విశాఖలో టీడీపీకి షాక్ ఇవ్వనున్న వైసీపీ…?
విశాఖలో ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉన్న బడుగు వర్గాలను అక్కున చేర్చుకోవడంపైనే వైసీపీ దృష్టి సారించింది. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి [more]
;
విశాఖలో ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉన్న బడుగు వర్గాలను అక్కున చేర్చుకోవడంపైనే వైసీపీ దృష్టి సారించింది. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి [more]
విశాఖలో ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉన్న బడుగు వర్గాలను అక్కున చేర్చుకోవడంపైనే వైసీపీ దృష్టి సారించింది. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి సైకిల్ పార్టీకి భారీ షాకే తగులుతోంది. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో వైసీపీ బలమైన సామాజిక వర్గాలను తన వైపునకు తిప్పుకుంటోంది. ఇందులో భాగంగా ఆది నుంచి విశాఖ మూలవాసులుగా ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని గట్టిగానే దువ్వుతోంది.
మేయర్ సీటుతో….
యాదవ సామాజికవర్గం విశాఖ సిటీలో అత్యధికంగా ఉంది. వారిని ఓటు బ్యాంక్ గా చంద్రబాబు నాడు ఉపయోగించుకున్నారు తప్ప రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకురాలేదన్న ఆవేదన వారిలో ఉంది. సరిగ్గా దీనిని గమనించిన వైసీపీ తనదైన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. విశాఖ మేయర్ పీఠం కొట్టాలన్నది వైసీపీ కోరిక. దాంతో ఈ అత్యున్నత పీఠాన్ని యాదవ సామాజికవర్గానికే కేటాయించడం ద్వారా ట్రంప్ కార్డునే బయటకు తీసింది.
బడుగులదే విశాఖ ……
విశాఖ అంటే ఎక్కుగా గుర్తుకువచ్చేది ఆర్ధికంగా రాజకీయంగా హవా చాటేది ఉన్నత వర్గాలే, మరీ ముఖ్యంగా గత మూడు దశాబ్దాలుగా కమ్మల ఆధిపత్యం కూడా విశాఖ సిటీలో అధికంగా ఉంది. దాంతో బీసీలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా విశాఖ సామాజిక ముఖ చిత్రాన్నే మార్చాలని, తద్వారా రాజకీయంగా కూడా లాభపడాలని వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. తాజాగా విశాఖలో జరిగిన యాదవ సమ్మేళనంలో పాలుపంచుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యాదవుల కోసమే వైసీపీ పార్టీ ఉందని చెప్పారు. విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ సామాజికవర్గానికి తగిన రాజకీయ వాటా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తున్నది కూడా బడుగుల కోసమేనని పేర్కొనడం విశేషం.
ఆ వైపు నుంచి అలా…
ఇక విశాఖనగరం అంటేనే ఇసకపట్నం అని మరో పేరు ఉంది. అంటే మత్స్యకారుల పల్లె ప్రాంతంగా దీనికి పేరుంది. అందువల్ల ఆ వర్గాన్ని కూడా అక్కున చేర్చుకునేందుకు వైసీపీ వారికి కూడా తాయిలాలు ప్రకటిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీదరి అప్పలరాజుని మంత్రిగా చేయడం ద్వారా ఇప్పటికే ఆ వర్గాన్ని మచ్చిక చేసుకుంది. ఇక విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీలోకి తేవడం వెనక కూడా బీసీ అజెండా ఉందని తెలుస్తోంది. మొత్తానికి విశాఖ సిటీలో బలపడడానికి ఆధిపత్య కులంగా ఉన్న కమ్మలను దెబ్బతీయడానికి వైసీపీ బీసీ కార్డుని ప్రయోగిస్తోంది. ఇది పూర్తిగా సక్సెస్ అవుతుందని కూడా ఆ పార్టీ భావిస్తోంది.