వైసీపీకి బాగా కలిసొస్తుందే..?
గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీచింది. ఈ పార్లమెంటు స్థానంతో పాటు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో [more]
;
గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీచింది. ఈ పార్లమెంటు స్థానంతో పాటు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో [more]
గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీచింది. ఈ పార్లమెంటు స్థానంతో పాటు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాలను వైసీపీ దక్కించుకొని తెలుగుదేశం పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బనగానపల్లి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఓడిపోయింది. గత ఎన్నికల ముందే నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధాంచారు. దీంతో గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఇందుకోసం ముందునుంచే వ్యూహాలు రచిస్తోంది.
బలం పుంజుకున్న వైసీపీ….
వైసీపీ నుంచి మరోసారి కాటసాని రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లో ఉన్నారని పేరుంది. దీనికి తోడు వైసీపీకి ఇక్కడ బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. ఇక, తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరడం ఆ పార్టీ చాలా మేలు చేసే అవకాశం ఉంది. ఆయనకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంచి బలం ఉంది. ఆయన చేరికతో బలం బాగా పుంజుకున్న వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మండల, గ్రామ స్థాయిలో నాయకులు టీడీపీ నుంచి పెద్దఎత్తున వైసీపీలో చేరుతున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి సైతం కాటసాని విజయానికి సంపూర్ణంగా కృషి చేస్తున్నారు. దీంతో గత ఎన్నికలకు భిన్నంగా ఫలితం ఉంటుందని, వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ వైపు మొగ్గు ఉన్నా…
ఇక, తెలుగుదేశం నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, చల్లా సహా పలువురు నేతలు వైసీపీలో చేరడంతో ఆయన ఢీలా పడిపోయారు. ఓ దశలో పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. అధినేత టిక్కెట్ ఖరారు చేసినా పోటీ చేయనని వెనక్కు తగ్గారు. మళ్లీ చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో ఎన్నికల బరిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తన ఐదేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదపడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. స్వంతంగా ఆయనకు ఓటు బ్యాంకు ఏర్పడింది. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోతున్న క్యాడర్ ను ఆయన కాపాడుకోలేకపోవడం మైనస్ గా మారవచ్చు. మొత్తానికి ఇప్పటికైతే బనగానపల్లెలో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నా… ఎన్నికల వరకు పరిస్థితి మారవొచ్చు అనే అంచనాలు ఉన్నాయి.