అక్కడే కంట్రోల్ చేస్తే పోలా?

అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అయితే ఆయనను నియోజకవర్గంలోనే కంట్రోల్ చేసేందుకు వైసీపీ సిద్దమయినట్లు తెలుస్తోంది. సహజంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీ ఎమ్మెల్యే [more]

Update: 2020-10-28 02:00 GMT

అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అయితే ఆయనను నియోజకవర్గంలోనే కంట్రోల్ చేసేందుకు వైసీపీ సిద్దమయినట్లు తెలుస్తోంది. సహజంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా నామమాత్రమే అవుతారు. గత ఎన్నికల్లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో నలుగురు వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం 18 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఆ నియోజకవర్గాల్లో…..

అయితే ఈ పద్దెనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నామమాత్రమే అని చెప్పుకోవాలి. అధికారులు సయితం వీరి మాట వినడం లేదు. అక్కడ ఓడిపోయిన వైసీపీ ఇన్ ఛార్జి మాత్రమే పెత్తనం సాగిస్తుండటం విశేషం. నియోజవర్గంలో ఏ పని కావాలన్నా ఇన్ ఛార్జిని మాత్రమే సంప్రదించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు అందడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉత్సవ విగ్రహాలుగానే మారారు. కేవలం అధికారిక సమావేశాలకు మాత్రమే వారికి ఆహ్వానం అందుతుంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ…..

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. అయితే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలి హాట్ టాపిక్ గా మారింది. అక్కడ అచ్చెన్నాయుడు చెప్పిన పని ఏదీ కాకుండా చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. అచ్చెన్నాయుడు అధికారిక సమీక్షలకు కూడా ఎవరు వెళ్లవద్దని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట.

అధికారిక ఎమ్మెల్యేగా…..

మొన్నటి వరకూ టెక్కలి నియోజకవర్గ వైసీపీకి ముగ్గురు ఇన్ ఛార్జిలు ఉండేవారు. వారిలో పేరాడ తిలక్ కు కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం ఎంపిక చేసింది. కిల్లి కృపారాణికి పదవిని ఇచ్చేందుకు సిద్ధం చేశారు. దీంతో అధికారికంగా దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా ప్రకటించారు. అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా టెక్కలిలోనే కంట్రోల్ లో పెట్టాలన్న వ్యూహంలో వైసీపీ నేతలు ఉన్నారు. అచ్చెన్న నిర్ణయాలేవీ టెక్కలిలో అమలు కావడానికి వీల్లేదని అధికారులకు అనధికార ఆదేశాలు అందాయని చెబుతున్నారు. మొత్తం మీద అచ్చెన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతున్నా.. ఆయన ప్రాతినిధ్యం వహించే టెక్కలిలోనే తొలిగా ప్రభుత్వంతీరుపై ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News