విసిగిపోయిన జగన్ టీడీపీ ఎమ్మెల్యే కోసం?
గత ఎన్నికల్లో ఏపీ అంతటా వైసీపీ ప్రభంజనం క్రియేట్ చేస్తే పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి తొలిసారిగా ఎన్నికల్లో [more]
;
గత ఎన్నికల్లో ఏపీ అంతటా వైసీపీ ప్రభంజనం క్రియేట్ చేస్తే పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి తొలిసారిగా ఎన్నికల్లో [more]
గత ఎన్నికల్లో ఏపీ అంతటా వైసీపీ ప్రభంజనం క్రియేట్ చేస్తే పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన మంతెన రామరాజు ( రాంబాబు) 10 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉండిలో వైసీపీ ఓడినా… రాష్ట్రంలో విజయం సాధించడంతో పుంజుకుంటుందిలే అని పార్టీ పెద్దలు భావించారు. అయితే ఉండి వైసీపీలో గ్రూపుల గోలను సెట్ చేయడం అధిష్టానం వల్లే కావడం లేదు. చివరకు పార్టీ కీలక నేతలు టీడీపీ ఎమ్మెల్యేను పార్టీలోకి లాగేసి ఇక్కడ గ్రూపులకు చెక్ పెట్టేయాలన్నంత కోపంతో ఉన్నారు. 2014లో ఉండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సర్రాజు ఓడిపోగా… గత ఎన్నికల్లో సీవీఎల్. నరసింహారాజు పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం నరసింహారాజు తాను పార్టీ కన్వీనర్‌గా ఉండడంతో అన్ని కార్యక్రమాలు తన కనుసన్నల్లోనే నడవాలని పట్టు పడుతున్నారు.
రెండు వర్గాలుగా…..
మాజీ ఎమ్మెల్యే సర్రాజు మాత్రం తాను సీటు త్యాగం చేశానని.. తనకు కూడా నియోజకవర్గ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఉండాలని పంతం వేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పటికే రెండు వర్గాలను సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్‌చార్జ్ వైవి. సుబ్బారెడ్డి నుంచి పలువురు కీలక నేతల వరకు అనేక పంచాయితీలు చేసినా ఉపయోగం లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో మరిన్ని కొత్త గ్రూపులు పుట్టుకు వస్తున్నాయి. ఈ ఇద్దరే కాకుండా కొందరు క్షత్రియ సామాజిక వర్గం నేతలు ఇక్కడ వేళ్లు పెడుతుండడంతో పాటు ఈ సీటు తమకే ఇవ్వాలని కోరుతున్నారు.
దీంతో విసిగిపోయిన హైకమాండ్…..
ప్రస్తుత ఇన్‌చార్జ్ నరసింహారాజును తన కోటరీకే ప్రయార్టీ ఇవ్వడంతో పాటు ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వస్తోన్న వారికి పెద్దపీట వేస్తుండడంతో పాటు పాత వైసీపీ కేడర్‌తో పాటు సర్రాజు వర్గం రగిలిపోతోంది. ఈ గ్రూపులను కలపడం సాధ్యం కాదని డిసైడ్ అయిన పార్టీ అధిష్టానం చివరకు అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పార్టీలోకి లాగేయాలని ( టీడీపీ నుంచి వైసీపీ సానుభూతిపరుడిగా చేర్చుకోవడం ) చేయాలని డిసైడ్ అయ్యిందట. అటు రామరాజు సైతం టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు రామరాజు పార్టీ మార్పుపై వైసీపీ వాళ్లతో చర్చలు కూడా జరిగాయి. రామరాజు పార్టీ మారిపోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంతలో మళ్లీ ఎవరికి వాళ్లు సైలెంట్ అయ్యారు.
గ్రూపులకు చెక్ పెట్టేందుకు…..
ఏదేమైనా సరైన టైం చూసి రామరాజును టీడీపీకి దూరం చేయడంతో పాటు వైసీపీ చెంతకు చేర్చే ప్రయత్నాలే వైసీపీ నుంచి జరుగుతున్నాయి. ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, రామరాజు కలిసి ఉంటే అక్కడ టీడీపీని వీక్ చేయడం సాధ్యం కాదు… అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శివరామరాజు, రామరాజును వేరు చేయడంతో పాటు ఇటు తమ పార్టీ గ్రూపులకు చెక్ పెట్టాలని వైసీపీ కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కొద్ది నెలల్లోనే ఉండి వైసీపీలో ఊహించని పరిణామాలు ఖాయం.