రద్దుకు అసలు కారణం అదేనా?

వైసిపి అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండలిలో అడుగు పెట్టింది బహు తక్కువే. దానికి రీజన్స్ చాలానే వున్నాయి. తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీకి [more]

;

Update: 2020-01-27 02:00 GMT

వైసిపి అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండలిలో అడుగు పెట్టింది బహు తక్కువే. దానికి రీజన్స్ చాలానే వున్నాయి. తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీకి చంద్రబాబు మండలి ని ఎన్నుకోవడంతో బాటు పెద్దల సభను టిడిపి పునరావాసకేంద్రంగా చేసుకున్నారన్న అభిప్రాయం జగన్ కి గట్టిగా ఉండటంతో దీనిపై ఎప్పుడు ఆయన అయిష్టత కలిగివున్నారని అంటారు. టిడిపి నవసారధి లోకేష్ ను దొడ్డి దారిన ఎమ్యెల్సీని చేసి రాజకీయంగా ఆయనను ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలను ఎన్నికల ప్రచార సభల్లోనూ జగన్ తూర్పారబట్టేవారు. ఇక చివరికి మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానంలో లోకేష్ దారుణ పరాజయం తరువాత ఎమ్యెల్సీ గా చట్ట సభలో కొనసాగడం జగన్ కి మరింత మంట పుట్టిస్తుందని జనంలో గెలవలేని వారు తనను ప్రశ్నించడం ఏమిటనే ఆగ్రహం లోపల పెట్టుకునే అదనుకోసం వేచి చూసి మండలిని రద్దు చేయాలని భావిస్తున్నట్లు వైసిపి లో టాక్.

టిడిపి ఇచ్చిన అవకాశం ….

మూడు రాజధానుల కీలక బిల్లులపై మెజారిటీ సభ్యుల బలం వున్న టిడిపి ఏమి చేస్తుందో వైసిపి కి ముందే తెలుసని తెలుస్తుంది. అందుకే మనీ బిల్లు రూపంలో కాకుండా సాధారణ బిల్లులు గానే వాటిని ప్రవేశపెట్టి టిడిపి తనకు తాను గా ఉచ్చులో చిక్కుకునేలా జగన్ వ్యూహరచన చేశారని పార్టీ వర్గాల్లో టాక్. మండలి రద్దుకు టిడిపి దే బాధ్యతగా చూపేందుకు చక్కని అవకాశం లభిస్తుందని దీనిని ప్రజలు సైతం అర్ధం చేసుకుంటారన్న లెక్కల్లో వైసిపి ఉందంటున్నారు. తద్వారా మండలిలో హడావిడి చేస్తున్న లోకేష్ ను రాజకీయ నిరుద్యోగిని చేసి పడేయాలన్న జగన్ ఆలోచన నెరవేరుతుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ పై అసెంబ్లీ జరిగినప్పుడు దారుణమైన సెటైర్ల ను వదులుతున్నారు వైసిపి నేతలు.

జగన్ టార్గెట్ లోకేష్ …

అదే ఏ పదవి లేకుండా లోకేష్ ఉంటే మరింతగా ఆయనపై మాటల తూటాలు పేల్చడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో పాటు అనేకమంది టిడిపి సీనియర్ల పదవులు ఊడిపోవడం తో బాటు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఉనికిని గట్టిగా దెబ్బ తీయవచ్చన్నది వైసిపి ఎత్తుగడగా వుంది. లోకేష్ మరికొందరిని టార్గెట్ చేస్తూ మండలిని రద్దు చేశామన్న అపఖ్యాతి రాకుండా టిడిపి తనంత తాను గొయ్యి తవ్వుకునే వరకు వైసిపి ఆచితూచి ఉండి మూడు రాజధానుల అంశంలో నిర్ణయం ఇలా తీసుకోక తప్పలేదన్న ప్రచారం చేసుకునే వీలు దొరికిందన్నది విశ్లేషకుల అంచనా. దీనివల్ల తమ పార్టీకి కూడా జరిగే నష్టాన్ని మరో రూపంలో భర్తీ చేసుకోవొచ్చని మరో రెండేళ్ళు వీరిని భరించడం కన్నా ఇప్పుడే ఉద్వాసన పలకాలన్న నిర్ణయమే అధినేత ఆలోచన అంటున్నారు.

Tags:    

Similar News