ఫ్యాక్ట్ చెక్: వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ అవ్వడం వల్ల అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించలేదు
వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ అవ్వడం వల్ల అల్లర్లు జరిగే ప్రమాదం ఉందంటూ ప్రధాని మోదీ;

ఫిబ్రవరి 13, 2025న పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) 2024 బిల్లును ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఎంపీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్ నివేదికను ప్రవేశపెట్టగా, రాజ్యసభలో బీజేపీ సభ్యుడు మేధా విశ్రామ్ కులకర్ణి ప్రవేశపెట్టారు.
కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ బిల్లుపై పలు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం మార్చి 27న రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటులో బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ తీర్మానానికి, అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)తో సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం లభించింది. భారతీయ జనతా పార్టీ (BJP) మాత్రమే ఈ చర్యను వ్యతిరేకించి వాకౌట్ చేసింది.
వక్ఫ్ చట్టం సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతూ ఉంది. అయితే విజయవాడలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ పార్టీతో పాటు జిల్లా కేంద్రాల్లో చేపట్టిన ఇఫ్తార్ పార్టీల్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పరిష్కరించింది.ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన వక్ఫ్ ఆస్తి హక్కును కాలరాసేలా కేంద్రం తెస్తున్న బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడంపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లాబోర్డు నాయకులు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్ మీటింగ్ కు సంబంధించిన ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"ప్రధాని నుండి చాలా తీవ్రమైన హెచ్చరిక.. దేశవ్యాప్తంగా అల్లర్లు మరియు
రక్తపాతానికి బలమైన అవకాశం..
వక్స్ బోర్డ్ బిల్లు పాసు కాబోతుంది..
భయంకరమైన సంక్షోభానికి సంకేతాలు..
వీడియోను త్వరగా వైరల్ చేయండి..
సాధ్యమైనంత త్వరగా స్థానిక కాలనీలలో
సమావేశం నిర్వహించండి..
అత్యంత అప్రమత్తత అవసరం..
రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండండి..
జై హింద్
వందేమాతరం
అన్ని హిందూ గ్రూపులకు పంపండి.." అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. వాట్సాప్ లో కూడా ఈ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాంటి వ్యాఖ్యలు చేశారా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. మాకు అలాంటి నివేదికలు ఏవీ కనిపించలేదు. ప్రధాని మోదీ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పనిసరిగా అది వార్తల్లో ప్రముఖంగా వచ్చి ఉండేది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. "PM Modi addresses at ceremony of developmental works at Bina, Madhya Pradesh" అనే టైటిల్ తో ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ కు సంబంధించిన వీడియోను Sansad TV యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారని గుర్తించాం. సెప్టెంబర్ 14, 2023లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం బీనాలో మోదీ పర్యటనకు సంబంధించిన విజువల్స్ ఇవని మేము ధృవీకరించాం. వైరల్ వీడియోలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు 24:44 వద్ద ప్రారంభమై 25:14 వద్ద ముగుస్తాయి. సనాతన ధర్మంపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని, దేశంలోని ప్రతి మూలలోనూ దాడులు జరిపే అవకాశం ఉందంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు.
అదే వీడియోను PMOINDIA యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేశారు.
ప్రధాని మోదీ 2023 సెప్టెంబర్ లో మధ్యప్రదేశ్ లోని బీనాలో పర్యటించారు . ఆయన వక్ఫ్ బోర్డు బిల్లు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని మాకు పలు నివేదికలు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
మధ్యప్రదేశ్‌లోని బినాలో ఉన్న బిపిసిఎల్ బినా రిఫైనరీలో డౌన్‌స్ట్రీమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.49,000 కోట్లు ఖర్చవుతుందని, 1200 కెటిపిఎ ఇథిలీన్, ప్రొపైలిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వస్త్రాలు, ప్యాకేజింగ్, ఔషధాలు వంటి బహుళ పరిశ్రమలకు ఈ రసాయనాలు చాలా అవసరమన్నారు ప్రధాని మోదీ.
ఇదే కార్యక్రమంలో ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారనే కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
'సనాతన ధర్మం' పై వివాదానికి మోదీ ప్రతిస్పందించారు. భారత సంస్కృతిపై దాడి చేసి 'సనాతన' సంస్కృతిని అంతం చేయాలని ప్రతిపక్ష కూటమి ఒక రహస్య ఎజెండాను అమలు చేస్తోందని ప్రధానమంత్రి విమర్శించారు. "ఈ INDIA కూటమిలోని ప్రజలు స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌లకు స్ఫూర్తినిచ్చిన 'సనాతన ధర్మాన్ని' తుడిచివేయాలనుకుంటున్నారు... ఈ INDIA కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోంది. నేడు వారు బహిరంగంగా సనాతనాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు, రేపు వారు మనపై దాడులను పెంచుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 'సనాతనులు' , మన దేశాన్ని ప్రేమించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని మనం ఆపాలి." అని చెప్పడం మనం ఆ స్పీచ్ లో వినొచ్చు.
కాబట్టి, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన వీడియో 2023లో సనాతన ధర్మంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్నది.
ఇండియా కూటమిపై చేసిన విమర్శలకు సంబంధించిన విజువల్స్ ను వక్ఫ్ బిల్లుకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ఇండియా కూటమిపై చేసిన విమర్శలకు సంబంధించిన విజువల్స్ ను వక్ఫ్ బిల్లుకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : 2023లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుడు వాదనతో వైరల్ చేస్తున్నారు
Claimed By : Social Media Users
Fact Check : Misleading