ఇక వైసీపీని ఇక్కడ సెట్ చేయడం కష్టమే?

జగన్ హవా లో సైతం సైకిల్ స్పీడ్ గా దూసుకుపోయిన రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలను సెట్ చేయడం అధికారపార్టీ వల్ల కావడం లేదు. ఈ రెండు [more]

Update: 2021-02-11 11:00 GMT

జగన్ హవా లో సైతం సైకిల్ స్పీడ్ గా దూసుకుపోయిన రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలను సెట్ చేయడం అధికారపార్టీ వల్ల కావడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టం గా లేకపోవడం సంగతి పక్కన పెడితే గ్రూప్ ల గోల ఒక రేంజ్ లో నడుస్తుంది. ఎంపి భరత్ రామ్ వర్గం ఒక పక్కన రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా వర్గం మరో పక్కన నువ్వా నేనా అన్న రీతిలో గ్రూప్ లు నడుపుతున్నాయి. దాంతో ఎన్నికల్లో పరాజయం పాలైన ఈ రెండు నియోజకవర్గాల్లో జక్కంపూడి వర్గానికే అధిష్టానం మొగ్గు చూపి పార్టీని పటిష్టం చేసే బాధ్యతలు అప్పగించింది. రూరల్ లో ఓడిపోయినా ఆకుల వీర్రాజు కే కో ఆర్డినేటర్ గా భారీ మెజారిటీ తో ఓటమి పాలైన రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు ను తప్పించి ఆయన స్థానంలో ఏపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యాన్ని నియమించింది.

గ్రూప్ ల గోల భరించలేక …

వీరిద్దరూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికలకు శ్రేణులను బలోపేతం చేసే దిశగా చురుగ్గానే అడుగులు వేస్తున్నారు. అయితే ఎంపి భరత్ రామ్ ను పక్కన పెట్టి కొన్ని కార్యక్రమాలు సాగిస్తూ ఉండటంతో ఆయన పదేపదే గోదావరి జిల్లాల ఇన్ ఛార్జ్ సుబ్బారెడ్డి కి ఫిర్యాదు చేస్తున్నట్లు పార్టీ వర్గాల టాక్. అలాగే భరత్ వర్గంపై ఇవతలి వర్గం ఫిర్యాదులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. దాంతో ఇటీవల రాజమండ్రి పర్యటనకు సుబ్బారెడ్డి వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. ఈ గ్రూప్ ల గొడవతో బలపడటం మాటెలా ఉన్నా ప్రజల్లో మరింత బలహీన పడతామన్న అంచనాకు వచ్చి జక్కంపూడి రాజా వర్గాన్ని రెండు నియోజకవర్గాల్లో బాధ్యతలనుంచి తప్పించాలని ఆలోచన చేశారు.

నెలక్రితమే ఎంపి స్కెచ్ …

తనకు సరైన గౌరవం జక్కంపూడి వర్గం నుంచి దక్కడం లేదని ఫ్లెక్సీల్లో తన ఫోటో ఉండటం లేదని ఎంపీ భరత్ రామ్ చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తరచూ అధిష్టానం ముందు జక్కంపూడి వర్గం పై ఫిర్యాదులు వెల్లువెత్తేలా ఎంపీ వర్గం పావులు కదుపుతూ వచ్చినట్లు తెలుస్తుంది. ఎంపి ప్లాన్ అధిష్టానం దగ్గర వర్క్ అవుట్ అయ్యేలా ఉందని చివరి నిమిషం లో ఆలస్యంగా గుర్తించిన జక్కంపూడి వర్గం ఇటీవల పలు కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తాము ఎంపీని కలుపుకుని ముందుకు సాగుతున్నామన్న సంకేతాలను అధిష్టానం కు పంపినా అప్పటికే ఆలస్యం అయ్యింది.

సర్దుకుపోయేందుకు…?

తన మర్యాద విషయంలో జక్కంపూడి రాజా వర్గం ఒక అడుగు ముందుకు వేసినా ఎంపి భరత్ తనవైఖరి మార్చుకోనట్లు తెలుస్తుంది. రాజమండ్రి అర్బన్, రూరల్ లో తన వర్గానికి కో ఆర్డినేటర్ లు ఇస్తేనే పార్టీని గాడిన పెట్టె బాధ్యత తలకెత్తుకోగలనని లేనిపక్షం లో తనను ఎందులో బాధ్యుడిని చేయక్కర్లేదని ఆయన అధిష్టానం కి తేల్చి చెప్పేశారంటున్నారు. ఈ నేపథ్యంలో భరత్ వైపే సుబ్బారెడ్డి నిలబడటంతో జక్కంపూడి వర్గానికి చేదు అనుభవమే మిగిలింది. దాంతో రాజమండ్రి అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్ ల మార్పు వైసిపి లో ప్రకంపనలే సృష్టిస్తుంది.

Tags:    

Similar News