ఈసారి ఇక్కడ ఇత్తడేనట జగనూ?
టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో జిల్లా వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. అలాంటి జిల్లాలో గత [more]
;
టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో జిల్లా వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. అలాంటి జిల్లాలో గత [more]
టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో జిల్లా వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీని కేవలం రెండు సీట్లకు పరిమితం చేసింది వైసీపీ. జిల్లాలో టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలన్ని వైసీపీ ఖాతాలో పడ్డాయి. మహామహులు మట్టికరిచారు. టీడీపీ కేవలం పాలకొల్లు, ఉండి సీట్లతో సరిపెట్టుకుంది. ఇక వైసీపీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా ఈ యేడాదిన్నర కాలంలో వీరిలో చాలా మంది పనితీరు పూర్తి నిరుత్సాహంగా ఉందని వైసీపీ శ్రేణులే చెపుతున్నాయి. జిల్లాలో 13 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో మంత్రులుగా ఉన్న ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథ రాజు గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ముగ్గురు మంత్రులుగా తమదైన ముద్ర వేయలేకపోయారన్నదే వాస్తవం.
యాక్టివ్ గా లేక…..
కరోనా టైంలో ప్రెస్‌మీట్లతో హడావిడి చేసిన ఆళ్ల నాని తర్వాత అడ్రస్ లేరు. ఇక తానేటి వనిత, రంగనాథ రాజు మీడియాతో మాట్లాడిన క్లిప్పింగ్‌లే చాలా అరుదు. ఇక పోలవరంలో నాలుగుసార్లు గెలిచిన తెల్లం బాలరాజు ఏదో చేయాలన్న తపన ఉన్నా పెద్ద నియోజకవర్గం కావడంతో చేయలేని పరిస్థితి. మంత్రి పదవి ఆశల పల్లకీలో బాలరాజు ఉన్నారు. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాత్రం ఉన్నంతలో ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నారు. వీరిలో ప్రసాదరాజుకు మరో యేడాది తర్వాత అయినా మంత్రి పదవి ఖాయమే. ఇక తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు కూడా రెండోసారి గెలిచినా పార్టీలో, ప్రభుత్వంలో ప్రయార్టీ లేక ఆశల పల్లకీలో ఉన్నారు.
తొలిసారి గెలిచి….
ఇక మిగిలిన వారిలో చింతలపూడిలో వీఆర్. ఎలీజా, గోపాలపురంలో తలారి వెంకట్రావు, దెందులూరులో కొఠారు అబ్బయ్య చౌదరి, నిడదవోలులో శ్రీనివాసుల నాయుడు, ఉంగుటూరులో పుప్పాల శ్రీనివాస్ ( వాసుబాబు) తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపిస్తే వారంతా వారిపై ప్రజలు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది. మెట్ట ప్రాంతంలో చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో కనీసం ప్రధాన రహదారులపై తట్టెడు మట్టి పోసిన పరిస్థితి కూడా లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన రహదారుల్లో గుంతలు పడి ప్రజలు నరకయాతన పడుతున్నారు. రెండు దశాబ్దాల నుంచి అతీగతీ లేని రహదారుల పరిస్థితి ఘోర అధ్వానంగా ఉన్నా ఎమ్మెల్యేలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. చింతలపూడిలో ఎమ్మెల్యేకు గ్రూపు తగాదాలు ఉన్నాయి. గోపాలపురం ఎమ్మెల్యేకు నెక్ట్స్ ఛాన్స్ లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
టీడీపీలోకి జంప్ చేసేందుకు….
దెందులూరులో ఎన్నికలకు ముందు ప్రభాకర్‌పై కోపంతో నియోజకవర్గ ప్రజలు అబ్బయ్య చౌదరిని గెలిపించారు. అబ్బయ్య చౌదరి గెలిచాక నియోజకవర్గంలో అభివృద్ధి అన్న మాటే వినిపించడం లేదు… కనిపించడం లేదు. ప్రభాకర్ దూకుడుగా ఉంటారన్న విమర్శలు ఉన్నా…. అభివృద్ధిలోనూ అంతే దూకుడుగా ఉంటారు. గత ఎన్నికల్లో అబ్బయ్య గెలుపు కోసం పనిచేసిన కీలక నేతలే ఇప్పుడు ఆయనకు దూరం అయ్యారు. సామాన్య ప్రజలకు కాదు కదా.. కనీసం వైసీపీ నాయకులకే ఆయన పనిచేయట్లేదన్న టాక్ వచ్చేసింది. కొందరు సీనియర్ నేతలు టైం చూసుకుని టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు.
జగన్ గాలిలో గెలిచి……
ఇక ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఏలూరు వైసీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో నాలుగు మండలాలుంటే రెండు మండలాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలోనే సరిగా తిరగని వ్యక్తి పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంత వరకు ప్రభావం చూపుతారని ఈ పదవి ఇచ్చారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలే అంటున్నారు. పైకి సైలెంట్‌గా ఉన్నా నియోజకవర్గంలో అభివృద్ధి జీరోగానే కనిపిస్తోంది. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడుకు జిల్లాలోని అందరు ఎమ్మెల్యేల కంటే లీస్ట్ మార్కులే అని ఆ పార్టీలోనే చాలా మంది చర్చించుకుంటోన్న పరిస్థితి. ఎన్నికలకు ముందే నిస్తేజంగా ఉన్న ఆయన… జగన్ గాలిలో లక్ బాగుండి ఎమ్మెల్యే అయ్యారని.. ఆయన సింగిల్ టైం ఎమ్మెల్యేనే అంటున్నారు. ఏదేమైనా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన వారి పనీతీరు చాలా నిరుత్సాహంగా ఉందన్నది ప్రజల నుంచే వినిపిస్తోన్న మాట.