ఈ ఎమ్మెల్యేలు.. ఆ మంత్రులు.. జాగ్రత్త పడాల్సిందేనా ?
2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రుల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు వారికి.. ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలు ఎలా బలపడుతున్నాయి? అనే [more]
2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రుల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు వారికి.. ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలు ఎలా బలపడుతున్నాయి? అనే [more]
2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రుల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు వారికి.. ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలు ఎలా బలపడుతున్నాయి? అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచాయి. ఈ రెండేళ్ల కాలంలో ప్రతిపక్ష, అధికార పక్ష ఎమ్మెల్యేలు.. ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారు. వారి పనితీరు ఎలా ఉంది? అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని.. నియోజకవర్గాలను అభివృద్దిపథంలో నడిపిస్తామని హామీ ఇచ్చిన నాయకులు.. ప్రజల నుంచి ఓట్లు వేయించు కున్నారు. ఈ క్రమంలో వారు ఏమేరకు సక్సెస్ అయ్యారనేది ప్రధాన ప్రశ్న.
అందుబాటులో ఉండటం లేదంటూ….
ఇదే ప్రాతిపదికన అంటే.. ఎమ్మెల్యే పెర్‌ఫార్మెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం పదమూడు జిల్లాల్లో అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షంలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదని.. తమకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరడం లేదని అంటున్నారు. ఒక్క ఎమ్మెల్యేల విషయమే కాదు.. దాదాపు ఎనిమిది మంత్రుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. మంత్రులు తమను పట్టించుకోవడంలేదని అంటున్న జనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం గమనార్హం. దీంతో ఎక్కడెక్కడ ఎవరు వెనుకబడ్డారనే విషయంపై విశ్లేషణలు, సర్వేలు వస్తున్నాయి. దీనిని బట్టి మరి ఆ ఎమ్మెల్యేలు.. ప్రజాగ్రహం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారో.. లేదో.. చూడాలి. కొన్ని సర్వేల ప్రకారం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా.. ప్రజలు ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలు వీరే..
శ్రీకాకుళం: రాజాం, పాలకొండ, ఇచ్ఛాపురం
విజయనగరం: విజయనగరం, ఎస్.కోట, కురుపాం
విశాఖపట్నం: పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం
తూర్పుగోదావరి: పిఠాపురం, అనపర్తి, అమలాపురం, పెద్దాపురం, మండపేట
పశ్చిమ: కొవ్వూరు, నిడదవోలు, చింతలపూడి
కృష్ణా: విజయవాడ పశ్చిమ, తూర్పు, కైకలూరు, గన్నవరం
గుంటూరు: తాడికొండ, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, రేపల్లె
నెల్లూరు: కావలి, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట
ప్రకాశం: గిద్దలూరు, కొండపి, పరుచూరు, అద్దంకి
కడప: రైల్వేకోడూరు
చిత్తూరు: పూతలపట్టు, మదనపల్లె
అనంపురం: తాడిపత్రి, పుట్టపర్తి, పెనుకొండ
కర్నూలు: కర్నూలు, కోడుమూరు, ఆలూరు
సర్వేల ప్రకారం ప్రజాగ్రహానికి గురవుతున్న మంత్రులు వీరే :వైసీపీ
దేవదాయ శాఖ మంత్రి వెలపల్లి శ్రీనివాస్, హోం మంత్రి సుచరిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, శంకర నారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు.