ఇక్కడ ఆశలు అస్సలు లేవట… నేతలు హ్యాండ్సప్…?
గుంటూరు జిల్లాలో వైసీపీకి ఆశలు అడుగంటాయి. బలమైన జిల్లాలో.. అంతే బలంగా ఉన్నప్పటికీ.. అధికార పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు ఎంపీలు [more]
;
గుంటూరు జిల్లాలో వైసీపీకి ఆశలు అడుగంటాయి. బలమైన జిల్లాలో.. అంతే బలంగా ఉన్నప్పటికీ.. అధికార పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు ఎంపీలు [more]
గుంటూరు జిల్లాలో వైసీపీకి ఆశలు అడుగంటాయి. బలమైన జిల్లాలో.. అంతే బలంగా ఉన్నప్పటికీ.. అధికార పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు ఎంపీలు సహా 15 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. టీడీపీ నుంచి మొత్తం 10 మంది కమ్మ నేతలు… అందులోనూ ఉద్దండులు పోటీ పడినా కూడా అందరూ చిత్తుగా ఓడారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఓడించిన జిల్లాగా గుంటూరు రికార్డుల్లో నిలిచింది. ఎన్నికల తర్వాత కూడా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ సానుభూతిపరుడు అయ్యారు. దీంతో గుంటూరులో ఇక, టీడీపీ ఉనికి పోతుందని అనుకున్నారు.కానీ, అనూహ్యంగా రాజధాని మార్పు ప్రకటనతో ఇక్కడి ప్రజలు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు కార్పొరేషన్ పరిధిని అలా ఉంచితే.. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల జోరు మొదలైంది. పైకి మాత్రం పరిస్థితి గుంభనంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎవరిని కదిలించినా.. టీడీపీ జపమే చేస్తున్నారు.
రాజధాని మార్పు దెబ్బకు…..
“రాజధాని ఉంటే.. ఆ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఇప్పుడు రాజధానినే మారుస్తామంటున్నారు. ఈ ప్రభుత్వం, ఈ పాలకులు మాకెందుకు? “ అనే ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమా లు తీసుకుంటున్నా.. పథకాల లబ్ధి పొందుతున్నా.. రాజధానిపై ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఆశలుపెట్టుకున్నారు. దీంతో వారు.. తమకు రాజధాని మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు. ఫలితంగా గ్రామీణ వాతావరణం అంతా.. కూడా వైసీపీకి యాంటీగా మారింది. దీనిని గుర్తించినప్పటికీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అచేతనంగా మారిపోతున్నారు. వారు క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారు.
అన్ని నియోజకవర్గాల్లోనూ….
“ఇప్పుడున్న పరిస్థితిలో మేం గ్రామాల్లో తిరగలేం. పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎవరికివారు తెలుసుకోవాలి. మూడు రాజధానులు మంచిదని చెబితే.. ఇక్కడివారికి కోపం. ఇదే రాజధానిగా కొనసాగించాలని మేం చెబుతున్నా.. మా నాయకుడి నిర్ణయానికి తిరుగులేదు. ఏం జరిగినా.. మేం చేసేది ఏమీలేదు.“ అని.. పార్టీ సీనియర్లు సైతం చేతులు ఎత్తేస్తున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి.
సగం అయినా….?
అయితే.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మాత్రం అంతో ఇంతో ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఫిఫ్టీ – ఫిఫ్టీ అయినా.. మాకు అవకాశం లేకుండా పోతుందా ? అని అంటున్నవారు కూడా కనిపిస్తున్నారు. అయినప్పటికీ.. రాజధాని వివాదంతో ఆశలు తక్కువగానే ఉన్నాయని.. తాము కూడా ఎక్కువగా ఊహించలేకపోతున్నామని.. వారు చెబుతున్నారు. మొత్తానికి గుంటూరు లో వైసీపీ హవా తగ్గుతుండడం గమనార్హం.