తిరుపతి వైసీపీలో వర్గ పోరు.. ఎంపీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం
అత్యంత కీలకమైన తిరుపతి పార్లమెంటు స్థానానికి ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిని గెలిచి తీరాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు నెలల నుంచి [more]
;
అత్యంత కీలకమైన తిరుపతి పార్లమెంటు స్థానానికి ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిని గెలిచి తీరాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు నెలల నుంచి [more]
అత్యంత కీలకమైన తిరుపతి పార్లమెంటు స్థానానికి ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిని గెలిచి తీరాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు నెలల నుంచి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ ఏకంగా 200 మంది నేతలతో ఓ కమిటీ వేయడంతో పాటు ఓ వార్ రూమ్ కూడా ప్రారంభించింది.
వైసీపీలో మాత్రం….?
ఇక, బీజేపీ-జనసేనల నుంచి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థినే రంగంలోకి దింపాలని పక్కా ప్లానింగ్‌తో ఉంది. ఈ మూడు పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ఉప పోరు హోరా హోరీగా సాగనుంది. అయితే.. వైసీపీ నేతల మధ్యమాత్రం సఖ్యత లోపించిందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా జరుగుతున్న రాజకీయ వివాదంలో పంచాయతీ ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే. దీనికి చెక్ పెడుతూ.. పంచాయతీ ఎన్నికలది ఏముంది..త్వరలోనే జరగనున్న తిరుపతి పార్ల మెంటు స్థానంలో మీ ప్రతాపం-మాప్రతాపం తేల్చుకుందామని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు టీడీపీ నేతలకు సవాళ్లురువ్వుతున్న విషయం తెలిసిందే.
సఖ్యత లేక….
అయితే.. అనుకున్న రేంజ్ లో మాత్రం తిరుపతిలో వైసీపీ నాయకులు కలిసి కట్టుగా పనిచేయడం లేదని తాజాగా వెలుగు చూసిన అంశం. ఇక్కడ మంత్రుల విషయంలో ఎమ్మెల్యేలు ఎవరికివారుగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు దూకుడుగా ఉండి తమను డమ్మీలను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు కలసి కట్టుగా లేకపోవడంతోపాటు ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ప్రభావం.. పార్లమెంటు ఉప ఎన్నికపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువుగా ఉందట. ఇక సత్యవేడులో వైసీీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పూర్తిగా డమ్మీ అయిపోయారంటున్నారు.
ప్రతి నియోజకవర్గం పరిధిలో…
ఇక, నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా మంత్రి అనిల్ కుమార్ పెత్తనం ఎక్కువగా ఉంది. ఈ పరిణామాలపై గుస్సాగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. తమకు అవకాశం రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక తెరమీదకు రావడంతో ఎవరికి వారు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రభావం ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు ఎన్నికపై పడుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి అధిష్టానం ఏం చేస్తుందో.. గెలుపు గుర్రం ఎక్కాలనే వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.