టీడీపీ ట్రాప్ లో జగన్ పడిపోయారా ?

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయన్న మాట ఉంది. రెండున్నర ఏళ్లుగా స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులు లేరు. అంతా అధికారుల పాలనే. జగన్ [more]

Update: 2020-12-03 12:30 GMT

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయన్న మాట ఉంది. రెండున్నర ఏళ్లుగా స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులు లేరు. అంతా అధికారుల పాలనే. జగన్ సీఎం అయిన వెంటనే ఎన్నికలు పెట్టేసి ఉంటే ఆ హోరులో జోరులో నూటికి నూరు శాతం ఫలితాలు వైసీపీ వైపే వచ్చేసేవి. కానీ లేట్ చేసి మరీ మొత్తానికి ఈ ఏడాది మార్చి నాటికి తెచ్చారు. కరోనా పేరిట అది కాస్తా వాయిదా పడిపోయింది. ఇపుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్నారు కానీ జగన్ సర్కార్ ససేమిరా అంటోంది.

ఆలస్యం విషమే….

ఎక్కడ చూసినా వైసీపీలో వర్గ పోరు పెరిగిపోయింది. విశాఖ కార్పొరేషన్ చూస్తే ఎంపిక చేసిన అభ్యర్ధుల మధ్య గొడవలు ముదిరాయి. వారిని తప్పించమని, తమకు ఆ టికెట్ ఇప్పించమని మిగిలిన వారు అడుగుతున్నారు. ఇక ఎంపికైన అభ్యర్ధులు కూడా ఇలా ఎన్నికల కొరకు ఎంతకాలం ఎదురుచూడాలి అని వైరాగ్యంలో పడిపోయారు. వారు కార్యకర్తలను పోషించలేక చేతులెత్తేస్తున్నారు. ఇది మార్చి నుంచి ఇప్పటికి వచ్చిన డెవలెప్ మెంట్. ఇక మరో వైపు చూస్తే నాయకులు కూడా అసంతృప్తి గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా మాకేంటి అంటున్నారు. ఇంకో వైపు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చాలా చోట్ల పడడంలేదు, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ఎడం పెరిగింది. దీంతో ఎన్నికలు అంటూ ఎపుడు వచ్చినా వైసీపీలో మునుపటి జోష్ లేదని అర్ధమవుతోంది.

పన్నుల దరువు …

ఇక రాష్త్రానికి ఖర్చే తప్ప నిఖార్సైన ఆదాయం ఒక వైపు లేదు, మరో వైపు ఆర్ధికంగా ఖజానాను నింపుకోవాలన్న ఆత్రంతో కొత్త పన్నులకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రోడ్డు టాక్స్ బాదుడు, ఇంటి పన్ను, ఆస్తిపన్నుల పేరిట వీర బాదుడు మొదలైపోయింది. ఇక కేవలం సంక్షేమం తప్ప డెవలెప్ మెంట్ లేదు, వరసగా కురుస్తున్న వానలతో విశాఖ లాంటి చోటనే మెయిన్ రోడ్లు చిల్లులు పడిపోతున్నాయి. పాత రోడ్లు పూడ్చడం మాట అటుంచి గతుకుల రోడ్ల మీద జనం ఈ రోడ్డు టాక్స్ బాదుడేంటి అని మండిపోతున్నారు. ఇవన్నీ రేపటి రోజున వైసీపీ సర్కార్ కి కత్తుల్లాంటి ప్రశ్నలే. సమాధానం కూడా అదే జనాలు ఓట్ల రూపంలో చెబితే వైసీపీకి దారుణమైన ఇబ్బందే.

బదనాం అవుతున్నారుగా…?

వైసీపీకి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు అని ఓ వైపు టీడీపీ అదే పాట పాడుతోంది. జనాలకు కూడా మెల్లగా అది ప్రభావం చూపేలాగానే టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. దాంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చేసిందా? అని జనం మనసులోకి ఒక్కసారి వెళ్తే దాని నుంచి వైసీపీ సర్కార్ బయటపడడం కష్టమే. ఇక జగన్ కొత్త జిల్లాలు అంటున్నారు. ఆ తరువాతనే స్థానిక ఎన్నికలు అంటే కచ్చితంగా అప్పటికి వైసీపీకి సగానికి స‌గం పాలన పూర్తి అవుతుంది. అపుడు కనుక స్థానిక ఎన్నికలు పెడితే నిజంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చే ఫలితాలే వస్తాయని అంటున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటూ టీడీపీ చేస్తున్న రచ్చకు నో చెబుతూ పూర్తిగా ఆ పార్టీ ట్రాప్ లో జగన్ పడిపోయారు అంటున్నారు.

Tags:    

Similar News