స్థానికంపై వైసీపీ మరో వ్యూహం.. ఏం చేస్తోదంటే?
స్థానిక ఎన్నికల విషయంలో అధికార వైసీపీ మరో కీలక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. ఇప్పటికే [more]
;
స్థానిక ఎన్నికల విషయంలో అధికార వైసీపీ మరో కీలక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. ఇప్పటికే [more]
స్థానిక ఎన్నికల విషయంలో అధికార వైసీపీ మరో కీలక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ఎన్నికల కమిషన్.. అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించింది. దాదాపు అన్ని పార్టీలూ.. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకే మొగ్గు చూపాయి. అయితే, అధికార వైసీపీ మాత్రం ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టింది. పైగా రాష్ట్ర సర్కారును సంప్రదించాలన్న సుప్రీం కోర్టు సూచనలను కూడా ఎన్నికల కమిషన్ పాటించలేదని.. అలాంటప్పుడు.. మేం ఎందుకు వెళ్లాలని ప్రశ్నించింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని…..
రాష్ట్రంలో ఇప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ సదరు సమావేశానికి రాకపోయినా.. ఎన్నికల కమిషన్ మాత్రం తన నిర్ణయాన్ని వెలువరించే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో వెలువరించింది. దీనిని ఒక అవకాశంగా వైసీపీ మలుచుకునే ప్రయత్నంలో ఉంది. అంటే.. మా అభిప్రాయం తీసుకోకుండానే ఎన్నికల కమిషన్ ఎలా ఒక నిర్ణయానికి వస్తుందనే అంశాన్ని వైసీపీ హైకోర్టులో లేవనెత్తనుందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఈ అంశంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలినా.. మరో కొత్త వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది.
తాత్సారం చేయాలని…..
ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని హైకోర్టుకు వెల్లడించి.. స్థానికం జరిగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నా.. వైసీపీ మరో రూపంలో ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా మార్చి వరకు ఎన్నికలను నిలుపుదల చేయగలిగితే… ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవి నుంచి వైదొలుగుతారు. అప్పుడు కొత్తగా తమ వాడిని ఎన్నికల కమిషనర్‌గా నియమించుకునేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. ఎలాగూ.. ఎన్నికల కమిషనర్ అఫిడవిట్‌పై హైకోర్టులోనే సాధ్యమైనంతగా తాత్సారం చేయాలని సర్కారు నిర్ణయించుకుంది.
సాగదీయాలనే…..
అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పెద్దగా లేదన్న వైసీపీ పెద్దలే.. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఏపీనేనని వాదించే పనిలో పడ్డారు. ఇక, ఇక్కడ కూడా జనవరి నాటికి విషయం తేలిపోయి.. సర్కారుకు ప్రతికూలంగా తీర్పు వస్తే.. దానిని సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నారు. అక్కడ కూడా సాధ్యమైనంత సాగదీతల తర్వాత.. మార్చి వరకు పెండింగ్‌లో ఉంచి.. తర్వాత ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.