ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో ప్రజలకు అవగాహన కల్పించడంలో ఒక భాగం

భారతదేశం విభిన్న సంస్కృతులకు, అద్భుతలకు, గొప్ప వారసత్వ సంపదకు నిలయం. ఎన్నో మతాలకు చెందిన వాళ్లు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు;

Update: 2025-03-25 12:14 GMT
News Nation debate program

News Nation debate program

  • whatsapp icon

భారతదేశం విభిన్న సంస్కృతులకు, అద్భుతలకు, గొప్ప వారసత్వ సంపదకు నిలయం. ఎన్నో మతాలకు చెందిన వాళ్లు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని సాధువుల భూమిగా పరిగణిస్తారు. అనేక మంది గొప్ప గొప్ప సాధువులు, గురువులు తమ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక అవగాహనను ప్రజలకు పంచారు. ఆయన వ్యక్తుల బోధనలు, ప్రత్యేకతలు కారణంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచారు. అలాంటి వ్యక్తులు చెప్పిన దాన్ని నమ్మే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారిని దైవంగా భావించి కొలిచేవాళ్లు కూడా లేకపోలేదు. కొందరి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, మోసగాళ్ళు సాధువుల వేషంలో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. మోసం చేయడాన్నే పనిగా పెట్టుకుని చిన్న చిన్న టెక్నీక్లను నేర్చుకుని తామే దేవుళ్లుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు.

సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో ఒక వ్యక్తి ఇతరులతో కలిసి కూర్చుని ఉండగా కొబ్బరికాయను గాల్లోకి ఎగరేస్తున్నట్లు ఓ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోను “ये देखिए कुलदीप मिश्रा का फ्रॉड। नारियल को हवा में उड़ा रहे हैं। जबकि साफ़-साफ़ दिख रहा है वो धागे से बंधा हुआ है। ఇలాంటి క్యాప్షన్స్ తో వైరల్ చేశారు. కుల్దీప్ మిశ్రా అనే వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తాడని, అతడు ఏకంగా కొబ్బరికాయను గాల్లోకి ఎగరేస్తున్నాడని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
“Godi Media EXPOSED 😱 News Nation Fake magic nariyal Video viral| Jadugar Kuldeep Mishra News Nation” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
Full View
కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు అదే వీడియోను షేర్ చేస్తూ, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని మోసగాడని చెప్పడం మొదలుపెట్టారు. అలాంటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానెల్‌ ప్రజలను మోసం చేస్తోందంటూ విమర్శించారు.


క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి న్యూస్ నేషన్ అనే టీవీ ఛానల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెషనల్ మెజీషియన్.

మొదటగా, వీడియో మొదట న్యూస్ నేషన్ షేర్ చేసిన డిస్క్లైమర్ ను చూడొచ్చు. ఈ డిస్క్లైమర్ ఇలా ఉంది. "డిస్క్లైమర్ - 'ఆపరేషన్ పాఖండ్' అనేది న్యూస్ నేషన్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డిబేట్ సీరీస్. న్యూస్ నేషన్ లక్ష్యం ఎవరి మనోభావాలను లేదా నమ్మకాలను దెబ్బతీయడం కాదు; బదులుగా, అద్భుత శక్తులను చూపించే వారి గురించి మిమ్మల్ని హెచ్చరించడమే లక్ష్యం. న్యూస్ నేషన్ ఎలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించదు" అని పేర్కొంటూ అన్ని వీడియోలపై ఒక డిస్క్లైమర్ ప్రచురించబడింది. 


వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మార్చి 3, 2025న న్యూస్ నేషన్ ప్రచురించిన వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. దాని శీర్షిక “Operation Pakhand: बाबा का दावा, अभिमंत्रित जल से होगा इलाज? udta nariyal Viral Video news nation” అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు. వీడియోలో, దయానంద్ మహారాజ్ అనే వ్యక్తితో వాదిస్తున్న కొంతమందిని చూడవచ్చు. స్టూడియోలో కూర్చున్న వ్యక్తులు మతం పేరుతో బాబాలు చేసిన మాయలు, మోసాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Full View
దేవుని పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే మోసగాళ్లను కానీపెట్టడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులతో న్యూస్ నేషన్ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌లో ప్రచురించిన అన్ని వీడియోలను చూపించే లింక్ ఇక్కడ ఉంది. ఆపరేషన్ పాఖండ్ కింద ప్రచురించబడిన మరొక వీడియో ఇక్కడ చూడొచ్చు, దీనిలో యాంకర్ మరొక బాబా మోసాలను బయటపెట్టడానికి ప్రయత్నించారు.
Full View
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగం. భక్తి పేరుతో చేస్తున్న మాయలను బహిర్గతం చేసే సామాజిక అవగాహన కార్యక్రమంలో ఈ వీడియో ఒక భాగం మాత్రమే. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 
Claim :  ఒక టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో కుల్దీప్ మిశ్రా అనే వ్యక్తి తన మ్యాజిక్ ట్రిక్‌లో భాగంగా కొబ్బరి కాయను గాల్లో ఎగరేస్తున్నారు
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News