ఫ్యాక్ట్ చెక్: మనిషి కాలికి వేసిన పట్టీ లోకి పాము దూరలేదు, ఇది అబద్దం

ఎక్స్-రే అనేది మానవ శరీరం లోపలి భాగాల గురించి తెలుసుకోడానికి రేడియేషన్‌ను ఉపయోగించే ఒక రకమైన మెడికల్ ఇమేజింగ్.

Update: 2024-09-13 05:01 GMT

Snake sneaks into plaster cast

ఎక్స్-రే అనేది మానవ శరీరం లోపలి భాగాల గురించి తెలుసుకోడానికి రేడియేషన్‌ను ఉపయోగించే ఒక రకమైన మెడికల్ ఇమేజింగ్ టెక్నీక్ఎక్స్-రే కిరణాలు సాధారణంగా విరిగిన ఎముకలు, దంతాల గురించి తెలుసుకోడానికి ఉపయోగిస్తారు. లోపల అయిన గాయాలు, రుగ్మతలు, వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. జీర్ణవ్యవస్థలోని భాగాలను అంచనా వేయడానికి మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలోని రాళ్లు మొదలైన పరిస్థితులను నిర్ధారించడంలో కూడా సహాయపడతాయి. శరీరం గుండా రేడియేషన్ కిరణాలను పంపడం ద్వారా లోపల ఏమి జరుగుతోందో తెలుసుకోవచ్చు. రేడియేషన్ కిరణాలు కనిపించవు, మనం అనుభూతి చెందలేము కూడా.

ఎముకలు వంటి ఘన, దట్టమైన వస్తువులు రేడియేషన్‌ను సులభంగా గ్రహిస్తాయి. కాబట్టి అవి ఎక్స్-రే చిత్రంలో బూడిద రంగులో కనిపిస్తాయి. కొందరు వ్యక్తులు ఏదైనా మింగేసినా, శరీరంలోపల ఏమైనా చొచ్చుకు వెళ్లినా వాటిని ఎక్స్ రే సహాయంతో గుర్తిస్తారు. ఓ ఎక్స్ రే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ వ్యక్తి కాలు భాగంలో వేసిన పట్టీలోకి పాము లోపలికి వెళ్లిపోయిందని ఆ పోస్టుల ద్వారా చెబుతూ ఉన్నారు. ఒక పాము, గుండ్రని వస్తువు ఎక్స్-రే చిత్రంలో కనిపిస్తున్నాయిఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నప్పుడు పాము ప్లాస్టర్ లోపలికి చొరబడిందని వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది.

“This is crazy! A snake inside a plaster cast, nice and warm I’m guessing”. “This is not a snake and ladder, this is a snake in plaster. Snake took shelter inside the plaster. The patient was sleeping out of the house in open” అనే వాదనతో పోస్టులు పెడుతున్నారు. 

ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇలాంటి కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్ :

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మేము ఈ పోస్ట్‌పై కామెంట్స్ ను తనిఖీ చేసినప్పుడు, పోస్టు పెట్టిన X వినియోగదారు తన స్నేహితులలో ఒకరు ఈ చిత్రాన్నిషేర్ చేశారని తెలిపారు. అసలు ఫోటోను Instagram ఖాతా నుండి తీసుకున్నానని పేర్కొంటూ ఒక కామెంట్ ను స్వయంగా పంచుకున్నట్లు మేము కనుగొన్నాము. అది ఫేక్ అని తెలిసి కూడా ఆ చిత్రాన్ని షేర్ చేశానని తెలిపాడు.
మరో వైద్యుడు తన లింక్డ్‌ఇన్ ఖాతాలో ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ ఈ చిత్రం ఫేక్ అని చెప్పడానికి ఎన్ని కారణాలు వస్తాయో అడిగారు. ఈ పోస్ట్‌పై పలువురు వైద్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చిత్రం నకిలీదని పేర్కొన్నారు. పాము నకిలీదని పేర్కొంటూ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ చేసిన కామెంట్స్ ను మేము కనుగొన్నాము. ఎందుకంటే ఎక్స్-రే చిత్రంలో నిజమైన పాము అంత క్లారిటీగా కనిపించదు. అదే ఫోటోలో నాణెం డాలర్ లేదా గుండ్రని మెటల్ వస్తువు కావచ్చు అని కూడా తెలిపారు.
Full View
మేము ఎక్స్-రే చిత్రంలో పాములు ఎలా కనిపిస్తాయో తనిఖీ చేశాం. పాములకు సంబంధించిన ఎక్స్-రే చిత్రాలు వైరల్ చిత్రంతో సరిపోలడం లేదని మేము కనుగొన్నాము. పాము అస్థిపంజరం ఎక్స్-రే కిరణాలలో కనిపిస్తుంది. చర్మం లేదా పొలుసులలో కనిపించదు. ఏదైనా జంతువుకు సంబంధించి ఎక్స్-రే తీసినా దాని అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, కణజాలం సాంద్రత కారణంగా ఇతర గాయాలు, వ్యాధుల లక్షణాలను చూపుతాయి. 
అలమీ 
స్టాక్ లో షేర్ చేసిన పాము ఎక్స్ రే చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు.

రెండు ఎక్స్-రే ల పోలిక ఇక్కడ ఉంది.


అందువల్ల, వైరల్ చిత్రం నిజమైన ఎక్స్-రే కాదు. ఇది నకిలీ చిత్రం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim :  పాము మనిషి కాలుకి వేసిన పట్టీలోకి ప్రవేశించి, అక్కడే ఉండిపోయింది.
Claimed By :  Whatsapp Users
Fact Check :  False
Tags:    

Similar News