ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద రోహింగ్యాలు తమ దేశ జెండాను ఎగురవేశారంటూ జరుగుతున్న వాదన నిజం కాదు

రోహింగ్యా ముస్లింలు ప్రధానంగా బౌద్ధ మయన్మార్‌లో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. అనేక తరాలుగా మయన్మార్‌లో రోహింగ్యాలు;

Update: 2025-03-28 06:00 GMT
Palestine flag waved

Palestine flag waved

  • whatsapp icon

రోహింగ్యా ముస్లింలు ప్రధానంగా బౌద్ధ మయన్మార్‌లో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. అనేక తరాలుగా మయన్మార్‌లో రోహింగ్యాలు నివసిస్తున్నప్పటికీ వారికి సరైన గుర్తింపు లేదు. ఎప్పుడూ వివక్షను ఎదుర్కొంటూనే ఉనానరు. 1982 నుండి పౌరసత్వం లభించలేదు. దీని వలన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీరికి మయన్మార్‌లో ప్రాథమిక హక్కులు, రక్షణ లభించలేదు. దీంతో ఇతర దేశాలలో తలదాచుకోడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో భారీ హింస చెలరేగిన తర్వాత ఆగస్టు 2017లో రోహింగ్యాల వలస ప్రారంభమైంది. లక్షలాది మంది బంగ్లాదేశ్, భారతదేశంతో సహా ఇతర చుట్టుపక్కల దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 40,000 మంది రోహింగ్యాలు భారతదేశంలోని జమ్మూ, హైదరాబాద్, ఢిల్లీ లలోని శిబిరాలలో నివసిస్తున్నారు. వారికి ఎటువంటి పత్రాలు లేవు.

ఇంతలో, “హైదరాబాద్ లో రోహింగ్యాలు! ఇది మా జెండా...! ఎవరేం పీకలేరు!” అంటూ ఓ వ్యక్తి జెండాను ఎగరేస్తున్న వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
Full View
“వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు బయ్య మనమే నిద్ర పోతున్నాం.. ఖాన్ గ్రేస్ అంటేనే ముస్లిమ్ పార్టీ, ముస్లిమ్ అంటేనే ఖాన్ గ్రేస్ పార్టీ అని మొన్న ఆమధ్య ఒక తలకు మాసినోడు చెప్పాడుగా.. 2047 టార్గెట్ వాళ్ళు కరెక్ట్ గానే ఫాలో అవుతున్నారు” అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. 
ఈ క్యాప్షన్స్ ద్వారా వైరల్ వీడియోలో ఉన్న వాళ్లు రోహింగ్యా ముస్లింలు అనే వాదనను ప్రచారం చేస్తున్నారు
.

క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 
వైరల్ వీడియోలో ఆ వ్యక్తి రోహింగ్యా జెండా లేదా బంగ్లాదేశ్ జెండాను ఊపడం లేదు. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సమయంలో పాలస్తీనా జెండాను ఊపుతున్నాడు. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికినప్పుడు అదే వీడియోను షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము. ‘The lost decade of 90s’ అనే యూట్యూబ్ ఛానల్ లో ‘During A Religious Procession, Palestinian Flag Being Waved At Charminar, Old City, Hyderabad.’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు.
Full View
ఫిబ్రవరి 15, 2025న షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో అదే వీడియోను “During the recent Milad un Nabi rally, a striking scene unfolded as the vibrant colors of Palestinian flags dominated the atmosphere, overshadowing the presence of Indian flags. This disparity raises important questions about our collective identity and the values we hold dear as a nation. As we celebrate this significant occasion, it's crucial to remember the essence of unity and pride in our diverse heritage. Each flag symbolizes not just a nationality but the spirit of community, coexistence, and respect for one another. [Milad-un-Nabi rally, Char Minar, Hyderabad]” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు.
"ఇటీవల జరిగిన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా, పాలస్తీనియన్ జెండాలు కనిపించాయి. భారతదేశ జెండాల ఉనికి కనిపించలేదు. ఈ అసమానత కొన్ని విలువల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ ముఖ్యమైన సందర్భాన్ని జరుపుకుంటున్నప్పుడు, మన విభిన్న వారసత్వంలో ఐక్యత, ఆత్మాభిమానాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి జెండా కేవలం ఒక జాతీయతను మాత్రమే కాకుండా, సమాజం, సహజీవనం, ఒకరినొకరు గౌరవించుకునే స్ఫూర్తిని సూచిస్తుంది. [మిలాద్-ఉన్-నబీ ర్యాలీ, చార్ మినార్, హైదరాబాద్]” అని ఆ క్యాప్షన్ సారాంశం.
‘During the Milad un Nabi rally, the Palestinian flag was prominently displayed.’ అనే క్యాప్షన్ తో అదే వీడియోను సెప్టెంబర్ 20, 2024న షేర్ చేశారు.
Full View
హన్స్ ఇండియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సెప్టెంబర్ 2024లో నిర్వహించారు. మర్కజీ మిలాద్ జూలూస్ కమిటీ ఓల్డ్ సిటీలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో వేల మంది ముస్లింలు, యువకులు పాల్గొన్నారు. ఫలక్‌నుమాలోని దర్గా క్వాద్రీ చమన్ నుండి అలియాబాద్ - శాలిబండ - మొఘల్‌పురా మీదుగా చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు వరకు సాగింది. చంద్రాయణగుట్ట - కాలపతేర్ - జహనుమా - మిస్రిగంజ్ - వట్టేపల్లి - బహదూర్‌పురా - తలబ్కట్ట అనేక ఇతర ప్రాంతాలలో ప్రజలు చిన్న చిన్న ఊరేగింపులలో పాల్గొని చార్మినార్ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరారు. మేము పాలస్తీనా జెండా కోసం గూగుల్ లో వెతకాగా, వైరల్ వీడియోలోని జెండా ఊరేగింపులో వాడిన జెండా ఒకటేనని తెలిసింది. 

వీడియోలోని జెండాను బంగ్లాదేశ్ జెండాతో పోల్చినప్పుడు, జెండాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని స్పష్టం అయ్యింది.

కాబట్టి, వైరల్ వీడియోలో రోహింగ్యాలు బంగ్లాదేశ్ జెండాను ఎగురవేస్తున్నట్లు చూపిస్తున్నారనే వాదన తప్పుదారి పట్టించేది. ఆ వ్యక్తి ఊపిన జెండా పాలస్తీనా జెండా. రోహింగ్యాలకు సంబంధించినది కాదు.
Claim :  వైరల్ వీడియోలో హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర రోహింగ్యా వర్గానికి చెందిన వ్యక్తులు బంగ్లాదేశ్ జెండాను ఊపడం చూడొచ్చు
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News