ఫ్యాన్ స్పీడ్ ఐదులో ఉందనుకున్నాం… కాదట…?
జగన్ ఫ్యాన్ గిర్రున తిరుగుతూ ఉంది. ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓట్ల షేర్ ఎక్కువయింది. జగన్ [more]
;
జగన్ ఫ్యాన్ గిర్రున తిరుగుతూ ఉంది. ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓట్ల షేర్ ఎక్కువయింది. జగన్ [more]
జగన్ ఫ్యాన్ గిర్రున తిరుగుతూ ఉంది. ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓట్ల షేర్ ఎక్కువయింది. జగన్ అధికారం చేపట్టిన 21 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించింది. పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఈ ఎన్నికలలో వైసీపీ తన ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు విపక్షం అన్నింటా విఫలమవ్వడమే ఇందుకు కారణం.
ఓట్ల శాతాన్ని……
2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీికి 50 శాతం ఓట్లు వచ్చాయి. అదేమున్సిపల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మరో మూడు శాతాన్ని పెంచుకోగలిగింది. 71 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 52.63 శాతం ఓట్లను సాధించగలిగింది. నిజానికి ఇది రికార్డు అని చెప్పాలి. ఏదైనా అధికారంలో ఉన్న పార్టీకి పట్టణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
కరోనా సమయంలోనూ……
అందునా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే కరోనా వచ్చింది. కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. అయినా జగన్ ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా ను ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. కరోనా వైరస్ సమయంలో జగన్ వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలను అందుకుంది. ఇది వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక వార్డు వాలంటీర్ల వ్యవస్థ కూడా వైసీపీకి అదనపు బలం అయింది.
ఇతర పార్టీలకు అందనంతగా…..
అందువల్లనే వైసీపీ తన ఓట్ల శాతాన్ని మూడు శాతం రెండేళ్ల తర్వాత కూడా పెంచుకోగలిగింది. గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు రాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కేవలం 30.73 శాతం ఓట్లను మాత్రమే సాధించుకోగలిగింది. జనసేనకు 4.67 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2.41 శాతం వచ్చాయి. ఈ లెక్కన చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటైనా వైసీపీ ఓట్ల శాతాన్ని చేరుకోకపోవడం విశేషం. ఓట్ల శాతం గణనీయంగా పెరగడంతో పార్టీలో జగన్ నాయకత్వం పై మరింత విశ్వాసం పెరిగింది.