ఫ్యాక్ట్ చెక్: నీకు 15వేలు.. నీకు 15 వేలు.. అంటూ చేసిన స్కిట్ కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నవ్వలేదు
ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది;

మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు. మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ ఈవెంట్ సాగింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎమ్మెల్యేలందరికీ విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్‌లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితర నేతలు హాజరయ్యారు. కేవలం ఆటల పోటీలు మాత్రమే కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన కామెడీ స్కిట్ నవ్వులు పూయించింది.
ఉప సభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడు వేషధారణలో నటించి అదరగొట్టారు. ఏమంటివి ఏమంటివి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్‌తో ఆయన అందరిని అలరించారు. పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో ఏకాపాత్రాభినయంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మెప్పించారు.
అయితే నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ స్టేజీ మీద ఉన్న ఎమ్మెల్యేలు చెబుతూ ఉండగా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పడి పడి నవ్వినట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోకు 34000కు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఈవెంట్ కు సంబంధించి మాకు పలు వీడియోలు లభించాయి. ఆ వీడియోలను నిశితంగా గమనించగా ఎక్కడా కూడా నీకు 15 వేలు అంటూ స్కిట్ మాకు లభించలేదు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేసిన స్కిట్ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. సమయం సందర్భంగా లేకుండా పనికి మాలినోడు చేసే పనులపై స్కిట్ చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ పగలబడి నవ్వారు. పవన్ కల్యాణ్ అయితే కూర్చున్న సీట్లో ఎగిరెగిరిపడి నవ్వుకున్నారు.
ntv యూట్యూబ్ ఛానల్ లో "ఎమ్మెల్యేల కామెడీ స్కిట్.. పడి పడి నవ్విన చంద్రబాబు, పవన్ | AP Legislature Cultural Event | NTV" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలోని విజువల్స్, ఈ వీడియో లోని విజువల్స్ ఒకటేనని మేము గుర్తించాం. 'రాలిపోయే పువ్వా' అంటూ పాటపడుతున్నప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడీ, పడీ నవ్వారని మేము గుర్తించాం. అంతేకానీ నీకు 15 వేలు, నీకు 15 వేలు అనే స్కిట్ వేసినప్పుడు నవ్వలేదు.
వైరల్ అవుతున్న వీడియోలో నుండి ఆడియోను ఎడిట్ చేశారని మేము గుర్తించాం.
ఇక మేము కీవర్డ్స్ సెర్చ్ చేయగా పలు మీడియా కథనాలు మాకు లభించాయి.
"ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన కామెడీ స్కిట్ చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ ఈశ్వరరావు పాడుతూ అభినయిస్తుంటే... చంద్రబాబు, పవన్ పడీపడీ నవ్వారు." అంటూ నివేదించినట్లుగా పలు కథనాలు మాకు లభించాయి.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేసిన స్కిట్ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. సమయం సందర్భంగా లేకుండా పనికి మాలినోడు చేసే పనులపై స్కిట్ చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు, పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వారని ఈ కథనాలు తెలిపాయి.
ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు 2024 ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వ్యాఖ్యలను స్కిట్ లో ప్రదర్శించలేదు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేసిన స్కిట్ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. సమయం సందర్భంగా లేకుండా పనికి మాలినోడు చేసే పనులపై స్కిట్ చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ పగలబడి నవ్వారు. పవన్ కల్యాణ్ అయితే కూర్చున్న సీట్లో ఎగిరెగిరిపడి నవ్వుకున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారు
Claimed By : Social Media Users
Fact Check : False