వైసీపీని ఆ విషయంలో నమ్మడంలేదా..?
వైసీపీ అధినాయకత్వం అనుకున్నంత సులువు కాదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉచ్చు నుంచి తప్పించుకోవడం. పైగా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ ఏదీ జగన్ సర్కార్ నుంచి [more]
;
వైసీపీ అధినాయకత్వం అనుకున్నంత సులువు కాదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉచ్చు నుంచి తప్పించుకోవడం. పైగా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ ఏదీ జగన్ సర్కార్ నుంచి [more]
వైసీపీ అధినాయకత్వం అనుకున్నంత సులువు కాదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉచ్చు నుంచి తప్పించుకోవడం. పైగా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ ఏదీ జగన్ సర్కార్ నుంచి లేదని జనాలు భావిస్తున్నారుట. అంతే కాదు ప్రధాని మోడీకి లేఖ రాసి జగన్ చేతులు దులుపుకున్నారన్న విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది యావత్తు ఏపీనే మండించే సెంటిమెంట్. అది కనుక రాజుకుంది అంటే ఆపడం ఎవరి తరం కాదు. ఇపుడిపుడే ఆ మంటలు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు మీద ఏపీ మొత్తం బంద్ జరిగింది అంటే ఉద్యమం మెల్లగా ఏపీవ్యాప్తం అయిందని అర్ధం చేసుకోవాలి.
అది చాలదుగా..?
అసలు విషయం వదిలేసి విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నామని, రాష్ట్ర బంద్ కి సంఘీభావం ప్రకటిస్తున్నామని వైసీపీ పెద్దలు భావించవచ్చు. కానీ ఇది సోషల్ మీడియా యుగం. ఎవరేంటి అన్నది జనాలకు బాగా తెలుసు అంటున్నారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన స్థాయిలో వైసీపీ నుంచి భారీ యాక్షన్ లేదని కూడా జనం భావిస్తున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేత పాదయాత్రలు చేయించినా, లేక బంద్ లో మొత్తం వైసీపీ నేతలు పాలుపంచుకున్నా కూడా విశాఖ ఉక్కు మీద వైసీపీ చిత్తశుద్ధిని జనాలు ఈ రొజుకీ శంకిస్తూనే ఉన్నారు.
గట్టి షాకేగా….?
తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద బంద్ సందర్భంగా విశాఖలో ఒక యువకుడే ఏకంగా విజయసాయిరెడ్డికి ఎదురెళ్ళి మరీ పోస్కో తో ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం వైసీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. పోస్కోతో ఒప్పందం తమ హయాంలో జరగలేదని విజయసాయిరెడ్డి బదులిచ్చినా ఆ యువకుడు శాంతించలేదు. పైగా ఇపుడు మీరు అధికారంలో ఉన్నారు. అందువల్ల మీరే పోస్కో ఒప్పందాన్ని రద్దు చేయాలి. లేదా చేయించాలి. లేకపోతే మిమ్మల్ని ఎవరూ ఉక్కు ఉద్యమంలో అసలు నమ్మరంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు. దీంతో ఉక్కు విషయంలో జనాల్లో వైసీపీ మీద ఉన్న అభిప్రాయం ఏంటో ఆ పార్టీ పెద్దలకు కళ్లకు కట్టినట్లు అయింది.
ఉక్కే ఉరి…..
ఇప్పటికి కూడా వైసీపీ ఈ అంశాన్ని చాలా లైట్ గా తీసుకుంటోంది. విశాఖ ఉక్కు ఉద్యమం విషయంలో బీజేపీనే నిందిస్తారు, తాము సేఫ్ జోన్ లో ఉన్నామనే భ్రమ పడుతోంది. కానీ జనాలకు ఎదురుగా ఉన్నది వైసీపీ, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఏపీ ప్రజల తరఫున మాట్లాడవలసింది. నిగ్గదీయాల్సింది జగనే. అందువల్ల జగన్ ఈ విషయంలో సైలెంట్ గా ఉంటే మాత్రం విశాఖలో రాజుకున్న ఉక్కు జ్వాలలు ఏపీనే చుట్టుముడతాయని అంటున్నారు. ఏపీలో ఒక్క భారీ పరిశ్రమ లేదు, ఉన్నది కూడా పోతే జనం తట్టుకోలేరు అన్న సందేశం కూడా దీని వెనక ఉంది అని మేధావులు అంటున్నారు. సో. తస్మాత్ జాగ్రత్త వైసీపీ నేతలూ అంటోంది విశాఖ జన మనోగతం.