సీమ‌లో వైసీపీ దూకుడు.. ఒక్కటి కూడా చేజారకుండా?

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైన నేప‌థ్యంలో అధికార పార్టీ ఎలా వ్యవ‌హ‌రిస్తుంది ? ఏవిధ మైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది ? ఇప్పటి వ‌ర‌కు అస‌లు [more]

;

Update: 2021-02-05 11:00 GMT

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైన నేప‌థ్యంలో అధికార పార్టీ ఎలా వ్యవ‌హ‌రిస్తుంది ? ఏవిధ మైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది ? ఇప్పటి వ‌ర‌కు అస‌లు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేమ‌ని చెప్పిన స‌ర్కారు ఇప్పుడు ఎన్నిక‌లు త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడిన నేప‌థ్యంలో ఎలా ముందుకు వెళ్తుంది ? అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి. ఈ విష‌యంలో వాస్తవానికి పైకి ఎన్నిక‌ల‌కు తాము దూరంగా ఉన్నామ‌ని వైసీపీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ముందు నుంచి సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

క్లీన్ స్వీప్ చేసే దిశగా….?

ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లాతో పాటు కీల‌క‌మైన మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామి వంటివారు ఉన్న చిత్తూరు, ఇత‌ర‌ సీమ జిల్లాల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసే దిశ‌గా వైసీపీ అడుగులు వేస్తోంది. సీమ మొత్తం బాధ్యత‌ను ఇద్దరు మంత్రుల‌కు అప్పగించిన‌ట్టు వైసీపీ నేత‌లు చెబుతున్నారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ల‌‌కు ఈ బాధ్యత‌లు అప్పగించిన‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ కీల‌క నాయ‌కుడు‌, ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణా రెడ్డికి కూడా బాధ్యత‌లు అప్పగించిన‌ట్టు స‌మాచారం.

టీడీపీకి దిమ్మతిరిగేలా…..

ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల‌ని.. ఒక్క పంచాయ‌తీ కూడా చేజార‌కూడ‌ద‌నే ఆదేశం ఇప్పటికే వ‌చ్చింద‌ని పార్టీలో గుస‌గుస వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ప్రభుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని దీనిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల‌ని కూడా నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను చూసి వైసీపీ పారిపోతోంద‌ని వ్యాఖ్యలు చేసిన టీడీపీకి, ఇత‌ర పార్టీల‌కు కూడా బ‌ల‌మైన దెబ్బ త‌గిలేలా వ్యవ‌హ‌రించాల‌ని క్షేత్రస్థాయిలో నాయ‌కుల‌కు జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చార‌ని అంటున్నారు.

జగన్ ఇప్పటికే….

మొత్తంగా ఈ ప‌రిణామాలు వైసీపీలో దూకుడు పెంచాయి. పైగా ప‌ద‌వులు ఆశిస్తున్నవారికి ఈ ఎన్నిక‌లు మ‌రింత ప్రతిష్టాత్మకంగా మార‌డం, వైసీపీలో జోరు పెంచాయి. పైకి సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. సీఎం జ‌గ‌న్ ఇప్పటికే జిల్లాలు, మండ‌లాలు, గ్రామ‌స్థాయిలో వైసీపీ నేత‌ల‌కు ఖ‌చ్చిత‌మైన సూచ‌ల‌ను చేసిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా చూస్తే.. సీమ‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. గ‌త స్థానిక‌ ఎన్నిక‌ల్లో అనంతపురంలో టీడీపీ స‌త్తా చాటింది. ఈసారి ఆ అవ‌కాశం ఇవ్వకుండా వైసీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News