ఎన్నికలొస్తున్నా భయంలేదే…? కొట్టుకుంటూనే ఉంటారా?
అధికారంలో ఉంటే ఆధిపత్యం కోసం ప్రయత్నించడం మామూలే. అయితే అది శృతిమించితేనే ఇబ్బందిగా మారుతుంది. అధికారంలో ఉన్న పార్టీ నియోజవర్గంలో గెలవకపోయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు [more]
అధికారంలో ఉంటే ఆధిపత్యం కోసం ప్రయత్నించడం మామూలే. అయితే అది శృతిమించితేనే ఇబ్బందిగా మారుతుంది. అధికారంలో ఉన్న పార్టీ నియోజవర్గంలో గెలవకపోయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు [more]
అధికారంలో ఉంటే ఆధిపత్యం కోసం ప్రయత్నించడం మామూలే. అయితే అది శృతిమించితేనే ఇబ్బందిగా మారుతుంది. అధికారంలో ఉన్న పార్టీ నియోజవర్గంలో గెలవకపోయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పనిచేయాలి. ఆ దిశగా ప్రయత్నించాలి. ప్రత్యర్థి బలమైన నేత కావడంతో మరింత కష్టపడాల్సి ఉంటుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడంలేదు. తామే అసలైన పార్టీ లీడర్ నంటూ ముందుకు వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో వైసీీపీ నేతల మధ్య రగడ క్యాడర్ కు ఇబ్బందిగా మారింది.
టీడీపీకి కంచుకోట….
హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీదే హవా. ఇక్కడ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించాలంటే ఏం చేయాలన్న దానిపై వైసీపీ నేతలు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పని మానేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నా గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు.
ఇద్దరు లీడర్లు….
వైసీపీకి హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇద్దరు లీడర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ మహ్మద్ ఇక్బాల్ ను బరిలోకి దింపింది. ఆయన ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీని చేసింది. ఆయన తానే హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేనని ఫీలవుతున్నారు. అయితే ఇక్బాల్ నాన్ లోకల్ కావడంతో అక్కడ క్యాడర్ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మరో లీడర్ నవీన్ నిశ్చల్.
వేర్వేరు దారులు…..
నవీన్ నిశ్చల్ ఇప్పటికి రెండు సార్లు పోటీ చేసి హిందూపురంలో ఓటమిపాలయ్యారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీ లో చేరి పార్టీ కోసం కష్టపడినా టిక్కెట్ మాత్రం ఇవ్వలేదు. అయినా 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ కు సహకరించారు. కానీ ఎన్నికల తర్వాత నుంచి వీరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో క్యాడర్ అయోమయంలో పడింది. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం హిందూపురం నియోజకవర్గంలో దృష్టి పెట్టకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఇబ్బందిపడటం ఖాయమని చెప్పక తప్పదు.