ఫ్యాక్ట్ చెక్: సూరత్ పోలీసులకు లభించిన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ-స్కూటర్లు చైనా లో చేసినవి కాదు

శాంతిభద్రతలను కాపాడటం, జాతీయ భద్రతను చూసుకోవడం, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పోలీసు దళాలకు నాయకత్వం వహించడం, స్థిరమైన,;

Update: 2025-04-02 10:18 GMT
E-bikes

E-bikes

  • whatsapp icon

శాంతిభద్రతలను కాపాడటం, జాతీయ భద్రతను చూసుకోవడం, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పోలీసు దళాలకు నాయకత్వం వహించడం, స్థిరమైన, సురక్షితమైన పాలనను అందించడంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) కీలకమైనది. ప్రజా భద్రతను నిర్ధారించడంలో IPS కీలక పాత్ర పోషిస్తుంది. నేరాలను అడ్డుకోవడం, దర్యాప్తు చేయడం, నేరస్థులను పట్టుకోవడం, న్యాయం అందించడం IPS అధికారుల బాధ్యత. ముఖ్యంగా ఎన్నికలు, ఇతర సందర్భాలలో ప్రజలను రక్షించడం, సమస్యలు లేకుండా చేయడం, అవాంతరాలను నివారించడంలో పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. IPS అధికారులు నిఘా వ్యవస్థలోనూ కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు, ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు, సరిహద్దులను రక్షించడంలో పాల్గొంటారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితులలో వారు కీలకమైన మద్దతును అందిస్తారు.

అయితే, ఇటీవల సూరత్ పోలీసులు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ-స్కూటర్లను నడుపుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రోత్సహించడానికి గుజరాత్ ప్రభుత్వం చైనా నుండి ఈ-స్కూటర్లను దిగుమతి చేసుకుందని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో సూరత్ పోలీసులు, గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి కొత్తగా కొనుగోలు చేసిన సెల్ఫ్ రైడింగ్ ఈ-స్కూటర్లను నడుపుతున్నట్లు చూడొచ్చు. కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను “मेक इन इण्डिया को बढ़ावा देते हुए गुजरात सरकार ने पुलिस के लिए चाइना से ई बाइक खरीदा है।“ హిందీ క్యాప్షన్‌తో షేర్ చేశారు.
కొంతమంది ‘సూరత్ పోలీసులు పెట్రోలింగ్ కోసం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ-బైక్‌లనుతీసుకొచ్చారు, చైనా నుండి దిగుమతి చేసుకున్నారా?’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు.


వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. వీడియోలో ఉపయోగించిన సెల్ఫ్ రైడింగ్ ఈ-స్కూటర్లను ఒక భారతీయ కంపెనీ తయారు చేసింది. ముందుగా, ఈ-స్కూటర్ల గురించి వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించాం, 'ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) చొరవలో భాగంగా 'ప్రాజెక్ట్ గ్రీన్' కింద, సూరత్ నగరం, జిల్లా పోలీసులకు 25 సెల్ఫ్-బ్యాలెన్సింగ్ ఈ-బైక్‌లను అందజేసింది' అని పేర్కొన్న కొన్ని వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
హోం శాఖ సహాయ మంత్రి హర్ష్‌భాయ్ సంఘవి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సెల్ఫ్-బ్యాలెన్సింగ్ ఈ-బైక్‌లు పెట్రోలింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇరుకైన వీధులు, రద్దీగా ఉండే మార్కెట్‌ప్లేస్‌లు, ఈవెంట్ వేదికలు వంటి నాలుగు చక్రాల వాహనాల యాక్సెసిబిలిటీ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ఇవి ఎంతగానో పోలీసులకు సహాయపడతాయి. ఈ బైక్‌లు పోలీసు దళం వేగవంతమైన ప్రతిస్పందనలకు అవకాశం ఇస్తాయి.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికాం, వీడియోలో కనిపించే ఇ-స్కూటర్‌లను ఫ్రీగో అనే భారతీయ కంపెనీ తయారు చేసిందని పేర్కొన్న కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు లభించాయి. ఫ్రీగో బైక్‌లు భారతదేశంలో తయారయ్యాయని అని ఒక X వినియోగదారు పేర్కొన్నారు. సూరత్ పోలీసులు తమ CSRలో భాగంగా ఆర్సెల్లర్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ నుండి విరాళంగా దీనిని పొందారని తెలిపారు. వాటిని కొనాలనుకుంటున్న వాళ్లకు లింక్ కూడా ఇచ్చారు.
ఈ-స్కాటర్ల గురించి మరింత సమాచారం కోసం శోధించినప్పుడు, వాటిపై ‘ఫ్రీగో’ అనే పేరు కనిపించింది.

ఫ్రీగో వెబ్‌సైట్‌లో, ఆ కంపెనీ మహారాష్ట్రకు చెందిన కంపెనీ అని తెలుసుకున్నాం. జీరో-ఎమిషన్ వ్యక్తిగత రవాణా వాహనంగా పేర్కొనబడిన ఈ-బైక్‌ల గురించి మరింత సమాచారం లభించింది. దీనిని ఫ్రీగో బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసింది. దాని వినూత్న గైరోస్కోప్ టెక్నాలజీ, డైనమిక్ స్టెబిలైజేషన్‌తో, ఫ్రీగో సుదూర ప్రాంతాలలో సౌకర్యవంతమైన కదలిక కోసం సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని అందిస్తుంది.
ఫ్రీగో బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి మరింత శోధించినప్పుడు, ఫ్రీగో బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CIN: U34300MH2018PTC308158) అనేది 17 డిసెంబర్ 2018న స్థాపించిన ఒక ప్రైవేట్ కంపెనీ అని మేము కనుగొన్నాము. ఇది ప్రభుత్వేతర కంపెనీ అని, ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేశారు.
సూరత్ పోలీసులకు బహుమతిగా ఇచ్చిన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ-స్కూటర్లు చైనాలో తయారు చేశారనే వాదనలో నిజం లేదు. ఈ ఈ-బైక్‌లను భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన ఫ్రీగో అనే భారతీయ కంపెనీ తయారు చేసింది.
Claim :  సూరత్ పోలీసులు పెట్రోలింగ్ కోసం కొనుగోలు చేసిన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ-స్కూటర్లు చైనా లో తయారు అయినవి
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News