అచ్చెన్న మీద ఇంకా గట్టిగానేనట ?

అచ్చెన్నాయుడు ఆరడుగుల మనిషి, భారీ విగ్రహం. అసలు ఆయన్ని చూస్తే ఎవరైనా జడుసుకోవాల్సిందే. మాట వింటే వణకాల్సిందే. అచ్చెన్నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నపుడు పులిలా ఉండేవారు. అసెంబ్లీలో [more]

Update: 2020-09-22 11:00 GMT

అచ్చెన్నాయుడు ఆరడుగుల మనిషి, భారీ విగ్రహం. అసలు ఆయన్ని చూస్తే ఎవరైనా జడుసుకోవాల్సిందే. మాట వింటే వణకాల్సిందే. అచ్చెన్నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నపుడు పులిలా ఉండేవారు. అసెంబ్లీలో ఆయన ఒక్కడు చాలు మొత్తం 68 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కలిపి జవాబు చెప్పేవాడు. ఓడలు బళ్లు అయిన చందాన అచ్చెన్నాయుడు ఇపుడు విపక్షంలోకి సీటు మారారు. అంతే ఫేట్ కూడా ఒక్కసారిగా తిరగబడింది. అచ్చెన్నాయుడుకు కష్టకాలం కరోనాతో పాటే వచ్చింది. అసలే కరోనా ఎక్కడికీ తిరగడానికి వీలు లేదు కాబట్టి అని ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటే ఈఎస్ఐ స్కాం పేరిట ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఏకంగా మూడు నెలల పాటు ఇంటి ముఖం చూడనీయలేదు. మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు ఇంకా ఇదివరకు మనిషిగా మారలేకపోతున్నారు.

అదేనా ఆరోపణ ……

అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ స్కాం కేసు ఇపుడు ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో అచ్చెన్నాయుడు సిఫార్స్ చేసినట్లుగా చెప్పబడుతున్న లెటర్స్ తప్ప మరేవిధమైన ఆధారాలు ఏవీ ఇంతవరకూ ఏసీబీ అధికారులు తమ దర్యాప్తు లో కొత్తగా సేకరించలేకపోయార‌ని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. ఆ లేఖల ఆధారంగా తాము సంబంధిత కంపెనీలకు అవకాశం ఇచ్చామని అధికారులు చెప్పినా కూడా ఈ మొత్తం కేసులో అచ్చెన్నాయుడు చేతుల్లోకి ఒక్క పైసా కూడా వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నారు. దాంతో ఈ కేసు ఎంత కాలం సాగినా చివరికి అచ్చెన్నాయుడు క్లీన్ చీట్ తో బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అనుచరులు అంటున్నారు.

మరో మారు….

ఇక అదే కనుక జరిగితే అచ్చెన్నాయుడుకు టెక్కలిలో ఎదురు ఉండదని అంటున్నారు. మిష్టర్ క్లీన్ ఇమేజ్ తో 2024 నాటికి ఈ కేసు నుంచి బయటకు వచ్చి అచ్చెన్నాయుడు పోటీ పడితే ఆయనదే మళ్లీ విజయం అని అంటున్నారు. దాంతో అచ్చెన్నను టార్గెట్ చేసిన వైసీపీ ఆయన్ని అసలు ఇలా వదిలేయకూడదని గట్టిగా నిర్ణయించుకుందని టాక్. అంటే అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన కాలంలో అనేక రకమైన లావాదేవీలు జరిగాయి. కాబట్టి ఈ కేసు కాకపోతే మరో కేసు అన్నట్లుగా వైసీపీ ఉందిట. అందుకోసం కొత్తగా అచ్చెన్నాయుడు పాత ఫైళ్లను కెలకడం మొదలెట్టారని ప్రచారం సాగుతోంది.

ఆ ఆరోపణల మీద….

ఇక శ్రీకాకుళం జిల్లాలో 2018లో తిత్లీ తుఫాన్ వచ్చింది. అపుడు పెద్ద ఎత్తున నష్టపరిహారం చేతులు మారిందని కూడా ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఇపుడు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందచేసే పనిలో వైసీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. అదే విధంగా బీసీలకు ఇచ్చే ఆదరణ పరికరాలు, లబ్దిదారులకు ఇచ్చే రుణాలలో అవకతవకలు జరిగాయని కూడా అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇపుడు వాటి మీద కూడా వైసీపీ నేతల కన్ను పడిందట. అవీ ఇవీ కలిపి అచ్చెన్నాయుడు మీద మరికొన్ని కేసులు బనాయించాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వీటి వల్ల ఏం జరుగుతుందో తెలియదు కానీ అచ్చెన్నకు రానున్న రోజులు గడ్డువేనని ఆయన అనుచరులు కూడా అంగీకరిస్తున్నారుట.

Tags:    

Similar News