ఇంటర్నల్ అండర్ స్టాండింగ్ దెబ్బతీస్తుందా?
ఏపీలో పంచాయతీ ఎన్నికలను వన్ సైడ్ చేసేసిన అధికార వైసీపీ ఇప్పుడు వచ్చే నెల 10న జరిగే కార్పొరేషన్.. మునిసిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మొత్తం 12 [more]
;
ఏపీలో పంచాయతీ ఎన్నికలను వన్ సైడ్ చేసేసిన అధికార వైసీపీ ఇప్పుడు వచ్చే నెల 10న జరిగే కార్పొరేషన్.. మునిసిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మొత్తం 12 [more]
ఏపీలో పంచాయతీ ఎన్నికలను వన్ సైడ్ చేసేసిన అధికార వైసీపీ ఇప్పుడు వచ్చే నెల 10న జరిగే కార్పొరేషన్.. మునిసిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మొత్తం 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం జగన్ పెట్టిన టార్గెట్ ప్రకారం చూస్తే అన్ని కార్పొరేషన్లలోనూ వైసీపీ జెండా ఎగరాలి.. ఇందుకోసం ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టేశారు. వైసీపీలో తాజా ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎంత ధీమా ఉన్నా నాలుగైదు కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుంది ? ఇక్కడ గెలుపు కోసం ప్రత్యేకంగా ఏం చేయాలన్న సందిగ్ధ స్థితి అయితే ఉంది. వైసీపీ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసే, టీడీపీ మధ్య డివైడ్ అయితే 12కు 12 కార్పొరేషన్లు గెలుస్తాం అన్న ధీమా ఉంది.
ఇంటర్నల్ అండర్ స్టాండింగ్…..
అయితే ఏపీలో పలు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య ఇంటర్నల్ అండర్ స్టాండింగ్ నడుస్తోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నేతలు అలాగే పెట్టుకున్నారు. ఇది గోదావరి జిల్లాల్లో సత్ఫలితాలు ఇచ్చింది. ఇక త్వరలో జరిగే మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల ఇంటర్నల్ అండర్ స్టాండింగ్ జరగనుంది. స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌లు, మాజీ మంత్రులు ఒంటరి పోరుతో వైసీపీని ఢీకొట్టలేమని జనసేనతో పొత్తులు పెట్టుకుని వారికి కొన్ని సీట్లు సర్దుబాటు చేస్తున్నారు.
ఈ కార్పొరేషన్లలో…
రేపు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే ఒప్పందం ఉంటే విశాఖపట్నంతో పాటు విజయవాడ, ఏలూరు, విజయనగరంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. వైజాగ్‌లో వైసీపీకి ముందు నుంచి కొంత మైనస్ ఉంది. జనసేనతో ఒప్పందం ఉంటే పవన్, జనసేన ఓటు బ్యాంకు కూడా టీడీపీకి తోడు అయితే ఇక్కడ వైసీపీకి ఇబ్బంది తప్పదు. ఇక విజయవాడలో ముందు నుంచే టీడీపీకి కొంత ఎడ్జ్ ఉంది. ఇప్పుడు కాపులు + జనసేన ఓటు బ్యాంకు కలిస్తే వైసీపీకి ఇబ్బంది తప్పదు.
వన్ సైడ్ గా వస్తాయని….
గుంటూరులోనే ఈ రెండు పార్టీల ఒప్పందం ఉన్నా గెలుస్తామన్న ధీమా వైసీపీలో ఉంది. ఇక విజయనగరం కార్పొరేషన్ లో పొత్తులున్నా దెబ్బ పడుతుందని.. ఇక్కడ మంత్రి బొత్సకు, ఎమ్మెల్యే కోలగట్లకు జరుగుతోన్న వార్‌లో కూడా పార్టీకి మైనస్ అవుతుందన్న ఆందోళన పార్టీలో ఉంది. ఇక ఏలూరులో జనసేన + టీడీపీ ఇంటర్నల్ ఒప్పందం ఉంటే చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంటుందని వైసీపీ లెక్క. ఏలూరు, విజయనగరం చివర్లో అయినా గెలుచుకుంటామన్న ఆశ వైసీపీలో ఉంది. ఈ కార్పొరేషన్లు మినహా మిగిలినవి అన్నీ తమ ఖాతాలో వన్‌సైడ్‌గా పడతాయన్న లెక్కల్లో వైసీపీ ఉంది.