వైసిపి వ్యూహానికి చుక్కెదురు

తమ ఓటు బ్యాంక్ ను మరింత సుస్థిరం చేసుకునేందుకు వైసిపి ముందు చూపుతో చేసిన వ్యూహనికి కేంద్రంలో చుక్కెదురైంది. ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో వైసిపికి మైనారిటీ, ఎస్సి, [more]

Update: 2019-07-13 14:30 GMT

తమ ఓటు బ్యాంక్ ను మరింత సుస్థిరం చేసుకునేందుకు వైసిపి ముందు చూపుతో చేసిన వ్యూహనికి కేంద్రంలో చుక్కెదురైంది. ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో వైసిపికి మైనారిటీ, ఎస్సి, ఎస్టీలు, క్రైస్తవులు పూర్తి అండగా ఉన్నారు. ఈ ఓటు బ్యాంక్ కి మొన్నటి ఎన్నికల్లో టిడిపి సంప్రదాయ బిసి ఓటు బ్యాంక్ జత చేరడంతో ఆ పార్టీకి అఖండ విజయం చేకూరింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి ఇలాంటి విజయం దక్కాలంటే బిసిల అండ దండా ఉండాలన్నది వైసిపి అధినేత జగన్ ఆలోచన. అందుకు అనుగుణమైన అడుగులను ఇప్పటినుంచి ఆ పార్టీ వేయడం మొదలు పెట్టింది.

విజయసాయి చేత …

బిసిలను తమవైపు పూర్తిగా తిప్పుకునేందుకు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యూహాత్మకంగా ప్రయివేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. చట్టసభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఈ బిల్లు ఉద్దేశ్యం. దీనికి అనేక పార్టీలనుంచి మద్దతు కూడా లభించింది. అయితే ఆయన ప్రయత్నం ప్రభుత్వం తిప్పికోట్టింది. ఈ బిల్లుపై విజయసాయి ఓటింగ్ కి పట్టుపట్టారు. సభలో మెజారిటీ పార్టీలు ఆయన ప్రయత్నానికి అండగా నిలిచాయి. ఓటింగ్ అంటూ జరిగితే బిల్లు కార్యరూపానికి అంకురార్పరణ జరిగేది. అదే జరిగితే దేశ వ్యాప్తంగా సంచలనమే అయ్యేది. ఈ క్రెడిట్ వైసిపికి పూర్తిగా దక్కేది కూడా. అయితే కుల, మత, ప్రాంత రాజకీయాల్లో ఆరితేరడమే కాదు ఇలాంటి వ్యూహాలే అమలు చేసే కమలనాధులు వైసిపి కి ముందుగానే చెక్ పెట్టేశారు. బిసి రిజర్వేషన్ బిల్లు ముందుకు పోకున్నా ఒక మార్పు కోసం, తమ రాజకీయ అధికారం కోసం జరిపిన పోరాటానికి వెనుకబడిన వర్గాల నుంచి వైసిపి కి బలమైన మద్దతు లభించడం విశేషం.

అక్కడ లేకపోతే ఇక్కడ ….

అన్ని కులాలకు రాజ్యాధికారం ఉండాలని చెప్పే వైసిపి అధినేత కేంద్రం లో చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఎపి అసెంబ్లీ ద్వారా కొత్త ప్రయాగానికి సిద్ధం అవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. శాసన సభ ద్వారా బిసి లకు సంబంధించి తన పరిధిలో చేయాలిసినదంతా చేస్తారని చెబుతున్నారు. తద్వారా బిసిలకు అండాదండా ఉండేది తెలుగుదేశం కాదని తామేనని జగన్ నిరూపిస్తారని విశ్లేషకుల అంచనా. మరి జగన్ ఇకపై ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి. ఆయన వ్యూహాలు ఫలిస్తే బిసిల వెన్నెముకగా నిలబడిన టిడిపి ఎలాంటి ప్రతివ్యూహంతో తమ ఓటు బ్యాంక్ నిలబెట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News