జగన్‌పై ఆ వైసీపీ యంగ్ ఎమ్మెల్యే కినుక ?
ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నాయకులు ఎవరైనా పార్టీ అధినేత, సీఎం జగన్‌పై అలిగే పరిస్థితి ఉందా ? ఆయనపై కోపం తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే లేనే [more]
;
ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నాయకులు ఎవరైనా పార్టీ అధినేత, సీఎం జగన్‌పై అలిగే పరిస్థితి ఉందా ? ఆయనపై కోపం తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే లేనే [more]
ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నాయకులు ఎవరైనా పార్టీ అధినేత, సీఎం జగన్‌పై అలిగే పరిస్థితి ఉందా ? ఆయనపై కోపం తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే లేనే లేదని సమాధానం వస్తుంది. నిజానికి ఇప్పుడే కాదు.. గతంలో 2019 ఎన్నికల తర్వాత.. అనేక మంది.. ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశారు. ఈ క్రమంలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అతి తక్కువ మంది (ఎక్స్ పెక్ట్ చేసిన)కి మాత్రమే పదవులు దక్కాయి. దీంతో చాలా మంది అలిగినా.. ఎక్కువగా నిలబడలేదు. వెంటనే జగన్ దారిలోకి వచ్చేశారు. దీరికి ఉదాహరణ ఎమ్మెల్యే రోజానే. అయితే.. ఇప్పుడు మాత్రం కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే.. శిల్లా రవిచంద్రారెడ్డి మాత్రం.. జగన్‌పై పీకల వరకూ ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ గెలుపు కోసం….
ఆయన ఒక్కరే కాదు.. ఆయన బాబాయి.. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి కూడా జగన్‌పై ఒకింత కోపంతోనే ఉన్నారు. వర్గ పోరును పెంచుతున్నారని.. తమలో తమకే విభేదాలు పెడుతున్నారని.. ఆయన ఇటీవల అన్యాపదేశంగా.. జగన్‌పై విమర్శలు రువ్వారు. అయితే.. దీనికి కారణం ఏంటి? ఎందుకు అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బాబాయి, అబ్బాయి ఇద్దరూ బాగానే కష్టపడ్డారు. ఇద్దరూ కూడా నంద్యాలలో వైసీపీ గెలుపుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసి వార్ వన్‌సైడ్ చేసేశారు. ఇక్కడ పార్టీ గెలిచిన తర్వాత మాత్రం రవిచంద్ర తన సతీమణి నాగిణి రెడ్డిని చైర్ పర్సన్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాదు.. దీనికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఒక కీలక నేత నుంచి కూడా హామీ పొందారు.
సత్తా చూపించినా….
నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో 42 వార్డులుంటే 12 ఏకగ్రీవం అయ్యాయి. పోటీ జరిగిన 30 వార్డుల్లో 25 అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. మొత్తంగా 37 చోట్ల వైసీపీ పాగా వేసింది. మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరడంలో ఎమ్మెల్యే రవిచంద్రదే కీలక పాత్ర అని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు ముగియగానే.. చైరపర్సన్ తన సతీమణేనని రవిచంద్ర కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ.. అధిష్టానం మాత్రం ప్లేట్ ఫిరాయించేసింది. పార్టీలో మరో సీనియర్ నేత రాజగోపాల్‌రెడ్డి పావులు కదపడంతో జగన్ ఇక్కడ ఒక్కసారిగా సీన్ మార్చేశారు.
తన కుటుంబానికి…..
గోపాల్ రెడ్డి తన సతీమణి లలితను ఛైర్‌పర్సన్‌ను చేయాలని అనుకున్న ఆయనకు అవకాశం ఇవ్వకుండా.. ఏకంగా ముస్లిం అభ్యర్థిని తీసుకువచ్చి.. చైర్ పర్సన్ గా ప్రకటించారు. ఈ పరిణామంతో రవిచంద్ర జగన్ పట్ల పైకి చెప్పుకోలేకపోయినా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు అధికారంలో ఉన్న టీడీపీని, పదవులను వదులుకుని త్యాగం చేసి వస్తే మాకు ఇచ్చే విలువ ఇదా ? ఒక మున్సిపాల్టీ పదవే ఇప్పించుకోనప్పుడు ఈ పదవులు ఎందుకని ఆయన రగలి పోతున్నాడట. ఇప్పటి వరకు తనకు తిరుగులేదని.. తను చెప్పినట్టు జగన్ వింటారని ప్రచారం చేసుకున్న ఆయనకు ఈ పరిణామం అవమానకరంగా మారడంతో ఇప్పుడు నియోజకవర్గానికి కూడా దూరంగా హైదరాబాద్‌లో మకాం వేశారట. మరి ఈ కోపం ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.