గెలవకపోయినా గెలిచినట్లేనట
విశాఖనగరంలో వైసీపీ పరిస్థితి వింతగా కన్పిస్తుంది. విశాఖ నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగరంలో [more]
;
విశాఖనగరంలో వైసీపీ పరిస్థితి వింతగా కన్పిస్తుంది. విశాఖ నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగరంలో [more]
విశాఖనగరంలో వైసీపీ పరిస్థితి వింతగా కన్పిస్తుంది. విశాఖ నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగరంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. నగరంలో వివిధ మతాలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటమే ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యామని, జగన్ ప్రభావం కన్పించలేదన్నది వైసీపీ నేతలు చెబుతున్నమాట.
నాలుగు నియోజకవర్గాల్లో….
విశాఖ నగరంలో విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ నియోజక వర్గాలున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే ఓటమి పాలయిన నేతలు పెద్దగా ఫీలవ్వడం లేదట. ఎందుకంటే వారే ఎమ్మెల్యేలుగా భావిస్తున్నారు. అధికారుల దగ్గర నుంచి మంత్రి వరకూ వీరు చెప్పిన పనులే చేస్తుండటంతో అనధికార ఎమ్మెల్యేలుగానే ఈ నలుగురు చెలాయిస్తున్నారు.
గంటా దూరంగా…..
టీడీపీ ఘోర ఓటమి పాలు కావడంతో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఇక్కడ వైసీపీ ఏడాదికి ముగ్గురు ఇన్ ఛార్జిలును మార్చి చివరి నిమిషంలో కెకెరాజుకు టిక్కెట్ ఇచ్చింది. స్వల్ప తేడాతో ఓటమి పాలయిన కెకె రాజు ఇప్పుడు తానే ఎమ్మెల్యేనంటున్నారట. గంటా శ్రీనివాసరావు పూర్తిగా నియోజకవర్గాన్ని వదిలేయడంతో ఈయనే ఎమ్మెల్యేగా హవా చెలాయిస్తున్నారు. గంటా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదైనా పనిమీద వచ్చినా రాజును కలవండని తానే చెప్పి పంపుతున్నారట.
టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోక….
విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పటి వరకూ భీమిలీ ఇన్ ఛార్జిగా ఉన్న అక్రమాని విజయనిర్మలను అభ్యర్థిగా ప్రకటించారు. ఈమె ఓటమి పాలయినా అక్కడ వెలగపూడి రామకృష్ణ ఎమ్మెల్యే అయినా విజయనిర్మల చెప్పినట్లే జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గంలో ద్రోణంరాజు శ్రీనివాస్ ఓటమిపాలయినా ఆయనకు విశాఖ మెట్రో రీజియన్ అధారిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆ పదవి కూడా ఉండటంతో ఇక్కడ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కన్నా ద్రోణంరాజు హవా కొనసాగుతుంది. పశ్చిమ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి అక్కడ గణబాబు గెలిచినా వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ పెత్తనం చేస్తున్నార. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రతిపక్ష నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జి పాలన అని విమర్శించిన వైసీపీ ఇప్పుడు అదే దారిలో పయనిస్తుందని చెప్పడానికి విశాఖలో నాలుగు నియోజకవర్గాలే ఉదాహరణ.