నిజమెంత: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కింద కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వనుందా..?
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం కింద ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు అందించనుందని ఒక వార్తాపత్రిక కు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.
క్లెయిమ్: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కింద ఏప్రిల్ 1 నుండి సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారా
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం కింద ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు అందించనుందని ఒక వార్తాపత్రిక కు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు ఈ వార్తాకథనాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. స్క్రీన్‌గ్రాబ్ షేర్ చేయబడింది. "बहुत बहुत आभार आदरणीय प्रधानमंत्री जी" ("గౌరవనీయ ప్రధాన మంత్రి.. మీకు కృతజ్ఞతలు.") అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
మా బృందం ఈ పోస్టు తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటనేమీ రాలేదు.క్లెయిమ్‌ను పరిశోధిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇటీవల అలాంటి ప్రకటనలు ఏమైనా చేసిందా అని తెలుసుకోవడానికి మేము మొదట కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. KCC పథకం కింద ప్రభుత్వం వడ్డీ రహిత రుణాన్ని అందజేస్తోందని పేర్కొంటూ ఒక్క వార్తా నివేదిక కానీ, ప్రభుత్వ పత్రికా ప్రకటన కానీ మాకు కనిపించలేదు.
KCC పథకం కింద రుణాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోడానికి, మేము ను సందర్శించాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్
కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు శాతం సబ్సిడీ ఇస్తే KCC పథకం కింద ఏడు శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చని ఎస్‌బీఐ వెబ్‌సైట్ పేర్కొంది. అంటే అసలు వడ్డీ రేటు ఏడాదికి తొమ్మిది శాతం. మార్చి 11, 2022న ఎస్‌బీఐ వెబ్‌సైట్ లో అప్‌డేట్ చేయబడింది.
వార్తా నివేదికల ప్రకారం, KCC పథకం కింద, రైతులు సంవత్సరానికి కేవలం నాలుగు శాతం వడ్డీ రేటుకు ఐదేళ్లలో 3 లక్షల రూపాయల వరకూ లోన్స్ పొందవచ్చు.
ఇది వర్తించాలంటే, రైతులు తమ ప్రస్తుత రుణాలను సకాలంలో చెల్లించాలి. రైతు తొలి రుణాన్ని సకాలంలో చెల్లిస్తే మూడు శాతం రాయితీ పొందవచ్చు. అంతేకాకుండా రైతు సంవత్సరానికి నాలుగు శాతం వడ్డీని మాత్రమే చెల్లించాలి. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోడానికి SBI ప్రతినిధులను సంప్రదించగా " ఏప్రిల్ 1, 2022 నుండి KCC కింద రుణాలు వడ్డీ రహితంగా ఉంటాయని మాకు ఇంకా అలాంటి సర్క్యులర్ ఏదీ అందలేదు" అని SBI ప్రతినిధి తెలిపారు.
వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించవచ్చు. కేసీసీ పథకం కింద వడ్డీ లేని రుణాలు అందించడంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
క్లెయిమ్: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కింద ఏప్రిల్ 1 నుండి సున్నా వడ్డీకే రుణాలు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
క్లెయిమ్: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కింద ఏప్రిల్ 1 నుండి సున్నా వడ్డీకే రుణాలు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : From April 1, the Centre will offer loans at 0% interest under the Kisan Credit Card (KCC) scheme.
Claimed By : Social Media Users
Fact Check : False