జిల్లాల విభజనకు మళ్లీ బ్రేక్… అసలు కథ ఇదే
సీఎం జగన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లాల విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు మరో సారి బ్రేకులు పడ్డాయని అంటున్నారు వైసీపీ నాయకులు. నిజానికి [more]
సీఎం జగన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లాల విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు మరో సారి బ్రేకులు పడ్డాయని అంటున్నారు వైసీపీ నాయకులు. నిజానికి [more]
సీఎం జగన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లాల విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు మరో సారి బ్రేకులు పడ్డాయని అంటున్నారు వైసీపీ నాయకులు. నిజానికి వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ భావించారు. ఈ క్రమంలోనే జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వంలో కమిటీని ఈ ఏడాది ఫిబ్రవరి లోనే ఏర్పాటు చేశారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న లేదా విభేదిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా బీజేపీ, కమ్యూనిస్టులు కూడా దీనిని వ్యతిరేకించడం లేదు.
అవరోధాలు లేకపోయినా…
దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు కూడా వైసీపీకి చాలా ఊతం ఇచ్చే విషయంగా కనిపిస్తోంది. ఎక్కడో ఒకటి రెండు ఆందోళనలు.. కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రుల నుంచి తప్ప..పెద్దగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు అవరోధాలు కూడాకనిపించడం లేదు. ఇక, కొత్త జిల్లాలకు ప్రజా నేతల పేర్లు పెట్టాలని కూడా వైసీపీ నిర్ణయించింది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు రెండు కారణాలు.. మరోసారి జిల్లాల ఏర్పాటుకు బ్రేకులు పడేలా చేశాయని అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు ఆఫ్ దిరికార్డుగా.
పార్లమెంటు నియోజకవర్గాలు….
అదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ప్రధాన కారణం.. పార్లమెంటు స్థానాలను ఆధారం చేసుకుని ఏర్పాటు చేయాలని అనుకున్న జిల్లాలు.. 2026లో పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉండడంతో సంఖ్యపై ఒక గందరగోళం ఏర్పడింది. ఈ విషయంలో కేంద్రం నుంచి సమాచారం అందడం లేదు. ఇక, నిధుల పరంగా కొత్త జిల్లాలకు ఇబ్బందులు తప్పవు. అధికారుల సంఖ్య కూడా భారీగా కావాలి. ఇవన్నీ ఇలా ఉంటే..జిల్లాల కమిటీ చైర్మన్ గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాహ్ని ఈ నెల ఆఖరులో పదవీ విరమణ చేయనున్నారు.
వచ్చే ఏడాదిలోనే….
దీనికితోడు కరోనా కారణంగా జల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. దీంతో వచ్చే ఏడాది డిసెంబరు నాటికి దీనిని వాయిదా వేయనున్నట్టు తెలు్స్తోంది. ఎందుకంటే.. స్థానిక ఎన్నికలతో మూడు నెలలు ఎలాగూ గడిచి పోతాయి. దీంతో జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. ఫైనల్‌గా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వచ్చే యేడాది అయినా జరుగుతుందా ? అన్న కొత్త సందేహం స్టార్ట్ అయ్యింది.