ఫ్యాక్ట్ చెక్: ది న్యూయార్క్ టైమ్స్‌లో చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్ అంటూ కథనం ప్రచురించారు, కానీ మొదటి పేజీలో లేదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. నరేంద్ర మోదీతోనూ, మంత్రివర్గ సభ్యులతోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
కూటమి భాగస్వాములు, ఇద్దరు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్-యునైటెడ్ అధినేతలు మోదీ ప్రభుత్వంలో కింగ్‌మేకర్ పాత్రలను పోషించబోతున్నారు. ఈ ఇద్దరు కింగ్‌మేకర్‌ల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా వర్గాలు కథనాలను ప్రచురించాయి. చంద్ర బాబు నాయుడు, నితీష్ కుమార్‌లు కింగ్‌మేకర్‌లంటూ ‘ది న్యూ కింగ్‌మేకర్స్ హూ కుడ్ మేక్ ఆర్ బ్రేక్ మోదీ’ అనే శీర్షికతో ‘ది న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ కథనం స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. ఈ కథనాన్ని జూన్ 5, 2024న న్యూయార్క్ టైమ్స్ ఎడిషన్ మొదటి పేజీలో ప్రచురించారు. ‘*The New York Times* front page..’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. చంద్రబాబు నాయుడుపై న్యూయార్క్ టైమ్స్‌లో కథనం ప్రచురితమైంది.. కానీ మొదటి పేజీలో ప్రచురితమవ్వలేదు.
న్యూయార్క్ టైమ్స్ వెబ్‌సైట్‌లో వెతికితే.. వార్తాపత్రిక మొదటి పేజీలో కథనం మాకు కనిపించలేదు. న్యూయార్క్, నేషనల్ (యునైటెడ్ స్టేట్స్), (ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు) కోసం విడివిడిగా మొదటి పేజీలు ఉన్నాయి, ఈ మూడింటిలో చంద్ర బాబు నాయుడు గురించి ఎలాంటి కథనాన్ని చూడలేకపోయాము. ఇంటర్నేషనల్
మరింతగా వెతికితే.. భారత రాజకీయాలలో కింగ్‌మేకర్‌లుగా కొందరు నేతలు ఉన్నారనే కథనం లోపలి పేజీలలో కనపడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనతాదళ్-యునైటెడ్ నితీష్ కుమార్‌లపై కథనం వార్తా వెబ్‌సైట్ ‘ప్రపంచం’ అనే ప్రత్యేక పేజీలోని ‘ఆసియా’ ట్యాబ్ కింద ప్రచురితమైంది. గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు ప్రధాని మోదీ పార్టీ మెజారిటీ సీట్లను సులువుగా సొంతం చేసుకుందని ఆ కథనం పేర్కొంది. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్-యునైటెడ్ అనే రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ఒప్పందం కుదుర్చుకుందని కథనంలో ఉంది.
చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకమైన పదవులు అడిగే అవకాశం ఉందని కూడా కథనంలో పేర్కొన్నారు. ‘The New Kingmakers Who Could Make or Break Modi’s Government’ అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించడాన్ని మేము చూశాం. అంతేకానీ ఫ్రంట్ పేజీలో ప్రచురించలేదు. వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఒక కథనం న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించారు.
Claimed By : Social media users
Fact Check : Misleading