జగన్ మదిలో ఆయన పేరు ఉందా?
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నగరం విజయవాడ. ఇక్కడ పట్టు సాధిస్తే..రాష్ట్రంలోనే పట్టు సాధించినట్టు నాయకులు భావిస్తారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ఈ నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయ [more]
;
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నగరం విజయవాడ. ఇక్కడ పట్టు సాధిస్తే..రాష్ట్రంలోనే పట్టు సాధించినట్టు నాయకులు భావిస్తారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ఈ నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయ [more]
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నగరం విజయవాడ. ఇక్కడ పట్టు సాధిస్తే..రాష్ట్రంలోనే పట్టు సాధించినట్టు నాయకులు భావిస్తారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ఈ నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయ రాజధానిగా పేరొందింది. అలాంటి కీలక నగరంలో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ ఆ పార్టీ ఎంపీ సీటు కోల్పోయింది. ఇప్పుడు కూడా విజయవాడలో వైసీపీకి ఎంపీ అభ్యర్థి లేక పోవడం గమనార్హం. బలమైన సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న విజయవాడలో కేశినేని నాని .. టీడీపీ తరఫున వరుసగా రెండు సార్లు ఎన్నికయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల్లో మాస్ లీడర్‌గా ఆయనకు పేరుంది. అందుకే టీడీపీ నుంచి మహామహులు చిత్తుగా ఓడినా ఆయన మాత్రం విజయవాడ ఎంపీగా వరుసగా రెండోసారి జయకేతనం ఎరుగవేశారు.
ఓటమి తర్వాత….
ఇప్పుడు ఈయనను బలంగా ఢీకొనాలంటే.. ఇంతకన్నాబలమైన స్థానిక నేతను ఇక్కడ రంగంలోకి దింపాలి. గత ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే.. ఆయన స్థానికంగా ఉండరనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఓడిపోయిన తర్వాత.. పీవీపీ.. విజయవాడ ముఖం కూడా చూడలేదు. అడపాదడపా వచ్చినా.. తన వ్యాపారాలు.. వ్యవహారాల వరకే పరిమితమవుతున్నారు. దీంతో ఇక్కడ వైసీపీకి ఎంపీ అభ్యర్థి అత్యవసరం అయ్యారు. జగన్ విజయవాడపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో కార్పొరేషన్‌తో పాటు వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సీటును గెలవాలన్న కసితో ఉన్నారు.
జగన్ మదిలో ఆయన పేరు….
అందుకే దేవినేని అవినాష్ లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకుని ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో స్థానిక నేతను ఇక్కడ దింపితే.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఈజీ అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అందునా కమ్మ సామాజిక వర్గ నేతకే పార్లమెంటరీ పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలో స్థానికంగా ఉన్న నేతలపై జగన్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వీరిలో గతంలో తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన యలమంచిలి రవి పేరు వినిపిస్తోంది. అయితే, ఆయన ఆర్థికంగా కొంత వీక్‌గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ఇక, విజయవాడ ఇంచార్జ్ గా ఉన్న బొప్పన భవకుమార్ కూడా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని ఉన్నా.. అటు ఆర్థికంగా.. ఇటు కేడర్ పరంగా కూడా ఆయన వీక్‌గానే ఉన్నారు.
దాసరి పేరు కూడా…..
గత ఎన్నికల్లో ఇంత వేవ్‌లోనూ తూర్పులో ఇంత వేవ్‌లోనూ భారీ తేడాతో ఓడడంతో జగన్ భవకుమార్‌ను నమ్మలేక నగర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి సైడ్ చేసేశారు. మరోవైపు.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం నియోజకవర్గానికి చెందిన దాసరి జైరమేష్ పేరు బలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి పర్వతనేని ఉపేంద్ర(కాంగ్రెస్)పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. కమ్మ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉండడంతోపాటు.. ఆయనకు ఆర్థికంగా కూడా బలం ఉంది. ఇక ఆయన సోదరుడు బాలవర్థన్ రావు గన్నవరం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. పైగా వివాదరహితులుగా దాసరి సోదరులకు పేరుండడంతో పాటు గత ఎన్నికలకు ముందే వీరు వైసీపీలో చేరారు. దీంతో ఈయనకు అవకాశం ఇస్తే.. బెటరనే వాదన ఉంది. అదే సమయంలో కమ్మ వర్గానికే చెందిన కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా ఈ రేసులో ముందున్నారు. మరి జగన్ ఈ అవకాశం ఎవరికి ఇస్తారో ? చూడాలి.