ఫ్యాక్ట్ చెక్: టాలీవుడ్ నటుడు చిరంజీవికి చెందిన లగ్జరీ క్రూజ్ షిప్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
టాలీవుడ్ నటుడు చిరంజీవికి UK పార్లమెంట్‌లో అరుదైన ఘనతను అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి,;

టాలీవుడ్ నటుడు చిరంజీవికి UK పార్లమెంట్‌లో అరుదైన ఘనతను అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చిరంజీవి చేసిన సేవలకుగానూ యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ, కల్చరల్ లీడర్షిప్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ప్రదానం చేసింది. బ్రిటన్ కి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఇక గతేడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డులను చిరంజీవి అందుకున్నారు. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఐఫా-అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవం కూడా చిరంజీవికి దక్కింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులతో కలిసి చిరంజీవి చిరంజీవి ఉన్న విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. 6075 కోట్ల రూపాయలతో విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌ను కొనుగోలు చేసినట్లు భారీ క్రూయిజ్ షిప్‌ల కొన్ని విజువల్స్ ను వీడియోలో చూడొచ్చు. ఈ ఓడ సునామీ లేదా భూకంపం వంటి వాటి వల్ల ప్రభావితం కాదని, మొత్తం ఓడ బుల్లెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అంటూ చెప్పడం వినొచ్చు. ఈ ఓడ లండన్, అమెరికా, లక్షద్వీప్ మొదలైన వాటికి మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ క్రూయిజ్ షిప్‌లో 350 కంటే ఎక్కువ బెడ్‌రూమ్‌లు, 474 కంటే ఎక్కువ బాత్రూమ్‌లు ఉన్నాయి. ఈ విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, వాటర్ పార్కులు మొదలైనవి ఉన్నాయి.
క్లెయిం కి చెందిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
చిరంజీవికి క్రూయిజ్ షిప్ ఉందనే వార్తల కోసం మేము వెతికినప్పుడు, అటువంటి వివరాలు స్థానిక లేదా జాతీయ నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు. వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, వీడియోలోని విజువల్స్ చాలా ఇతర వీడియోల నుండి తీసుకున్నట్లు మేము కనుగొన్నాము. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, వాటిని శోధించడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ వీడియో విభిన్న సంబంధం లేని విజువల్స్ ఉపయోగించి తయారు చేశారని మేము నిర్ధారించగలిగాం. వీడియో ఉన్న ముఖ్యమైన విజువల్స్ ను ఇక్కడ చూడొచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చిరంజీవి ఉన్న మొదటి విజువల్‌లో వారు హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను సందర్శించిన విజువల్స్ అని తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 2025లో హైదరాబాద్ శివార్లలోని ప్రొద్దుటూరు గ్రామంలో నిర్మించిన ప్రపంచ స్థాయి ఇమ్మర్సివ్ ఎకో-పార్క్ ఎక్స్‌పీరియంను ప్రారంభించారు. చిరంజీవితో పాటు, ఈ కార్యక్రమంలో పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాల కోసం వెతికినప్పుడు MSC సీస్కేప్ అనే క్రూయిజ్ షిప్ స్విట్జర్లాండ్‌కు చెందిన క్రూయిజ్ బ్రాండ్ MSC క్రూయిసెస్ నిర్వహిస్తున్న సముద్రతీర EVO-క్లాస్ షిప్ అని మేము కనుగొన్నాము. ఇది జియాన్‌లుయిగి అపోంటే స్థాపించిన స్విస్-ఇటాలియన్ సమ్మేళనం అయిన MSC గ్రూప్‌లో భాగం. ఈ నౌకను ఇటలీలోని మోన్‌ఫాల్కోన్ షిప్‌యార్డ్‌లో ఫిన్‌కాంటియరీ నిర్మించారు. నవంబర్ 2021లో బయలుదేరి, ఆగస్టు 2022లో మొదటి ఇంటెన్సివ్ సముద్ర పరీక్షలను పూర్తి చేసింది. నవంబర్ 2022లో డెలివరీ చేశారు. పది నౌకలకు €7 బిలియన్ పెట్టుబడి ప్యాకేజీలో భాగంగా MSC క్రూయిసెస్ కోసం ఫిన్‌కాంటియరీ నిర్మించిన నాల్గవ నౌక MSC సీస్కేప్.
