నిజమెంత: పెళ్లిపీటల మీదనే కట్నం డిమాండ్ చేస్తున్న వీడియో.. వివాహానికి వధువు నిరాకరించిందా
వరుడు కట్నం డిమాండ్ చేస్తున్న పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, పెళ్లి దుస్తులలో ఉన్న వరుడు వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తితో మాట్లాడటం చూడవచ్చు. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని గురించి వరుడిని అడుగగా
క్లెయిమ్: పెళ్లి కొడుకు కట్నం డిమాండ్ చేస్తున్న వీడియో.. వధువు పెళ్లి చేసుకోనంది
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. అదొక స్క్రిప్టెడ్ వీడియో
వరుడు కట్నం డిమాండ్ చేస్తున్న పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, పెళ్లి దుస్తులలో ఉన్న వరుడు వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తితో మాట్లాడటం చూడవచ్చు. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని గురించి వరుడిని అడుగగా.. కట్నం డబ్బులు ఇచ్చే వరకు వివాహం జరగదని, ఇతర వస్తువులు అందడం లేదని అతను సమాధానమిచ్చాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని, తన తండ్రి టీచర్ అని, కట్నం డిమాండ్ చేయడంలో తప్పే లేదని వరుడు చెబుతున్నాడు. అన్ని డిమాండ్లు నెరవేరాయని, మిగిలిన డిమాండ్లను కూడా నెరవేరుస్తామని వధువు చెప్పడం వీడియోలో వినబడుతుంది. తనకు ఇప్పుడే అన్నీ కావాలని వరుడు బదులిచ్చాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తులు వరుడిపై కోపాన్ని ప్రదర్శిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో బీహార్‌లోని చప్పల్‌పూర్‌కి చెందినదని చెబుతున్నారు.
పలువురు ప్రముఖ వ్యక్తులు, మీడియా సంస్థలు ఈ ఘటన నిజంగా చోటు చేసుకుందని నమ్మి కథనాలను పోస్టు చేశారు. Times Of India, AsiaNet News, The Indian Express, Lokmat, NDTV, DNA, Zee News, India.com, News18 కన్నడ వంటి మీడియా సంస్థలు కూడా నిజమైన ఘటనగా భావించి ఈ వీడియోను నివేదించాయి.
నిజ నిర్ధారణ:
మా ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ కథనాలు తప్పు అని నిర్ధారించింది. వైరల్ వీడియో స్క్రిప్ట్ అని తెలుస్తోంది.
ప్రాథమిక విచారణలో మేము వీడియోలోని మాటలను జాగ్రత్తగా విన్నాము. వీడియోలో, ఒక వ్యక్తి "నేను ఇక్కడ బీహార్‌లోని చప్పల్‌పూర్‌లో ఉన్నాను" అని చెప్పడం వినవచ్చు. మేము చప్పల్‌పూర్ గ్రామాన్ని కనుగొనడానికి ప్రయత్నించాము, అయితే బీహార్‌లో అలాంటి గ్రామం ఉందని కనుక్కోలేకపోయాము.
ఈ వీడియో ఫిబ్రవరి 25, 2022న Facebook పేజీ 'దివ్య విక్రమ్' ద్వారా అప్‌లోడ్ చేయబడిందని మేము కనుగొన్నాము. వీడియోకు 7.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మేము ఈ పేజీని పరిశీలించగా.. వీడియో కంటెంట్ సృష్టికర్త అని కనుగొన్నాము.
ప్రాథమిక విచారణలో మేము వీడియోలోని మాటలను జాగ్రత్తగా విన్నాము. వీడియోలో, ఒక వ్యక్తి "నేను ఇక్కడ బీహార్‌లోని చప్పల్‌పూర్‌లో ఉన్నాను" అని చెప్పడం వినవచ్చు. మేము చప్పల్‌పూర్ గ్రామాన్ని కనుగొనడానికి ప్రయత్నించాము, అయితే బీహార్‌లో అలాంటి గ్రామం ఉందని కనుక్కోలేకపోయాము.
ఈ వీడియో ఫిబ్రవరి 25, 2022న Facebook పేజీ 'దివ్య విక్రమ్' ద్వారా అప్‌లోడ్ చేయబడిందని మేము కనుగొన్నాము. వీడియోకు 7.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మేము ఈ పేజీని పరిశీలించగా.. వీడియో కంటెంట్ సృష్టికర్త అని కనుగొన్నాము.
వైరల్ వీడియో లోని వ్యక్తులే కొన్ని ఇతర వీడియోలలో కూడా ఉన్నట్లు మేము కనుగొన్నాము. ఒక వీడియోలో వరుడు తాగిన స్థితిలో ఉండడాన్ని చూడవచ్చు, ఆ తర్వాత కోపంతో ఉన్న వధువు అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. ఇంకొన్ని వీడియోల్లోనూ వీడియో బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండడం, వధూవరులు ఒకే డ్రెస్‌లో ఉండడం గమనించాల్సిన విషయం. వైరల్ వీడియోలు స్క్రిప్ట్‌తో క్రియేట్ చేసినవని మనకు స్పష్టంగా తెలుస్తుంది.
మరిన్ని వివరాలు కనుక్కోడానికి ప్రయత్నించగా, ఈ పేజీని విక్రమ్ మిశ్రా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు మేము కనుగొన్నాము. మేము ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విక్రమ్‌ని సంప్రదించాము. వైరల్ వీడియో స్క్రిప్ట్ అని విక్రమ్ మాకు చెప్పారు. "సమాజంలో జరుగుతున్న ఇలాంటి దురాచారాల గురించి అవగాహన కల్పించేందుకే మేము ఇలాంటి స్క్రిప్ట్ వీడియోలను తయారు చేస్తున్నాము. నాకు 'విక్రమ్ మిశ్రా', 'జై మిథిలా' అనే యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి. ఈ వీడియోను ఫిబ్రవరి 25 న మా ఫేస్‌బుక్ పేజీ దివ్య విక్రమ్‌లో అప్‌లోడ్ చేసాము. వీడియోలో కనిపించే వధూవరులు ఇద్దరూ నటులు, వీడియో స్క్రిప్ట్ చేయబడింది." అని తెలిపారు.
వరుడు కట్నం డిమాండ్ చేస్తున్న వైరల్ వీడియో నిజమైనది కాదని, స్క్రిప్ట్‌తో రూపొందించబడిందని మా పరిశోధనలో స్పష్టమైంది. సమాజంలో కొనసాగుతున్న దురాచారాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీన్ని రూపొందించారు. కాబట్టి, వైరల్ క్లెయిమ్ తప్పు.
క్లెయిమ్: పెళ్లి పీఠల మీదనే కట్నం డిమాండ్ చేస్తున్న వీడియో
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, మీడియా సంస్థలు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Viral Video Of Groom Demanding Dowry
Claimed By : Social Media Users
Fact Check : False