అందరూ వైసీపీ వైపు.. ఆయన మాత్రం బీజేపీ వైపు?
రాష్ట్రంలో రాజకీయ చిత్రం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీవైపు నాయకులు చూస్తున్నారు. ఇతర పార్టీలు ఏవైనా ఆఖరుకు ఇతర పార్టీల్లో గెలిచిన వారు కూడా అధికారంలో [more]
రాష్ట్రంలో రాజకీయ చిత్రం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీవైపు నాయకులు చూస్తున్నారు. ఇతర పార్టీలు ఏవైనా ఆఖరుకు ఇతర పార్టీల్లో గెలిచిన వారు కూడా అధికారంలో [more]
రాష్ట్రంలో రాజకీయ చిత్రం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీవైపు నాయకులు చూస్తున్నారు. ఇతర పార్టీలు ఏవైనా ఆఖరుకు ఇతర పార్టీల్లో గెలిచిన వారు కూడా అధికారంలో ఉన్న వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కొందరు పదవుల కోసం.. మరికొందరు ఏదో ఒక పని దొరక్క పోతుందా ? అనే ఆశలతోను.. వైసీపీ వైపుచూస్తున్నారు. దీనికి జిల్లాలు, నగరాలతోను సంబంధం లేకుండా నాయకులు వైసీపీ వైపు పరుగులు పెడుతున్నారు. అయితే, పరిస్థితి ఇలా ఉంటే.. దీనికి భిన్నంగా విజయవాడకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు.
ఎవరికి కండువా కప్పుదామా?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎదగాలి.. అధికారంలోకి రావాలి.. అని కలలు గంటున్న బీజేపీ ఎవరు వస్తారు ? ఎవరికి కండువా కప్పుదామా ? అని ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎవరు వచ్చినా పార్టీలోకి చేర్చుకు నేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు చేరిన వారిని చూస్తే.. ఔట్ డేటెడ్ నాయకులు మాత్రమే బీజేపీ వైపు చూశారు. వెళ్తున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఆయనను సంప్రదించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
అపాయింట్ మెంట్ కూడా…..
గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న యలమంచిలి రవి.. టికెట్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనతో ఆయన వైసీపీలోకి వచ్చారు. అయితే.. ఆయన ఆశలు ఇక్కడా నెరవేరలేదు. పైగా ఎన్నికలకు ముందు వరకు ఆయనకే సీటు అని చెప్పిన వైసీపీ అధిష్టానం చివర్లో పీవీపీ ఒత్తిడికి తలొగ్గి బొప్పన భవకుమార్‌కు సీటు ఇచ్చింది. ఇక ఇప్పుడు భవకుమార్‌ను కూడా పక్కన పెట్టేసి దేవినేని అవినాష్‌కు పార్టీ బాధ్యతలు ఇచ్చింది. నాడు యలమంచిలి రవికి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగినా అసలు ఆ ఊసే లేదు. పైగా.. ఇప్పుడు వైసీపీలో ఏమాత్రం గుర్తింపు లేదు. ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. కొన్నాళ్ల కిందట ఇదే విషయంపై సీఎం జగన్‌తో చర్చించాలని నిర్ణయించుకుని.. అప్పాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు.
నిలకడలేని నేతగా….
దీంతో మరింత ఆవేదనలో ఉన్న యలమంచిలి రవి అవకాశం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో అంతో ఇంతో పుంజుకునేలా ఉన్న బీజేపీ అయితే.. బెటర్ అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ వైపు అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారని .. తాజాగా రాజకీయ వర్గాల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. అయితే.. యలమంచిలి రవికి నిలకడ లేని నేతగా పేరుండడం గమనార్హం. గతంలో ప్రజారాజ్యం, తర్వాత.. టీడీపీ, ఆ తర్వాత.. వైసీపీ ఇలా.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తుండడంతో కమ్మ సామాజిక వర్గం ఏమేరకు సహకరిస్తుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.