వీడియోలో ఉన్న మరో దృశ్యం 'నార్వేజియన్ వివా' అనే క్రూయిజ్ షిప్ కు సంబంధించింది.
వీడియోలో ఉన్న మరో దృశ్యం 'నార్వేజియన్ వివా' అనే క్రూయిజ్ షిప్ కు సంబంధించింది.
'నార్వేజియన్ వివా' అమెరికాలోని క్రూయిజ్ లైన్ అయిన నార్వేజియన్ క్రూయిజ్ లైన్ (NCL) నిర్వహించే ప్రైమా-క్లాస్ క్రూయిజ్ షిప్. ఈ నౌకను ఇటలీలోని మార్గెరాలో షిప్‌బిల్డింగ్ కంపెనీ ఫిన్కాంటియరీ నిర్మించింది. NCL ఆగస్టు 2023లో నార్వేజియన్ వివా డెలివరీని తీసుకుంది. క్రూయిజ్ లైన్ కోసం నిర్మించిన ఆరు ప్రైమా-క్లాస్ నౌకలలో ఇది రెండవది. క్రూయిజ్ షిప్‌లోని రంగురంగుల వాటర్ థీమ్ పార్కులను చూపించే విజువల్‌ను శోధించినప్పుడు, ఆ విజువల్ సింఫనీ ఆఫ్ ది సీస్ అనే మరో క్రూయిజ్ షిప్‌కు చెందినదని తెలుసుకున్నాం.
USA టుడే ప్రకారం, సింఫనీ ఇప్పటివరకు అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది దాదాపు 100 అడుగుల ఎత్తుకు దూకే థ్రిల్ స్లయిడ్ మరియు రోబోట్ బార్టెండర్‌తో కూడిన బయోనిక్ బార్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సింఫనీలో మూడు ప్రధాన పూల్ ప్రాంతాలు, వాటర్ స్లయిడ్ కాంప్లెక్స్, పెద్దలకు మాత్రమే అనుమతిచ్చే సోలారియం, ఐస్ స్కేటింగ్ రింక్, రెండు రాక్ క్లైంబింగ్ వాల్స్, బాస్కెట్‌బాల్ కోర్టు, దుకాణాలు, బార్‌లు, తినుబండారాలతో కూడిన మాల్ లాంటి ఇండోర్ ప్రొమెనేడ్ ఉన్నాయి.
ఈ నౌక మియామికి చెందిన రాయల్ కరేబియన్ క్రూయిజ్ లైన్ యాజమాన్యంలో ఉంది.
ఒక భారీ షాపింగ్ కాంప్లెక్స్‌ను చూపించే మరో దృశ్యం, అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన దుబాయ్ షాపింగ్ మాల్ వీడియో అని గుర్తించాం.
Full View
చిరంజీవి యాజమాన్యంలో ఉన్న సంస్థల గురించి మేము శోధించినప్పుడు, కొణిదెల నిర్మాణ సంస్థ తప్ప మరెక్కడా మాకు కనిపించలేదు. ఆయన కుమారుడు రామ్ చరణ్ పేరుతో శోధించినప్పుడు, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్, ట్రూజెట్ (గతంలో టర్బో మేఘా ఎయిర్‌వేస్), టీం హైదరాబాద్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) వంటి కొన్ని కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. అయితే చిరంజీవి పేరు మీద ఎలాంటి క్రూయిజ్ షిప్ లేదు.

అందువల్ల, ఈ వైరల్ వీడియోను వివిధ క్రూయిజ్ షిప్‌ల విజువల్స్‌తో పాటు, చిరంజీవికి సంబంధించిన వివిధ విజువల్స్‌ను కూడా కలిపి సృష్టించారు. ఈ వీడియోను తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు.
Claim : టాలీవుడ్ నటుడు చిరంజీవి 2023లో ఒక విలాసవంతమైన క్రూయిజ్ షిప్ ని కొన్నారు. నెలకు దాదాపు 125 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
Claimed By : Instagram Users
Fact Check : False