నిజ నిర్ధారణ: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదు

ఒక ఆపరేషన్‌లో, 25,000 కిలోల ఎండిన ఈస్ట్‌తో కలిపిన మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్నారనే అనుమానంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఓడరేవులో ఒక కంటైనర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

Update: 2024-03-23 12:58 GMT

Purandeswari

ఒక ఆపరేషన్‌లో, 25,000 కిలోల ఎండిన ఈస్ట్‌తో కలిపిన మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్నారనే అనుమానంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఓడరేవులో ఒక కంటైనర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ పేరుతో బ్రెజిల్ నుండి బుక్ చేయబడింది. సంధ్య ఆక్వాకు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి మధ్య సంబంధం ఉందని కొన్ని మీడియా పబ్లికేషన్లు ఆరోపిస్తున్నాయి.

ఈ ఆరోపణల తర్వాత, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లెటర్ హెడ్‌పై ఆమె పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వాట్సాప్‌తో సహా ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యింది.
తెలుగులో ఈ లేఖ లో ఉన్నది ఏమిటంటే "పత్రికా ప్రకటన

విషయం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా

ఆంధ్రా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా 2014లో అ పార్టీకి రాజీనామా చేసి, భారతీయజనతా పార్టీలో చేరడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశాను. పార్టీ అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటించాను. దేశ అభివృద్ధి కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించాను. గత పదేండ్లుగా భారతీయ జనతా పార్టీకి సేవలందిస్తూ.. ప్రజల పక్షాన నిలబడ్డాను. నా కష్టార్జితాన్ని గుర్తించి 2023 జూలై 4న భాజపా అధిష్టానం నన్ను ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షురాలిగా నియమించింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరియు 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టడం జరిగింది.

అయితే, దీవి: 21.03.2024 (గురువారం) రోజున విశాఖ తీరంలో మా సమీప బంధువు, వ్యాపార భాగస్వామి యొక్క కంటైనర్ లో డ్రగ్స్ పట్టుబడడం నా దృష్టికి వచ్చినది. సదరు వ్యక్తి సంధ్యా ఎక్స్ పోర్ట్స్ యజమాని, మా వియ్యంకుడు వీరభద్రరావుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాల్లో నాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నా భర్త, నా కొడుకు ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయా వార్తలు, ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని మీకు తెలియజేస్తున్నాను. ఈ కేసులో దోషులెవరో తేలేవరకు అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. అవినీతి మరకలేని భాజపా ప్రతిష్టను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన భాజపా శ్రేణులకు శిరస్సువంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలోనే నా రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయాధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి సమర్పిస్తానని మీకు తెలియజేస్తున్నాను.”



ఆమె రాజీనామా చేసినట్టు కొంతమంది యూజర్లు లేఖ జత చేయకుండానే షేర్ చేసారు.


Full View



 

ఫ్యాక్ట్ చెకింగ్:

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు దగ్గుబాటి పురందేశ్వరి ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారన్న వాదన అవాస్తవం. లేఖ బూటకపుది.
తెలుగులో, ఆంగ్లం లో “బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురందేశ్వరి రాజీనామా..!” అనే కీవర్డ్ ల తో శోధించగా ఆమె సోషల్ మీడియా ఖాతాలలో అటువంటి లేఖ ఏదీ మాకు లభించలేదు.

గత 10 సంవత్సరాల భారత్‌లో 'చాలా మారిపోయింది'

శరణార్థులకు గౌరవం వచ్చింది; మహిళా శక్తికి హక్కు వచ్చింది! అంటూ భారత ప్రధాని గురించి ఆమె చేసిన తాజా పోస్ట్ మాత్రమే లభించింది.
Full View
బీజేపీ ఏపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో శోధించగా, సర్క్యులేషన్‌లో ఉన్న లేఖ నకిలీదని పేర్కొంటూ పోస్ట్‌లు కనిపించాయి. ఖాతాలు, “ముఖ్య సూచన సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్న ఈ లెటర్ ఒక ఫేక్ లెటర్. NDA వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్న కూటమి ఫేక్ న్యూస్ అని గమనించగలరు. 
A Fake letter claims that BJP AP State President Smt Daggubati Purandeswari has resigned. 
Please note that it is a fake news being circulated by anti NDA alliance forces." అంటూ తెలుగు, ఆంగ్లంలో సందేశాన్ని పంచుకున్నాయి

Full View
ఈ లేఖ బూటకమని బీజేపీ మీడియా విభాగం వాట్సాప్‌లో సందేశాలను కూడా పంచుకుంది.
కనుక, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు దగ్గుబాటి పురందేశ్వరి ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది అనే వాదన అవాస్తవం. ఆమె అలాంటి లేఖను విడుదల చేయలేదు.
Claim :  Andhra Pradesh BJP party president Daggubati Purandeswari released a press note that she is resigning as party president
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News