన్ని కొన్ని విషయాల్లో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు ఆయనకు పొసగని పరిస్థితి. ఇక, కొందరు ఎమ్మెల్యేలతో లావు.. ప్రత్యక్ష పోరు సాగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నాయకులు రెండుగా విడిపోయి.. లావుకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. పైకి నమ్మకంగా ఉంటూనే.. స్థానిక మీడియాకు లీకులు ఇచ్చి.. లావుపై వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారనే వాదన కూడా ఉంది. దీంతో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని లైన్‌లోకి తెచ్చుకునేందుకు లావు అదిరిపోయే ఐడియా వేశారని అంటున్నారు పరిశీలకులు.
పల్నాడు జిల్లాగా….
ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటులో హడావుడి పెరిగింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పల్నాడును కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేసి.. నరసరావుపేటనే జిల్లా కేంద్రంగా చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. పల్నాడును జిల్లా కేంద్రంగా చేస్తే.. టీడీపీ పుంజుకుంటుందని.. పైగా నిధులు కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు… నరసరావుపేటకు పేటనే కేంద్రంగా ఉంచాలని కోరుతున్నారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీయే కాకుండా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సైతం నరసారావుపేటకే చెందిన వ్యక్తి కావడంతో వీరందరు నరసారావుపేటనే జిల్లాగా చేయాలని కోరుతోన్న పరిస్థితి.
గురజాల కేంద్రంగా….
ఇక, టీడీపీ నాయకులు మాత్రం గురజాల కేంద్రంగా పేట జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యమాలు కూడా నడిపిస్తున్నారు. ఇక, ఇప్పుడు అనూహ్యంగా వీరికి మరింత మద్దతు పెరిగింది. బహిరంగ సభలకు కూడా అనుమతులు వస్తున్నాయి. నాయకులు సమావేశాలు పెట్టుకునేందుకు కూడా పోలీసులు ఓకే చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఈ ఉద్యమాన్ని భుజాన కెత్తుకుని నడిపిస్తున్నారు. మాచర్ల ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కూడా గురజాల జిల్లానే కోరుకుంటున్నారు. పైగా గురజాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఉద్యమంతో పల్నాడు ప్రాంత వైసీపీ నేతలు ఇరకాటంలో పడడంతో పాటు వారు కూడా గురజాల జిల్లాకు జై కొట్టక తప్పని పరిస్థితి.
పరోక్షంగా మద్దతు….
మరి ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చిందంటే.. దీనివెనుక వైసీపీ నరసారావుపేట ఎంపీ లావు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న వైసీపీ నాయకులకు ఆయన ఇలా చెక్ పెడుతున్నారట. అంటే.. ఇక్కడ గురజాల విషయం దూకుడు పెరిగితే లావు కేంద్రంగా తాత్కాలికంగా అయినా రాజకీయం నడుస్తుంది. లాంగ్ రన్లో లావు ఆధిపత్యం ఎలా ? ఉన్నా ? ప్రస్తుతానికి మాత్రం ఆయన గురజాల జిల్లా కోసం పరోక్షంగా సపోర్టు చేయడం ద్వారా తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంతో పాటు ఎమ్మెల్యేల దూకుడుకు కొంతైనా బ్రేక్ వేయాలన్న ప్లాన్‌తో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి లావు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.