ఫ్యాక్ట్ చెక్: "బీజేపీకి ఓటు వేయవద్దు" అని బెంగాల్ ప్రజలు చెబుతున్న వైరల్ వీడియో ఇటీవలిది కాదు

ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికలు 7 దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1, 2024న ముగుస్తాయి.

Update: 2024-03-26 11:06 GMT

NoVoteToBJP

ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికలు 7 దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1, 2024న ముగుస్తాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలతో పాటు జూన్ 4, 2024 ఫలితాలు ప్రకటించనున్నారు.

కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేయగా.. మరి కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రచారంలోకి దింపేశాయి. ఇలాంటి సమయంలో తప్పుడు వాదనలతో అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. "బీజేపీకి ఓటు వేయవద్దు" అనే ప్లకార్డులను పట్టుకున్న ప్రజలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. "#NoVoteToBJP" అనే శీర్షికతో వైరల్ వీడియోను షేర్ చేస్తున్నారు.

Full View



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2021 సంవత్సరం నాటిది.
“బీజీపీకి ఓటు వేయవద్దు” అనే కీవర్డ్‌లను ఉపయోగించి మేము సెర్చ్ చేశాం. ఫిబ్రవరి 2021లో పలు మీడియా సంస్థలు ఆన్ లైన్ లో ప్రచురించబడిన కథనాలను మేము కనుగొన్నాము.
wire.in ప్రకారం.. నవంబర్ 2020లో వివిధ ఉద్యమాలలో భాగమైన వ్యక్తులంతా కలిసిన ఓ సమూహం రోడ్ల మీదకు వచ్చింది. ఫాసిస్ట్ RSS-BJPకి వ్యతిరేకంగా బెంగాల్ లో ప్రజలు పోరాడాలని వారంతా పిలుపును ఇచ్చారు. “Bengal against Fascist RSS-BJP’ అనే ఫోరమ్ ను ఏర్పాటు చేశారు.
‘No Vote to BJP’ అనే యూట్యూబ్ వీడియోను కూడా మేము గమనించాం. No Vote to BJP । বিজেপিকে একটিও ভোট নয়। అనే టైటిల్ తో ఫిబ్రవరి 13, 2021న వీడియోను అప్లోడ్ చేశారు.
Full View

ఇదే వీడియోను ఫిబ్రవరి 16, 2021న 'No Vote to BJP' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అప్లోడ్ చేశారు. #BengalElections 2021, #No Vote to BJP అనే క్యాప్షన్‌తో వీడియోను అప్లోడ్ చేశారని మేము గుర్తించాం.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన వైరల్ వీడియో ఇటీవలిది కాదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు 2021 సంవత్సరంలో అప్లోడ్ చేసిన వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  A viral video showing people from West Bengal saying “No vote to BJP” is a recent one, shot ahead of the 2024 Lok Sabha elections
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News