అక్కడ వైసీపీలోనూ టీడీపీ పెత్తనమే… అదిరిపోలా?
రాజకీయం అంటేనే ఎత్తులు… పై ఎత్తులు కామన్. అవసరం, అధికారం కోసం అధికార పార్టీలోకి జంప్ అవ్వడం కామన్. అయితే పార్టీ మారిన నేతలు అప్పటి వరకు [more]
;
రాజకీయం అంటేనే ఎత్తులు… పై ఎత్తులు కామన్. అవసరం, అధికారం కోసం అధికార పార్టీలోకి జంప్ అవ్వడం కామన్. అయితే పార్టీ మారిన నేతలు అప్పటి వరకు [more]
రాజకీయం అంటేనే ఎత్తులు… పై ఎత్తులు కామన్. అవసరం, అధికారం కోసం అధికార పార్టీలోకి జంప్ అవ్వడం కామన్. అయితే పార్టీ మారిన నేతలు అప్పటి వరకు అక్కడ ఉన్న నేతలను సైడ్ చేసేస్తూ రాజకీయం చేస్తుంటారు. అంతెందుకు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలోకి వచ్చాక వైసీపీ పాత నాయకులకు… ఇక్కడ జంపింగ్ చేసిన కొత్త నాయకులకు మధ్య పొసగక నాలుగైదు నియోజకవర్గాల్లో రచ్చ రంబోలాగా మారింది. పార్టీ కోసం ముందు నుంచి ఉన్న నాయకులను జంపింగ్ నేతలు డామినేషన్ చేస్తుండడంతో పాత నేతలు రగులుతున్నారు. కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమ సొంత నియోజకవర్గం నందిగామలో అధికార వైసీపీలోనూ టీడీపీ వాళ్ల పెత్తనమే నడుస్తోందట.
ఎమ్మెల్యే కు మంచిపేరున్నా…..
స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. అయితే ఆయనకు పార్టీలోనే కొందరు నేతల నుంచి ఏ మాత్రం సహకారం ఉండడం లేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు. అయితే ఇప్పుడు వారందరూ సైలెంట్ అయిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారి హంగామానే నడుస్తోంది. చివరకు వారు ఎమ్మెల్యే జగన్మోహన్ రావునే డామినేషన్ చేస్తోన్న పరిస్థితి. ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత మరో నియోకవర్గ ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. సదరు ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ సామాజిక వర్గ నేతల హంగామానే ఇప్పుడు నడుస్తోందట.
పక్క పార్టీ నుంచి వచ్చిన…..
ఎమ్మెల్యేకు స్థానికంగా ఎంత మంచి పేరు ఉన్నా… పక్క పార్టీ నుంచి జంప్ కొట్టిన ఆ సామాజిక వర్గ నేతల దూకుడు ఇప్పుడు ఎమ్మెల్యేకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వాళ్లు వైసీపీలో ఉంటూ టీడీపీ కేడర్‌కు అనుకూలంగా పని చేయడంతో పాటు ఆ పార్టీకి మేలు చేస్తున్నారట. రేపటి వేళ పరిస్థితులు మారితే తిరిగి ఈ జంపింగ్ నేతలంతా టీడీపీలోకి రివర్స్ జంప్ చేసేలా వ్యూహం రచించుకుంటున్నారని పాత వైసీపీ కేడర్ గగ్గోలు పెడుతోంది. తనను టార్గెట్ చేస్తూ పార్టీలోనే ఓ వర్గం అడ్డంకులు క్రియేట్ చేస్తోన్న విషయంపై ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల్లో…..
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి కొన్ని చోట్ల దెబ్బపడగా… త్వరలో జరిగే నందిగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా ఈ గ్రూపుల గోల పడే అవకాశం ఉందని స్థానిక కేడర్ ఆందోళన చెందుతోంది. నందిగామలో పెత్తనం చేస్తోన్న మరో నేత వర్గంతో పాటు జంప్ చేసి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తోన్న నేతల పని పట్టేందుకు ఎమ్మెల్యే రెడీ అవుతున్నారు. ఏదేమైనా నందిగామ వైసీపీలో రగులుతోన్న ఈ రాజకీయం ఎటు మలుపులు తిరుగుతుందో ? చూడాలి.