జగనూ.. ఈ గుంటూరు గోలగోలగా ఉంది.. చూడవూ?

రాజ‌కీయాల్లో గుంటూరుకు ఉన్న ప్రాధాన్యం వేరు. ముఖ్యంగా రాజ‌ధానిగా (ప్రస్తుతానికి ఇదే) ఉన్న గుంటూరులో వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. కేవ‌లం రేప‌ల్లె మిన‌హా అన్ని నియోజ‌క‌వర్గాల్లోనూ [more]

Update: 2021-02-05 05:00 GMT

రాజ‌కీయాల్లో గుంటూరుకు ఉన్న ప్రాధాన్యం వేరు. ముఖ్యంగా రాజ‌ధానిగా (ప్రస్తుతానికి ఇదే) ఉన్న గుంటూరులో వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. కేవ‌లం రేప‌ల్లె మిన‌హా అన్ని నియోజ‌క‌వర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ( గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి వైసీసీ సానుభూతిప‌రుడే) ఉన్నారు.
రాజ‌ధాని మార్పు నేప‌థ్యంలో ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవ‌హ‌రించిన తీరు, అదేవిధంగా సొంత పార్టీలోనే నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో నాయ‌కులు అనుస‌రిస్తున్న విధానంతో నేత‌లు భ్రష్టుప‌ట్టిపోయారు ముఖ్యంగా ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు.

మహిళా ఎమ్మెల్యే….

వీరు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కడం మాట అటుంచితే.. ప‌రువు ద‌క్కించుకునే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఇక‌, రాజ‌ధాని ప్రాంతానికే చెందిన ఓ మ‌హిళా ఎమ్మెల్యే వ్యవ‌హార శైలి నిత్యం వివాదాలుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఉన్నత విద్య చ‌దివి, సంఘంలో గౌర‌వ‌మైన వృత్తిలో ఉండి కూడా రాజ‌కీయాల్లో ఆమె దూకుడుగా వ్యవ‌హ‌రిస్తుండ‌డం ముఖ్యంగా రాజ‌ధాని ప్రజ‌ల‌ను ఎప్పటిక‌ప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడ‌డం వంటి ప‌రిణామాలు.. తీవ్ర వివాదంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటు ప‌డిపోయింది. అస‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ శ్రేణులే ఈమెనా ? మేం గెలిపించుకుంది ? అని గ‌గ్గోలు పెడుతున్నారు.

హడావిడి ఎక్కువ…?

అదే స‌మ‌యంలో ఈ ప్రాంతానికే చెందిన మ‌రో నియోక‌వ‌ర్గంలో సీనియ‌ర్‌ను కాద‌ని టికెట్ సంపాయించుకున్న మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు చేస్తున్న ప్రయ‌త్నాలు ఫ‌లిస్తాయోలేదో కానీ, ఈ క్రమంలో ఆమె వేస్తున్న అడుగులు.. మాత్రం వివాదాల‌కు కేంద్రంగా మారాయి. హ‌డావిడి ఎక్కువ‌… అభివృద్ధి త‌క్కువ‌… మితిమీరిన ప్రచారం కూడా ఆమెకు మైన‌స్సే అవుతోంది. ఆమెకు పార్టీలో ఓ బ‌ల‌మైన వ‌ర్గం స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఆమెకు ఈ సారి సానుకూల ప‌రిస్థితి లేదు.

ఈసారి గెలుపు…?

ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నాయ‌కుడు.. విప‌క్షంపై మాట‌ల తూటాలు పేల్చే ఓ ఎమ్మెల్యే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని వైసీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. ఇక్కడ ఆయ‌న‌కు పోటీ లేకున్నా.. ఆయ‌న మాత్రం అభివృద్ధిని విస్మరించి.. కేవ‌లం రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అది కూడా టీడీపీపై విమ‌ర్శల‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఆయ‌న గెలుపు క‌ష్టమేన‌ని చెబుతున్నారు. మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో యువ నాయ‌కుడు, సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చి గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, అతి తక్కువ‌ స‌మ‌యంలోనే వివాదాల‌కు కేరాఫ్‌గా మారారు. ముఖ్యంగా అన్నింటా దోపిడీ సూత్రాన్ని అవ‌లంబిస్తున్నార‌ని.. సొంత పార్టీ నాయ‌కులే విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

అవినీతి ఆరోపణలు….

ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం.. టీడీపీ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు బ‌ల‌మైన నాయ‌కుడుకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు గుర్రం ఎక్కిన వైసీపీ క‌మ్మ నేత‌పై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. ప్రతి విష‌యంలోనూ ఆయ‌న క‌లెక్షన్ కింగ్‌గా మారిపోయార‌నే ఆరోప‌ణ‌లు వినిప‌స్తున్నాయి. కేడ‌ర్‌కు కూడా దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు భూసేక‌ర‌ణ విష‌యంలో ఈ నియోజ‌క‌వర్గంలోనే ఎక్కువ రేటుకు కొనుగోలు జ‌ర‌గ‌గా.. ఇక్కడ భారీ అవినీతి జ‌రిగింద‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఐదు నియోక‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల తీరుతో వైసీపీ గ్రాఫ్ శ‌ర‌వేగంగా ప‌త‌న‌మ‌వుతోన్న ప‌రిస్థితే ఉంది.

Tags:    

Similar News